For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఓకే ఓకే’ రివ్యూ...

  By Bojja Kumar
  |

   OK OK
  రేటింగ్: 2.5/5
  దర్శకత్వం : ఎం. రాజేష్
  నిర్మాత : బెల్లంకొండ సురేష్
  సంగీతం: హరీష్ జైరాజ్
  నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, హన్సిక, సంతానం, ఆర్య, షాయాజి షిండే, ఉమా పద్మనాభన్, స్నేహ, ఆండ్రియా తదితరులు

  ఘటికుడు, సెవెంత్ సెన్స్ చిత్రాలతో నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసిన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ 'ఓకే ఓకే' సినిమాతో హీరోగా మారిపోయారు. తమిళ్లో 6 నెలల క్రితం విడుదలై హిట్ అయిన రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓకే ఓకే' (ఒరు కల్ ఒరు కన్నాడి) సినిమాని తెలుగులో అదే పేరుతో విడుదల చేసారు.

  శ్రీనివాస్(ఉదయ నిధి స్టాలిన్) పాపులర్ మల్టీ ప్లెక్స్ లో పని చేస్తూ ఉంటాడు. బంగార్రాజు(సంతానం)అతని కొలిగ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. పోలీస్ ఆఫీసర్(షాయాజీ షిండే) కూతురైన మీరా(హన్సిక)ను శ్రీనివాస్ ప్రేమిస్తాడు. అయితే మీరా మాత్రం పెద్దగా ఇంట్రస్టు చూపదు. తన వెంట పడుతున్న శ్రీనివాస్‍‌ను భయపెట్టడానికి అతన్ని తీసుకెళ్ళి డిప్యూటీ కమీషనర్ అయిన తన తండ్రికి పరిచయం చేస్తుంది. అయినా భయపడని శ్రీనివాస్... మీరా వెంట పడుతాడు. శ్రీనివాస్ ప్రేమని నమ్మిన మీరా అతన్ని ప్రేమించి పెళ్ళికి సిద్దమవుతుంది. కానీ మనసు మార్చకుని వేరే అబ్బాయితో పెళ్లికి రెడీ అవుతుంది. మరి ఊహించని ఈ ట్విస్ట్ వెనక కారణం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

  నటుడిగా తొలి అడుగు వేసిన ఉదయనధి స్టాలిన్ మరీ గొప్పగా ఏమీ నటించలేక పోయనా...ఫర్వాలేదనిపించాడు. హన్సిక బొద్దుగా గ్లామరస్ గా కనిపించడంతో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కమెడియన్ సంతానం కామెడీ బాగా పండించాడు. సినిమాకు సంతానం కామెడీ బాగా ప్లస్ అయింది. హీరోయిన్ తల్లి పాత్రలో శరణ్య ఇమిడి పోయింది.

  బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రపీ, వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఫర్వాలేదు. సాంగ్ సీక్వెన్స్ లో కెమెరా వర్క్ ఎక్సలెంట్‌గా ఉంది. హరిష్ జైరాజ్ మ్యూజిక్ ఓకే. డబ్బింగ్ సినిమా కావడంతో తమిళంలో పేలినట్లుగా కామెడీ డైలాగులు తెలుగులో పేలలేక పోయాయి. స్క్రీన్ ప్లే ఫర్వా లేదు.

  సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సింపుల్ సోరీ లైన్‌ను స్క్రీన్ ప్లే, కామెడీ సీన్లతో లాక్కొచ్చారు. జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా స్నేహితులతో కలిసి వెళితే సరదాగా నవ్వుకుని రావొచ్చు.

  English summary
  "Laughter is the best medicine"- Every person wants to laugh and feel positive and cheerful. Today's way of life is fast and stressful and most of the times there is no time to laugh. Intelligently written comedies can help to alter this state of mind and tensions of a person. Director Rajesh, who has given two consecutive hits, proves once again that he is the king of comedies. Oru Kal Oru Kannadi is a barrel of laughs with a wafer-thin story. The film is just a one-time watch. If you have no other film to watch and must spend your week-end with one film, you can watch this. Or else, wait for the DVD to come and watch it at home. The film is good to watch with friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X