For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వలస మూవీ రివ్యూ: ప్రభుత్వాలపై మరోసారి పీ సునీల్ కుమార్ రెడ్డి విమర్శనాస్త్రం

  |

  మనోజ్‌నందం, తేజు అనుపోజు, వినయ్‌ మహదేవ్‌, గౌరీ తదితరులు

  రచన, దర్శకత్వం: పి.సునీల్‌కుమార్‌రెడ్డి

  నిర్మాత: యెక్కలి రవీంద్ర బాబు

  సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి

  బ్యానర్: శ్రావ్యఫిలిమ్స్‌ పతాకం

  కెమెరా, ఎడిటింగ్: నరేష్ కుమార్ మ‌డి

  సౌండ్: ప్రదీప్ చంద్ర, వీఎఫ్‌ఎక్స్, కలరింగ్: శ్యాం కుమార్, ఆడియోగ్రఫీ: పి పద్మారావు

  లిరిక్స్: మనోహర్,

  నేపథ్య గానం: ధనుంజయ్, మేఘ్న, ప్రసు

  సహా నిర్మాత: శరత్ ఆదిరెడ్డి

  రిలీజ్: 2021-01-08

  కరోనా కారణంగాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. మండుటెండను లెక్క చేయకుండా చావైనా, బ్రతుకైనా సొంత ఊరే అనే భావోద్వేగతంతో ఇంటి దారి పట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది వలస కార్మికుల వ్యథలు, మీడియా కథనాలు కంటతడి పెట్టించాయి. అలాంటి ఎమోషనల్ అంశాలను కథగా రూపొందించుకొని సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం వలస.

  ఇరుగుపొరుగు రాష్ట్రాలు, చెన్నై, హైదరాబాద్ నుంచి పలు కుటుంబాలు ఉత్తరాంధ్రకు బయలుదేరిన క్రమంలో దారి పొడుగున వారు అనుభవించిన కష్టాలు తెర మీద ఆవిష్కరించారు. ప్రసవానికి రెడీగా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెతలు, అలాగే వలస కార్మికుల్లో ఓ గర్బవతి అనుభవించిన బాధకరమైన క్షణాలు.. వలస కార్మికుల ఆకలి కేకలు, దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్లు దొరకని పరిస్థితి వలస చిత్రంలో కనిపిస్తాయి.

  P Suneel Kumar Reddys Valasa Movie Review

  ప్రభుత్వాల అంక్షల కారణంగా వలస కార్మికులపై పోలీసులు జరిపే లాఠీ ఛార్జీలు వలస చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించడంతో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. వలస కార్మికులను గాలికి వదిలేసిన ప్రభుత్వాల బాధ్యతారాహిత్యంపై దర్శకుడిగా విమర్శల బాణం ఎక్కువపెట్టారు. పలు మానవీయ కోణాలను తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పురిటి నొప్పులతో ఉండే ఓ మహిళ పడే బాధను చక్కగా చూపించారు. సాయం చేసుకోవడానికి బంధాలు అక్కర్లేదనే ఆ సామాజిక బాధ్యతను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అనారోగ్యంతో కాలినడక పట్టిన ఓ కుటుంబం ఎలాంటి బాధలను అనుభవించింది లాంటి సీన్లు గుండెను పిండేస్తాయి. ఇలాంటి వ్యధ భరిత కథలో కూడా ప్రేమలు, అప్యాయతలు చక్కగా జొప్పించారు.

  మనోజ్‌నందం, తేజు అనుపోజు, వినయ్‌ మహదేవ్‌, గౌరీ ఇంకా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఎమోషనల్ సీన్లలో వీరి నటన చాలా బాగుంది.

  వలస చిత్రం ఓ రోడ్ మూవీ. రహదారినే నమ్ముకొన్న ప్రజల కష్టాలను సినిమాటోగ్రాఫర్ నరేష్ కుమార్ మడి అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించారు. పాటలు ఆలోచించి విధంగా ఉన్నాయి. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం కథ, కథనాలను ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. భావోద్వేగాలను మరో లెవెల్ తీసుకెళ్లడంతో తన ప్రతిభను చాటుకొన్నారు.

  సామాజిక బాధ్యతగల దర్శకుడిగా పేరు ఉన్న పీ సునీల్ కుమార్ రెడ్డి తన గత చిత్రాల్లో మాదిరిగానే ప్రేక్షకుల హృదయాలను తట్టిలేపే విధంగా వలస చిత్రాన్ని రూపొందించారు. సొంతవూరు, గంగపుత్రులు, గల్ఫ్ లాంటి చిత్రాల కోవలోనే వలస చేరుతుంది. ఈ చిత్రం జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో వస్తున్నది.

  English summary
  Tollywood Director P Suneel Kumar Reddy's latest movie is valasa. Valasa is satrical movie on Governments which ignored Migrant labour in lockdown. Many heart boiling stories penned by Suneel Kumar Reddy for Valasa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X