twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగులు మార్చాడు కానీ...('ఊసరవెల్లి' రివ్యూ)

    By ---జోశ్యుల సూర్య ప్రకాష్
    |

    నటీనటులు ఎన్టీఆర్, తమన్నా, ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు.
    కథ: వక్కంతం వంశీ
    మాటలు: కొరటాల శివ
    పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్
    సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
    యాక్షన్: రామ్-లక్ష్మణ్
    కళ: రవీందర్
    లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర
    సమర్పణ: బి బాపినీడు
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.
    నిర్మాత: బివివియస్ ఎన్ ప్రసాద్

    గతంలో అశోక్ సినిమా ఫలితం నన్ను,సురేందర్ రెడ్డిని నిరాశపరిచింది.సిక్సర్ కొట్టాలనుకున్నా...మూడు పరుగులే తీశాం. ఈసారి మాత్రం బంతి స్టేడియం దాటుతుంది. సూరి అంత బాగా తీసాడు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని చూసుకుంటున్నప్పుడు తను ఎంత బాగా తెరకెక్కించాడో అర్దమైంది. నేను నా భాధ్యతగా కొత్త తరహా సినిమా చేసా. ఆదరించే భాధ్యత అభిమానులదే అంటూ ఊసరవెల్లి ఆడియో పంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పారు.అయితే అంతా ఆ మాటలు సినిమా విజయాన్ని ఆశిస్తూ చెప్పిన మాటలుగా భావించారు. అయితే అభిమానులనే ఈ చిత్రాన్ని గట్టెక్కించాలని ఆయన డైరక్ట్ గా అడిగారని ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అర్దమవుతోంది. ఓ రివెంజ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎక్కడో సెకెండాఫ్ లో వచ్చే ట్విస్ట్ కోసం కథని మొదటి నుంటి దాచిపెట్టి నడపటంతో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక హాంకాంగ్ చిత్రం Vengeance (2009)ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాత్రం ఊసరవిల్లిగా తన పరిధి మేరకు నటన,డాన్స్ లుతో ఆద్యతం నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

    డబ్బుకోసం ఎలాంటి పనైనా చేసే టోని(ఎన్టీఆర్)ముంబై నుంచి హైదరాబాద్ కి నీహారక(తమన్నా) కోసం వస్తాడు. రాత్రిబవళ్లూ తేడాలేకుండా ఆమె వెనకే తిరుగుతూ ప్రేమించమని తిరుగుతూంటాడు. అయితే అతను ఆమె మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకుంటాడు. అతన్ని నుంచి ఆమెను దూరం చేసేందుకు కొందరని హత్యలు చేస్తూంటాడు. అయితే ఆమెకోసం అతను హత్యలు చేయటం లేదని అతనికి వేరే లక్ష్యం ఉందని తెలుస్తుంది. ఇంతకు ఎవరా టోని, నీహారికను ఎందుకలా వెంబడిస్తున్నాడు..ఊసరవిల్లిగా ఎందుకు మారి ఎందుకు హత్యలు చేస్తున్నాడు..అనేది మిగతా కథ.

    మొదటే చెప్పుకున్నట్లుగా Vengeance(2009)నుంచి స్టోరీలైన్ తీసుకున్న ఊసరవిల్లి కథని స్క్రీన్ ప్లే చేసి స్టైయిట్ నేరేషన్ లో ఉన్న కథను ప్లాష్ బ్యాక్ నేరేషన్ లోకి మార్చేసారు. అక్కడ తండ్రి పాత్రను ఇక్కడ హీరోయిన్ గా చేసారు. ఆమె పగను తీర్చటానికి ఎన్టీఆర్ ..అతడే ఓ సైన్యంలా తిరుగుతూంటాడు. అయితే ఈ పాయింట్ సెకెండాఫ్ సగం దాకా రివిల్ కాదు.దాంతో అప్పటిదాకా తెరపై ఏం జరుగుతోందో అర్దం కాదు. దాదాపు సినిమాలో ముప్పావుభాగం కథను సస్పెన్స్ లో పెట్టేయటంతో హీరోకి తప్ప ప్రేక్షకులకు అతను ఎవరితో పోరాడుతున్నాడో, ఎందుకు పోరాడుతున్నాడో అర్దం కాక అతని సమస్యతో లీనం కాని పరిస్ధితి. దాంతో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లకు ప్రేక్షకుల నుంచి రావాల్సిన స్పందన రాలేదు. అలాగే విలన్ కి సైతం హీరో ఎవరో తెలిసే సరికే సినిమా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది.దాంతో విలన్..హీరో క్లైమాక్స్ లో తప్ప ఎదురుపడే సిట్యువేషన్ ఉండదు. దాంతో దాదాపు హీరో పాత్ర ప్యాసివ్ గా మారి ఒన్ సైడ్ యాక్షన్ స్టోరీగా మారిపోయింది. చర్యకి ప్రతిచర్య లేకపోతే ఆసక్తి లేకుండా పోతుందనేది మరోసారి నిరూపించినట్లయింది. అప్పట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ బాలు సినిమాలా తయారైంది.

    అలాగని సినిమాలో హైలెట్స్ లేవా అంటే హీరో ఇంట్రడక్షన్ చాలా బాగా చేసారు. అలాగే పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ ఎప్పటిలాగే హైలెగా ఉంది. టెక్నికల్ గా సురేంద్ర రెడ్డి మంచి సాంకేతిక విలువలతోనే తెరకెక్కించాడు. ఇక తమన్నా చాలా చోట్ల నటన ప్రదర్శించటానికి అవకాసం కనపడింది.ఇక అజ్జు భాయ్ గా చేసిన ప్రకాష్ రాజ్ అయితే పోకిరిని గుర్తు చేస్తూ నటించాడు. అయితే జయప్రకాష్ రెడ్డి మీద పెట్టిన కామిడీ ఎపిసోడ్లు అనుకున్నంతగా పండకపోగా, కథలోని విలన్ ఎపిసోడ్ ని నీరసపరిచాయి. అలాగే రసూల్ కెమెరా సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్పుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటల్లో రెండు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఇక మాటల విషయానికి వస్తే...కొరటాల శివకు ఈ సినిమాతో పెద్ద సినిమాలు కంటిన్యూగా వచ్చే అవకాసం ఉంది. కరెంట్ తీగ కూడా నాలానే సన్నాగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాక్ కొట్టేస్తుంది....అంటూ చెప్పిన డైలాగుకు ధియోటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

    పైనల్ గా అబిమానులుకు నచ్చే ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ కొరవడటం, హింస ఎక్కువ అవటం ఫ్యామిలీలను దూరంగా ఉంచే అవకాశం ఉంది. ఏదైమైనా ఎన్టీఆర్ రొటిన్ రివేంజ్ స్టోరీలనుంచి బయిటకు వస్తే బెటర్ అనిపించిన చిత్రం ఇది. అలాగే దూసుకుపోతున్న దూకుడు ఏ మాత్రమూ పోటి ఇవ్వలేదనిపిస్తోంది.

    English summary
    Junior NTR’s latest film ‘Oosaravelli’ was released in a grand style with average talk. Jr NTR movie Oosaravelli releasing as dasara gift to the audience. This is the biggest ever release for a Tollywood movie and lots of expectations and crores of money are riding on it. Did it match the hype and surpass the expectations? Find out in Oosaravelli Review…
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X