For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాస్ కాదు..మూస(బృందావనం రివ్యూ)

  By Srikanya
  |

  Brindavanam
  Rating

  -జోశ్యుల సూర్య ప్రకాష్

  చిత్రం : బృందావనం

  సంస్ధ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  నటీనటులు: ఎన్టీఆర్, కాజల్, సమంత, శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట, ముఖేష్ రుషి, వేణు మాధవ్, బ్రహ్మానందం,తనికెళ్ళ తదితరులు.

  డైలాగ్స్ : కొరటాల శివ

  సంగీతం: తమన్

  ఆర్ట్ : ఆనంద సాయి

  సినిమాటోగ్రఫీ : ఛోటా కె. నాయుడు

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి

  సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

  నిర్మాత : దిల్ రాజు

  విడుదల తేదీ : 14/10/2010

  టైటిలూ,పోస్టర్స్,ప్రోమోలు చూసిన వారు..ఏంటీ ఈ మాస్ హీరో క్లాస్ లుక్స్ తో కనపడుతున్నాడు..ఏదో అద్భుతం జరుగుతుందని ఆశపడ్డారు. అయితే బాగా నలిగిన ఫార్ములా కథతోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. కథ ఎత్తుగడ కొత్తగా అనిపించినా ఉత్తినే ఊహించగలిగే ట్విస్ట్స్,రెగ్యులర్ క్లైమాక్స్ ఆసక్తి అనిపించవు. కానీ తెలిసిన కామిడీనే అయినా ధియోటర్స్ లో చాలా చోట్ల నవ్వులు పంచగలగడం సినిమాకు ప్లస్సై నిలిచింది. దాంతో ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్ళే ప్రేక్షకుడుకి బాగుంది అనే ఫీలింగ్ తో బయిటకు వస్తాడు. అయితే ఈ కథని ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఏ హీరో అయినా ఈజీగా చేసేయచ్చు..ఎన్టీఆర్ స్టామినాకి తగ్గ ప్రత్యేకత ఇందులో ఏమీ లేదనదే నిజమైన అభిమానులను నిరుత్సాహపరిచే అంశం.

  కృష్ణ అలియాస్ క్రిష్(ఎన్టీఆర్) సిటీలోని పెద్ద కోటీశ్వరుడు(ముఖేష్ రుషి) కొడుకు. ఖాలీగా ఉన్నప్పుడు ప్రెండ్స్ కి ప్రేమ పెళ్ళిళ్లు గట్రా చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతనికో గర్ల్ ప్రెండ్ ఇందు(సమంత). ఇక ఇందు కో క్లోజ్ ప్రెండ్ భూమి(కాజల్). భూమికో సమస్య వస్తుంది. చదువుకుంటున్న ఆమెకు బావ(అజయ్) తో తండ్రి(ప్రకాష్ రాజ్) ఇష్టంలేని పెళ్ళిని ఫిక్స్ చేస్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేని ఆమె ఆ పెళ్లిని తప్పించుకోవటానికి తన తాత(కోట) సలహాతో తనకో భాయ్ ప్రెండ్ ఉన్నాడని అబద్దమాడుతుంది. దాంతో ఆమె తండ్రి ఆ భోయ్ ప్రెండ్ ని ఇంటికి రప్పించు అంటాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు ఇందుని సంప్రదిస్తే..ఆమె తన భోయ్ ప్రెండ్ కృష్ణని ..భూమికి బోయ్ ప్రెండ్ గా వెళ్ళమని పురమాయిస్తుంది. తన ప్రియురాలు మాట జవదాటలేని కృష్ణ ..భూమి ఉన్న పల్లెకు బయిలు దేరి వెళతాడు. అక్కడ భూమిదో పెద్ద కుటుంబం. అందుకు తగ్గట్లే కుటుంబ తగాదాలు. అక్కడికి వెళ్లిన క్రిష్...తన తెలివితో ఆమె తండ్రికీ, బాబాయ్(శ్రీహరి)కీ ఉన్న తగువుని పరిష్కరించి,కలుపుతాడు. దాంతో ఇంప్రెస్ అయిన భూమి తండ్రి ...నా అల్లుడు నువ్వే అని క్రిష్ ని ప్రకటిస్తాడు.మరో ప్రక్క భూమి కూడా క్రిష్ తో ప్రేమలో పడిపోతుంది. ఈ లోగా ఇందు రంగంలోకి దిగుతుంది.ఇంతకీ ఆమె ఎవరూ...ఆమెకూ ఆ ఇంటికీ ఉన్న సంభందం ఏమిటీ... వీళ్ళద్దరి మధ్య ఇరుక్కుపోయిన క్రిష్ ఎలా బయిటపడ్డానేది తెరపై చూడాల్సిందే.

  అల్లు అర్జున్ "హ్యాపీ" చిత్రాన్ని గుర్తు చేస్తూ సాగే ఎత్తుగడతో మొదలైన ఈ చిత్రం రానురాను..ఇద్దరి భామల మధ్య నలిగే ముద్దుల హీరో కథగా మారి నారి నారి నడుమ మురారి క్లైమాక్స్ తో ముగుస్తుంది. అలాగే రీసెంట్ గా వస్తున్న రెడీ, బిందాస్, ట్రెండ్ ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సినిమాలు తెలుగులో గతంలో ఘన విజయాన్ని సాధించాయి కాబట్టి ఈ సారి కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుందని వర్కవుట్ చేసి ఉంటారనిపిస్తుంది. అలాగే దర్శకుడు తన గత చిత్రం మున్నా పరాజయాన్ని దృష్టి పెట్టుకుని పక్కాగా కమర్షియల్ హిట్ కోసం తపించి ఈ కథని జాగ్రత్తగా అల్లుకున్నట్లు అర్దమవుతుంది. ఎందుకంటే సీన్స్ చాలా భాగం గతంలో వచ్చిన హిట్ సినిమాల్లో క్లిక్ అయిన వాటినుంచి ప్రేరణ పొందినట్లు స్పష్టంగా అర్దమవుతుంది.

  అలాగే కథ ప్రకారం లాజిక్ గా(తెలుగు సినిమాకు లాజిక్ ఏంటంటే చేసేదేం లేదు) ఆలోచిస్తే..తనకు బోయ్ ప్రెండ్ ఉన్నాడని చెప్పగలిగిన కాజల్.. నాకు పెళ్ళి ఈ వద్దు ..నేను చదువుకుంటాను అని చెప్పలేదా అని డౌట్ వస్తుంది. అలాగే కాజల్ పాత్ర మొదటి నుంచీ చివరి దాగా డల్ గా ఉంటుంది. ఇక సమంతా...ఏమీ మాయ చేయలేకపోయిందనే చెప్పాలి. పాటలు కూడా ఒకట్రెండు తప్పిస్తే..పెద్దగా కిక్కివ్వవు.రాన్రూను సినిమా విజయాన్ని బట్టి జనాల్లోకి వెళ్ళతాయేమో చూడాలి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కథలో పెద్దగా కలవకుండా విడిగా ఉండిపోవటం ఇబ్బందే. అలాగే ముఖ్యంగా ఆర్ట్ ఆనందసాయినీ, కెమెరా వర్క్ నీ ఈ చిత్రంలో బాగా చెప్పుకోవాలి. దర్శకత్వ పరంగా వంశీ గొప్పగా తీయకపోయినా చాలా మంది కన్నా మేలనిపిస్తాడు.

  ఇక ప్లస్ ల విషయానికి వస్తే...హీరో ఇంట్రడక్షన్ రొటిన్ గా చేసినా ఆ సీన్ తోనే నసలేకుండా కథలోకి వెళ్ళిపోవటం బాగుంది. అలాగే సమంత తో లవ్ ట్రాక్ ప్రత్యేకంగా పెట్టకుండా ఓ పాటతో ఆల్రెడీ వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎస్టాబ్లిష్ చేసి స్క్రీన్ టైమ్ నీ,ప్రేక్షకులనూ కాపాడారు.అందుకు రైటర్స్ కు ధాంక్స్ చెప్పాలి. అలాగే కాజల్ ...ఎన్టీఆర్ తో తమ ప్రేమ కథ ఎలా మొదలైందో చెప్తూ..వేసే ప్లాష్ కట్స్ లో ఎన్టీఆర్ చేతికి,కాళ్ళతో కట్లుతో కనపడటం చాలా బాగుంటుంది. ఇక వేసేయాలనిపించినప్పుడు..వేసేయాల్సిందే ఆలోచించకూడదు వంటి డైలాగులు మాస్ అని అలరిస్తాయి. సెకెండా ఫ్ లో బ్రహ్మానందం,ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ కొత్తగా లేకపోయినా నవ్వులు బాగానే పండిస్తాయి.ముఖ్యంగా కారులో బట్టలు కొనుక్కోవటానికి వెళ్థూంటే వేణు మాధవ్..అద్దంలో ఎన్టీఆర్, సమంత ముద్దు పెట్టుకునే సీన్ చూసి కంగారుపడుతుంటే ఎన్టీఆర్ లెప్ట్..రైట్ అంటూ కన్ఫూజ్ చేయటం బాగా నవ్విస్తుంది. ప్రకాష్ రాజ్, శ్రీహరి ఎప్పటిలాగే వారి పాత్రలను బాగానే పండించారు. కోట పాత్ర ..వెంకటేష్ ప్రేమంటే ఇదేరా చిత్రంలోని సత్యనారాయణని గుర్తుకు తెస్తుంది. ఫైనల్ గా ఎన్టీఆర్..మాస్ లుక్ లేకపోయినా...మాన్లీగా చూపించే ప్రయత్నం చేసారు.

  ఫైనల్ గా ఎన్టీఆర్ ప్యామిలీలను కూడా తన ఫ్యాన్స్ జాబితాలో కలుపుకోవాలనే ప్రయత్నం ప్రారంభించటం బాగుంది. ఇక సినిమా రొటిన్ విషయాన్నే మూసగా చెప్పినా మసాలా కలిపి కాస్సేపు నవ్వుకునేటట్లు చేసారు కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే పొటీ అనుకున్న మిగతా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవటం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. అసభ్యత,మితిమీరిన హింస లేదు కాబట్టి ఫ్యామిలీలు ఎంకరేజ్ చేయవచ్చు.అంతేగాక మిస్సమ్మ చిత్రంలోని బృందావనమిది చిత్రం పాటతో ప్రారంభించటం, చివర్లో పెద్ద ఎన్టీఆర్ కనిపించటం తెలుగువారికి నచ్చే మరో అంశం.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X