For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెక్ట్స్ నువ్వే మూవీ రివ్యూ: మరో హారర్ థ్రిల్లర్

By Rajababu
|

Rating:
2.5/5
Star Cast: ఆది సాయికుమార్, వైభవి సంధ్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ
Director: ప్రభాకర్ పడకండ్ల

Next Nuvve Movie Public Talk నెక్ట్స్ నువ్వే పబ్లిక్ టాక్

టాలీవుడ్‌లో కామెడీ, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. చిన్న చిత్రాలుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హారర్ కామెడీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం నెక్ట్స్ నువ్వే. బుల్లితెర మీద మెగాస్టార్‌‌గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సుమన్ మరణం తీరని లోటు.. దేవుడు వేసిన శిక్ష.. అల్లు శిరీష్ దేవుడు.. ప్రభాకర్

ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం బాధ్యతలు చేపట్టి రూపొందించిన నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్ వంశీ తదితరులు నిర్మించారు. రష్మీ గౌతమ్, ఆది సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ నటించిన చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న నెక్ట్స్ నువ్వే ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

నెక్ట్స్ నువ్వే కథ ఇలా..

ప్రముఖ దర్శకులు బాపు, రాఘవేంద్రరావు, రాజమౌళిలా గొప్ప దర్శకుడు కావాలనే కోరిక ఉన్న కిరణ్ (ఆది) ఓ టెలి సీరియల్ డైరెక్టర్. ఓ గుండా (జయప్రకాశ్) గ్యాంగ్‌కు మస్కా కొట్టి టెలిసీరియల్ నిర్మించే పనిలో పడుతాడు. కానీ ఆ సీరియల్ ఎందుకో ఆగిపోవడంతో కష్టాల్లో పడుతాడు. సీరియల్ కోసం పెట్టిన డబ్బులు వెనకకు ఇవ్వాలని గుండాలు కిరణ్‌ను వేధిస్తుంటారు. ఇలాంటి సమయంలో తన పేరిట ఓ ప్యాలెస్ ఉంది అనే లేఖను తండ్రి (పోసాని కృష్ణమురళి) పంపుతాడు.

సస్పెన్స్‌కు తెరదించిందిలా..

తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి తన ప్రేయసి (స్మిత)తో వెళ్లిన కిరణ్‌కు భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఓ దెయ్యం (హిమజ) వీళ్లను వెంటాడుతుంటుంది. హిమజ ఎందుకు దెయ్యం అయింది? వీరిని ఎందుకు వేధించింది? ఆ దెయ్యం బారి నుంచి ఎలా తప్పించుకొన్నారు? ఆ ప్యాలెస్‌కు శరత్ (బ్రహ్మాజీ), రష్మీ (రష్మీ గౌతమ్)కు ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే నెక్ట్స్ నువ్వే సినిమా కథ.

ఫస్టాఫ్‌లో నత్త నడక

హీరో ఆది పడే కష్టాలతో నెక్ట్స్ నువ్వే చిత్రం ప్రారంభమవుతుంది. తనకు వారసత్వంగా వచ్చిన ప్యాలెస్‌లోకి ప్రవేశించి దానిని రిసార్టుగా మార్చడం, ఆ తర్వాత దానిలో వచ్చిన గెస్టులు మృత్యు బారిన పడటంతో కథ వేగం పుంజుకొంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు రొటీన్‌గా సీన్లు కొంత అసహనం కలిగించేలా ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్‌లో ఓ టిస్ట్ ఇవ్వడంతో రెండో భాగంలో ఆసక్తి పెరుగుతుంది.

సెకండాఫ్ ఇలా

కథలో ముడి విప్పడానికి రెండో భాగంలో కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నప్పటికీ.. అవసరాల శ్రీనివాస్ ఎపిసోడ్‌తో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పటిలానే రొటీన్ సీన్లు విసుగు పుట్టిస్తాయి. కథలో వేగం తగ్గుతుంది. క్లైమాక్స్ కోసం సన్నివేశాలను సాగదీసినట్టు ఉంటాయి. కాకపోతే కామెడీతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. కాకపోతే కొత్త తరహా సీన్లు ఉండి ఉంటే హారర్ సినిమాల్లో నెక్ట్స్ నువ్వే మరోస్థాయి చిత్రంగా మారే అవకాశం ఉండేది. పాత్రలు వచ్చిపోతూ కనిపిస్తాయి గానీ వాటిలో పెద్దగా క్లారిటీ కనిపించదు. లాజిక్కులు ఉండవు. కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం.

దర్శకుడిగా ప్రభాకర్ భేష్

టెలివిజన్ రంగంలో దశాబ్దకాలానికి పైగా ఓ వెలుగు వెలిగిన ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంలో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఆదరిస్తున్న హారర్, కామెడీ జోనర్‌ను ఎంచుకొన్నారు. అయితే కథ, సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ ఉండేలా చూసుకొని ఉండి ఉంటే మరింత బాగుండేది. దర్శకుడిగా ప్రభాకర్ తన వరకు భేష్ అనిపించేలా సినిమాను హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. సరైన కథ దొరికితే ప్రభాకర్ విలక్షణమైన దర్శకుడిగా మారే అవకాశాలున్నాయనేది నెక్ట్స్ నువ్వే ద్వారా స్పష్టమైంది.

ఒకే అనిపించిన ఆది

ఆది కెరీర్‌ పరంగా చూసుకొంటే నెక్ట్స్ నువ్వే కొంత పేరు తెచ్చే చిత్రమనే చెప్పవచ్చు. హారర్, కామెడీ జోనర్‌లో ఆదిని చూడటం ప్రేక్షకులకు కొత్తే. నటనపరంగా లోపాల గురించి వెతకడానికి పెద్దగా ఆది స్కోప్ ఇవ్వలేదు. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు. కీలక సన్నివేశాల్లో పాత్ర కోసం ఆది పడిన కష్టం తెరపైన కనిపిస్తుంది.

బ్రహ్మజీ అదుర్స్

నెక్ట్స్ నువ్వే చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర సీనియర్ నటుడు బ్రహ్మాజీది. సినిమా భారాన్ని మొత్తం బ్రహ్మాజీ తన భుజాన వేసుకొన్నాడు. కామెడీ టైమింగ్‌తో మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఇప్పటి వరకు గెస్ట్ పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్న బ్రహ్మాజీ ఈ చిత్రంలో ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు కనిపించి సినిమాను నిలబెట్టాడనడంలో సందేహం అక్కర్లేదు.

ఆకట్టుకోని రష్మీ, వైభవి

నెక్ట్స్ నువ్వేలో రష్మీ గౌతమ్, వైభవి, హిమజ‌ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ సోదరిగా రష్మీ కనిపించగా, వైభవి ఆది ప్రేయసిగా నటించింది. ఈ చిత్రంలో మరో కీలకపాత్రలో టీవీ నటి హిమజ కనిపించింది. హిమజ కాకుండా మరో నటి ఉంటే ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయి ఉండేదేమో. హీరోయిన్లు పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. పాత్రల్లో వారి నటనకు స్కోప్ తక్కువే కావడంతో అలంకారప్రాయంగానే మిగిలారు. హీరోయిన్ల మేకప్ చాలా నాసిరకంగా ఉంది.

కామెడీ.. కమెడియన్లు

నెక్ట్స్ నువ్వే చిత్రంలో కమెడియన్ల సంఖ్య భారీగానే ఉంది. కానీ రొటీన్ కామెడీతోనే సరిపెట్టారు. జయప్రకాశ్, రఘు, ఎల్బీ శ్రీరాం, రఘుబాబు ఇంకా చాలా మంది కనిపించారు. జయప్రకాశ్‌ది రొటిన్ రౌడీ పాత్ర. దయ్యాలను పారదోలే హైటెక్ మాంత్రికుడు ఆర్జీవి (రఘుబాబు) కనిపించాడు. ఆర్జీవి పాత్ర ద్వారా తనదైన కామెడీని పండించాడు.

సాయి కార్తీక్ మ్యూజిక్

నెక్ట్స్ నువ్వే చిత్రంలో పాటల విషయానికి వస్తే రెండు పాటలు పర్వాలేదనిపించే రేంజ్‌లో ఉన్నాయి. రీరికార్డింగ్ హోరు కాస్త ఎక్కువగానే ఉంది. కొంత క్వాలిటీ విషయంలో రాజీ పడినట్టు కనిపించింది. అందుకే సినిమాలో ఓ ఫీల్ మిస్ అయిందనే భావన కలుగుతుంది.

ఎడిటింగ్, సాంకేతిక విభాగాలు

మిగితా సాంకేతిక విభాగాల పనితీరు ఓకేలా అనిపిస్తాయి. నైట్ ఎఫెక్ట్ సీన్లు, హారర్ సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. తొలిభాగంలోనూ, రెండో భాగంలోనూ కొన్ని సీన్లు సాగదీసినట్టుగా ఉంటాయి. వాటిపై ఇంకా కత్తెర్లు పాడాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

యూవీ క్రియేషన్, గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, బన్నీవాసు కలయికతో వీ4 అనే బ్యానర్‌పై నెక్ట్స్ నువ్వే రూపొందింది. కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ చిత్రాని రూపొందించారు. కాన్సెప్ట్ విషయంలోనూ, నటీనటుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త పడినట్టు కనిపించదు. నిర్మాణ విలువల విషయానికి వస్తే బీ గ్రేడ్ ఆర్టిస్టులతో చుట్టేసినట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్

ఆది, బ్రహ్మాజీ యాక్టింగ్

ప్రభాకర్ టేకింగ్

మైనస్ పాయింట్స్
కథ, కథనం
ఎడిటింగ్
రీరికార్డింగ్
నటీనటుల ఎంపిక

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: ఆది, వైభవి సంధ్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ

దర్శకత్వం: ఈటీవీ ప్రభాకర్ పడకండ్ల
నిర్మాతలు: బన్నీవాసు, కేఈజీ రాజా, అల్లు అరవింద్, వంశీ
సంగీతం: సాయి కార్తీక్

English summary
ETV Prabhakar is mega star on the Telugu Television Industry. He played many roles on small screen. Now He becomes director for the Next Nuvve movie. This movie is released on November 3rd. In this occasion, Telugu Filmibeat brings you a exclusive review for readers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more