twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోస్తారు కామెడీ చిత్రం

    By Staff
    |

    O Radha Iddaaru Krishnula Pelli
    - జలపతి గూడెల్లి
    చిత్రం: ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి
    నటీనటులు: శ్రీకాంత్‌, ప్రభుదేవా, నమిత, తనికెళ్ళ భరణి,
    ఎమ్మెస్‌ నారయణ, బ్రహ్మానందం, కోవై సరళ, ఎల్బీ శ్రీరాం
    సంగీతం: చక్రి
    నిర్మాతలు: జె.భగవాన్‌, డివివి దానయ్య
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

    కథలో బలం లేకుండా కేవలం బలవంతంగా సిచ్యువేషన్స్‌ సృష్టించి, కామెడీని పండించే ప్రయత్నం దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ప్రయత్నించారీ చిత్రంలో. అయితే, ఆయన ప్రయత్నం కొంతవరకు ఫలించింది. చాలా సన్నివేశాలు నటీనటుల నటన, డైలాగ్స్‌ వల్ల నవ్వులు పండించాయి. అయితే, కథ, కథనంలో కూడా బలం ఉండిఉంటే ఈ సినిమా మరింత ఆకట్టుకునేది.

    ఓ రాధ..ఇద్దరు కృష్ణులను ఎలా పెళ్ళికి ఒప్పిస్తుందనే సస్పెన్స్‌ ను చివరికి బాగానే లాగినా..క్లైమాక్స్‌ లో చాలా సింపుల్‌ గా తేల్చేయడంతో..అప్పటివరకు విలన్‌ గా చూపించిన తనికెళ్ళ భరణి పాత్రకు అర్ధంలేకుండా పోతుంది. రచయిత జనార్ధన మహర్షి ఎప్పుడూ సీన్లను 'వండడం' మీదే దృష్టి సారిస్తుంటాడు. కథలో లాజిక్‌ ఉందా అనేది ఆయనకు అనవసరంలా కన్పిస్తుంటుంది. అందుకే, చాలా సీన్లు కామెడీ కోసం మినహా కథకు అనుగుణంగా పెట్టినట్లు కన్పించదు. అయితే, ప్రథమార్థం అంతా సరదాగా సాగడం, చక్రి వినసొంపైన పాటలు, భూపతి చక్కటి చిత్రీకరణ వల్ల సినిమా ఫర్వాలేదనపిస్తుంది. కామెడీ కోసం చూడవచ్చు.

    కథ: ప్రభుదేవా, శ్రీకాంత్‌ లు రాజమండ్రిలో ఇరుగుపొరుగు మిత్రులు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరూ ఒకరి 'ప్రయత్నాల'ను మరొకరి విఫలం చేస్తుంటారు. వీరివురికి హైదరాబాద్‌ లోని ఒ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ ఎండి (తనికెళ్ళ) వీరిని తమ కూతురు (నమిత) బాగోగులు చూసుకోమని చెపుతాడు. ఒక దశలో వీరిద్దరికి ఒకరికి తెలియకుండా ఒకరికి తమ కూతురునిచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. సో..వీరు ఇద్దరు ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

    విషయం తెలిసిన నమిత, ఇద్దరిని పెళ్ళి చేసుకుంటానని అంటుంది. ఈలోపు, తనికెళ్ళ అమెరికా అల్లుడి(సునీల్‌)ని తీసుకువస్తాడు. చివర్లో ..నమిత ఒకరు కాదు ఇద్దరని (డబుల్‌ రోల్‌), తను ఇద్దరని ఎందుకు పెళ్ళి చేసుకుంటానని అనడానికి కారణం వివరించడంతో ముగుస్తుంది.

    శ్రీకాంత్‌ కన్నా ప్రభుదేవా నటనే బాగుంది. సునీల్‌ కామెడీ సినిమాకు హైలెట్‌. నమిత చక్కగా ఉంది. కానీ ఈ సినిమాలో పాటలే మధ్యమధ్యలో చికాకుగా వస్తుంటాయి. దర్శకుడి పనితనం పెద్దగా కన్పించదు. ఫర్వాలేని సినిమా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X