For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టైమ్ కు రాని....కలసిరాని ('కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  స్పీడుగా,సురక్షితంగా డెలవరీ అవటానికే సాధారణంగా కొరియర్ ని ఆశ్రయిస్తూంటారు. అయితే ఈ 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' మాత్రం బాగా లేటుగా అంటే రెండు సంవత్సరాలు పాటు సమయం తీసుకుని సినిమాని డెలవరీ చేసాడు...పోనీ లేటైనా, ఇన్నాళ్లకైనా మిస్సవకుండా వచ్చింది కదా అని ఆత్రంగా కొరియర్ విప్పితే అందులో అసలు కంటెంట్ కరువు అయ్యింది. దాంతో టోటల్ గా ఈ కొరియర్ లక్ష్యమే మిస్సైంది. చూసిన వాళ్లకు, తీసిన వాళ్లకు సమయం, సొమ్ము వృధా అవ్వటం తప్ప ఫలితం లేకుండా పోయింది. అప్పటికీ నితిన్ ఉషారుగా నటిస్తూ సినిమాని గట్టెక్కిద్దామని ప్రయత్నించినా సినిమాలోని థిన్ లైన్ కు సమకూర్చిన స్క్రీన్ ప్లే ఎంతమాత్రమూ కలిసిరాలేదు. దాంతో పాయింట్ కొత్తదయినా సినిమా బోర్ గా మారిపోయి సహన పరీక్ష పెట్టింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కొరియర్ బాయ్ కళ్యాణ్ (నితిన్) కి ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఓ కొరియర్ డెలవరీ చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ కొరియర్ లో ఓ పెద్ద స్కామ్ కు సంభందించిన డిటేల్స్ ఉంటాయి. ఆ స్కామ్ ... స్టెమ్ సెల్స్ కు సంభందించింది. ఓ సైంటిస్ట్ (అశుతోష్ రానా) తన ప్రయోగాల కోసం చాలా మంది గర్భణీలను బలిచేస్తూంటాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వార్డు బోయ్ (ఇంటూరి వాసు)...సామాజిక కార్యకర్త సత్యమూర్తి(నాసర్) కు ఆ సీక్రెట్స్ కు సంభిందించిన కొరియర్ చేస్తాడు. ఇప్పుడా కొరియర్ ...మన హీరో కళ్యాణ్ చేతికి వస్తుంది. ఈ విషయం విలన్స్ కు తెలుస్తుంది. వారు ఆ కొరియర్ ఆపాలని ప్రయత్నాలు మొదలెడతారు. ఇంతకీ కళ్యాణ్ ఆ కొరియర్ ని అందచేయగలిగాడా...హీరోయిన్ కావ్య(యామి గౌతమి)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  కొత్తగా ఏదో చెప్పాలన్న దర్శకుడు తాపత్రయంతో ఈ పాయింట్ ని రెడీ చేసుకున్నట్లు కనపడుంది. అయితే తనను ఎగ్జైట్ చేసిన స్టోరీ ఐడినా ను కథగా మలచి, స్క్రీన్ ప్లే తయారుచేసుకోవటంలో ఘోరంగా విఫలమయ్యాడు దర్శకుడు. హీరోని యాక్షన్ లో దింపటానికి ఉన్న ఏకైక ఎలిమెంట్ ..విలన్ కు సంభందించిన రహస్యాలు ఉన్న కొరియర్ అతని చేతికి చేరటం. అయితే సెకండాఫ్ సగం పూర్తయ్యి, ప్రీ క్లైమాక్స్ కు వచ్చేదాకా ఆ పాయింట్ ని రీచ్ కాదు. హీరోకు అప్పటివరకూ సినిమాలో పనిలేకుండా పోయింది. దర్శకుడు పెట్టిన పని లేని కళ్యాణ్ అనేదే సినిమా స్క్రీన్ ప్లే లో కూడా ఫాలో అయినట్లు అనిపిస్తుంది. దాంతో కథకు సంభంధం లేని లవ్ ట్రాక్, కామెడీలతో సినిమాని నింపేయాల్సిన పరిస్దితి ఏర్పడింది.

  నితిన్ విషయానికి వస్తే...తన రెగ్యులర్ ప్రేమ కథలకు భిన్నంగా ఓ థ్రిల్లర్ తరహా సబ్జెక్టుని ఎన్నుకోవటం మంచి విషయమే. అయితే అదే సమయంలో స్క్రిప్టుని కూడా పూర్తిగా పరిశీలించాల్సింది. కాకపోతే గౌతమ్ మీనన్ వంటి దర్శకుడు రికమెండ్ చేసినప్పుడు అది కష్టమైన విషయమే అనుకోండి. ఈ చిత్రంతో పరిచయమైన ఈ దర్శకుడుకు కొత్తగా ఏదో చెప్పాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ దానికి దగ్గ ఎగ్జిక్యూషన్ మాత్రం లేదని స్పష్టమవుతుంది.

  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే ఈ తరహా నేరేషన్ కు పాటలు ఎడాప్ట్ చేయటం చాలా కష్టం. అవి కావాలని కథనానికి అడ్డు పడుతూ ఇబ్బంది పెట్టడం తప్ప ఫలితం లేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మరింత మెరుగుగా చేయిస్తే ఇంకాస్త బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్బుతం కాదు కానీ బాగున్నాయి.

  ఫైనల్ గా ...లెంగ్త్ కూడా బాగా తక్కువ ఉన్న ఈ సినిమాని అంత సేపు కూడా భరించటం కష్టమనిపిస్తుంది. అలాగే స్టోరీ పాయింట్ వెరైటీగా అనకుంటే సరిపోదు దానికి తగ్గ కథా విస్తరణ, స్క్రీన్ ప్లే ఉంటేనే చూడగలం అని మరోసారి ప్రూవ్ చేస్తుందీ సినిమా.

  Nithiin's Courier Boy Kalyan review


  బ్యానర్: గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ సంస్థ
  నటీనటులు: నితిన్,యామి గౌతమ్‌ , అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు
  కెమెరా: సత్య పొన్‌మార్‌,
  ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి,
  రచనా సహకారం: కోన వెంకట్‌, హర్షవర్ధన్‌,
  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: స్వాతి రఘురామన్‌, విజయ్‌ శంకర్‌.
  సమర్పకుడు: గౌతమ్‌ మేనన్‌
  సంగీతం: కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ ,
  బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ : సందీప్‌ చౌతా
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌ సాయి
  నిర్మాణం: గురుఫిల్మ్స్, మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  విడుదల తేదీ :సెప్టెంబర్ 17, 2015.

  English summary
  Nithin's much delayed project Courier Boy Kalyan, produced by Gautam Menon and directed by Prem Sai, has finally seen light today as it released on the auspicious day of Vinayaka Chaturthi. His fans as well as movie buffs are appreciating the actor for his attempt, though the film has been getting a mixed response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X