»   » చూడని వాళ్లే జీనియస్ (రివ్యూ)

చూడని వాళ్లే జీనియస్ (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
నటీనటులు: హవీష్, సానూషా, అశ్విన్‌ బాబు, శరత్‌కుమార్, సుమన్ తదితరులు
సంగీతం: జోష్వా శ్రీధర్,
కథ: చిన్నికృష్ణ,
ఛాయాగ్రహణం: దివాకరన్
ఎడిటింగ్: ఎం ఆర్ వర్మ
మాటలు: పరుచూరి బ్రదర్స్,
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్,
దర్శకత్వం: ఓంకార్.
విడుదల తేదీ: 2012-12-28

ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ అన్నయ్య మెగాఫోన్ పట్టుకుని సినిమా డైరక్షన్ చేస్తున్నాడనగానే అందరిలోనూ ఆసక్తి. దానికి తోడు కోటి రూపాయల రచయిత అనిపించుకున్న చిన్ని కృష్ణ కథ ఇవ్వటం జరిగింది. చిన్ని కృష్ణ... తన గత చిత్రాల్లాగే సంచలన విజయం సాధించేలా 'జీనియస్' కథను రూపొందించడం జరిగిందని, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అన్నాహజారే సొంతవూరు 'రాలేగావ్ సిపీ"లో కూర్చొని రాయడం జరిగిందని ఇంకాస్త బిల్డప్ ఇచ్చి మరీ ఈ సినిమాను లాంచ్ చేసారు. అయితే అంత సీన్ తెరపై కనపడలేదు.

వ్యక్తి పూజ వద్దు అనే అంశంతో రూపొందిన ఈ కథలో శ్రీనివాస్( హవీష్), యాసిర్(అశ్విన్ బాబు), శివ(వినోద్) ముగ్గురూ చిన్నతనం నుంచీ మంచి ప్రెండ్స్. ముగ్గురూ తమ ఇష్టమైన రంగాల్లో(క్రికెట్, సినిమా, పొలిటిక్స్) ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని ప్రయత్నిస్తారు. అయితే తాము ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తులు మోసం చేయటంతో రగిలిపోతారు. తమలాగే ఇలాంటి వ్యక్తులను ఆరాధిస్తున్నవారిని మేల్కొపాలని, తమను మోసం చేసిన వ్యక్తులకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వారేం చేసారు.. ఏం సాధించారు.. ఏం కోల్పోయారు అనేది మిగతా కథ.

పాయింట్ గా నేటి సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్నదే అయినా దాన్ని డీల్ చేసే విధానంలో తడబడ్డారు. ఏ విధమైన ఇంపాక్టూ ఇవ్వలేక పోయారు. దానికి తోడు నువ్విలాతో పరిచయమైన హవీష్ ఈ రెండో చిత్రంలోనూ తన నటనను మెరుగుపరుచుకోలేకపోయారు. దాంతో అతని శక్తికి మించిన పాత్రగా మారింది. ఒకే ఎక్సప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేద్దామని ప్రయత్నం చేసాడు. ఇక హవీష్ ప్రేమించే అమ్మాయిగా చేసిన సుషన అయితే అస్సలు నప్పలేదు... సినిమా వారి భాషలో చెప్పాలంటే హీరోయిన్ మెటీరియల్ కాదు. సీనియర్ నటులు ఆశిష్ విద్యార్ది, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాస రావు కొత్తగా చేయకపోయినా వారే ఈ సినిమాకు మూల స్ధంబాల్లా నిలబడ్డారు. ఎంతో బిల్డప్ చేసిన డిబ్బరి డిబ్బరి ఐటం సాంగ్ అనుకున్నంతగా పేలలేదు. ఈ పాట వచ్చేటప్పటికే జనాల్లో సహనం నసించిపోవటంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే నాగబాబు, అన్నపూర్ణ,కె.విశ్వనాధ్ వంటి ఆర్టిస్టులు ఉన్నా వారిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు.

భారతదేశం, పాక్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ నేపధ్యంలో దేశాన్ని మోసం చేసిన క్రికెటర్ ని అంతం చేసే సీన్స్ టప్పట్లు కొట్టించుకున్నాయి. అలాగే కోట,అశీష్ విద్యార్ధి మధ్య వచ్చే సన్నివేశం, హీరోలను వెర్రిగా అభిమానించేవారి కళ్ళు తెరిపించే సన్నివేశం వంటివి సినిమాలో అక్కడక్కడా మెరిసాయి. కెమెరా జస్ట్ ఓకే. ఎడిటింగ్ ఇంకా బాగా చేయవచ్చని సినిమా లో బోర్ సీన్స్ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ లో శరత్ కుమార్ తన ఫవర్ ఫుల్ నటనతో ఉన్నంతసేపు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు. బ్రహ్మాందం కామెడీ ఓకే. గబ్బర్ సింగ్ స్ఫూఫ్ బాగా పేలింది. పరుచూరి బ్రదర్శ్ డైలాగుల్లో సినిమా సినిమాకీ వాడి తగ్గిపోతోంది. ఆ విషయం ఈ సినిమాతో మరీ స్పష్టమైంది. విగ్రహాలు పెట్టుకున్నంత వాళ్లంతా మహాత్ములు కాదు, డైలాగ్ మార్చాలా... డైరక్టర్ ని మార్చాలా వంటివి మాత్రం బాగున్నాయి. సంగీతం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. దర్శకుడుగా ఓంకార్ మాత్రం కొత్త దర్శకుడు అని మాత్రం ఎక్కడా అనిపించకుండా మ్యానేజ్ చేసి నడిపించారు. రెగ్యులర్ కమర్షియల్ కథను ఎంచుకుంటే బాగానే మెప్పించగలడని అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కేవలం ఓంకార్ అభిమానులకు మాత్రమే నచ్చే ఈ సినిమాలో ఎమోషనల్ ఇంటెన్సిటీ కొరవడటంతో ఎంతో మెసేజ్ ఉన్నా... కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా పేలని బాంబులా మిగిలిపోయింది.

English summary
Aata fame Omkar's Genius released today with bad talk. It is a movie that has been let down by bad execution. The basic concept and the message that the film tried to convey are laudable, but they fail to make an impact here.
Please Wait while comments are loading...