For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పందెం కోడి 2 సినిమా రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్
  Director: ఎన్ లింగుస్వామి

  పందెం కోడి చిత్రం నటుడు విశాల్‌ను దక్షిణాదిలో మాస్ హీరోగా నిలబెట్టింది. 13 ఏళ్ల క్రితం రిలీజైన ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా పందెం కోడి2. విశాల్ సరసన మహానటి కీర్తీ సురేష్ నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎన్ లింగుస్వామి దర్శకుడు. పందెం కోడి 2 చిత్రం సీక్వెల్‌ ఎలాంటి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. విశాల్‌ మాస్ ఇమేజ్‌ను మరింత రెట్టింపు చేసిందా? మహానటి తర్వాత తనపై పెరిగిన అంచనాలను కీర్తీ సురేష్ అధిగమించిందా? విలన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్‌ ఎన్ని మార్కులు సంపాదించుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే పందెం కోడి 2 కథేంటో తెలుసుకోవాల్సిందే.

  పందెంకోడి 2 కథ

  కడప ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య వర్గపోరులో భవానీ (వరలక్ష్మీ శరత్ కుమార్) తన భర్తను కోల్పోతుంది. తన భర్తకు కారణమైన వారి వంశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొంటుంది. గొడవ కారణంగా వీరభద్రుడి జాతర ఏడేళ్లుగా ఆగిపోతుంది. ఆ జాతరను జరిపిస్తే రాయలసీమలో వర్షాలు పడి కరువు తగ్గుతుందనే ఆలోచనతో రాజారెడ్డి (రాజ్ కిరణ్) ఆ కార్యాన్ని భుజానికి ఎత్తుకొంటాడు. ఏ జాతరలోనైతే తన పసుపు, కుంకుమలు దూరమయ్యాయో అదే కార్యక్రమంలో తన పగను చల్లార్చుకోవాలనుకొంటుంది.

  పందెం కోడి2 కథలో ట్విస్టులు

  ఇలాంటి పరిస్థితుల్లో రాజారెడ్డి కుమారుడు బాలు (విశాల్) విదేశీ చదువులు ముగించుకొని వస్తారు. ఊర్లో అల్లరి పిల్ల చారుమతి (కీర్తి సురేష్) ప్రేమలో పడుతాడు. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలో రాజారెడ్డి గాయపడుతాడు. దాంతో జాతరను పూర్తి చేసే బాధ్యత బాలుపై పడుతుంది. ఓ కారణంగా చారుమతి ప్రేమను బాలు నిరాకరిస్తాడు. చారుమతి ప్రేమను బాలు ఎందుకు నిరాకరించాడు? భవానీ తన పంతాన్ని నెగ్గించుకొందా? జాతరను ముగించే క్రమంలో బాలుకు ఎదురైన సమస్యలేంటి? గాయాల బారిన పడిన తన తండ్రి ప్రతిష్ఠను బాలు ఎలా కాపాడగలిగాడు. చారుమతి ప్రేమను బాలు ఎలా గెలుచుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే పందెం కోడి 2 సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  తొలిభాగంలో ఎక్కువ భాగం ఫ్యాక్షన్ గొడవలు, జాతర అంశాలు పైచేయిగా ఉంటాయి. ఈ అంశాల మధ్య విశాల్, కీర్తి సురేష్ రొమాంటిక్ ప్రేమ కథ కొంత ఆట విడుపుగా ఉంటుంది. ఒకటే పంథాలో సాగడం, తెలియని నటీనటులు తెర మీద హడావిడి చేయడం, నేటివిటి సమస్య తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉంటుంది. వీటన్నిటిని కీర్తీ సురేష్ తన చిలిపి నటనతో కప్పిపుచ్చే ప్రయత్నిం చేసింది. ఓ ఆసక్తికరమైన, భావోద్వేగమైన సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  ప్రత్యర్థుల దాడిలో తండ్రి రాజారెడ్డి హాస్పిటల్ పాలవ్వడంతో బాలు పాత్ర ప్రధానంగా మారుతుంది. సెకండాఫ్‌లో ఊరి ప్రజలకు తెలియకుండా తండ్రి చికిత్స జరగడమనే ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ ఉంటుంది. తండ్రి పరిస్థితిని ఊరి ప్రజలకు తెలియకుండా ఆడే రెండు, మూడు సన్నివేశాలతో సినిమా కొంత మెరుగ్గా అనిపిస్తుంది. తండ్రి మాట కోసం ప్రేమను కూడా త్యాగం చేయడానికి బాలు సిద్దపడటం కొంత ఎమోషన‌ల్‌గా ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్‌లో భవానీ, ఆమె కొడుకు మధ్య వచ్చే భావోద్వేగమైన ఎపిసోడ్‌తో సినిమాకు తెరపడుతుంది.

  దర్శకుడు లింగుస్వామి టేకింగ్

  దర్శకుడు లింగుస్వామి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే పని పూర్తి చేశాడు. కాకపోతే మాస్ జనాలకు, ప్రేక్షకుడికి నచ్చే విధంగా నచ్చే విధంగా సీన్లను రాసుకోవడం, కొన్ని సీన్లు మెప్పించే విధంగా ఉండటంతో పాసైపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే సెకండాఫ్‌లో క్లైమాక్స్ కోసమే స్క్రిప్టులో సాగదీత ధోరణి అవలంభించడం ప్రతికూలంగా మారే అంశం. ఓవరాల్‌గా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా, తమిళ ప్రేక్షకుల మెచ్చే విధంగా చేసిన ప్రయత్నం ఫర్వాలేదనిపిస్తుంది.

  విశాల్ మాస్, యాక్షన్ హీరోగా

  తన మాస్ ఇమేజ్‌కు పూర్తిగా న్యాయం చేసేబాలు పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. రొమాంటిక్ సీన్లలో ఒద్దికగా కనిపించినా, యాక్షన్ సీన్లలో చెలరేగిపోయాడు. తండ్రిపై దాడి ఘటన సీన్‌లో, సెకండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాల్లో, ప్రధానంగా క్లైమాక్స్‌లో విశాల్ నటన పీక్స్‌లోకి వెళ్లిపోయిందనిపిస్తుంది. ఇటీవల విశాల్ సినిమాలకు భిన్నంగా పందెం కోడి 2 ఉంటుంది.

  చారుమతి పాత్రలో కీర్తీ సురేష్

  పందెం కోడి 2 చిత్రంలో ప్రధానంగా ఆకట్టుకొనే పాత్ర చారుమతిగా కీర్తీ సురేష్‌ది. రకరకాల వేరియన్స్‌, నటనతో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతుంది. అల్లరి అమ్మాయిగా, మనసుకు ఏది తోస్తే అలా మాట్లాడే స్వభావం ఉన్న పాత్రలో కీర్తి మరోసారి మెరిసింది. ఓ నాలుగైదు సీన్లలో వారేవా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మహానటి తర్వాత మరో గుర్తుండిపోయే పాత్రలో కనిపించింది.

  పవర్‌ఫుల్ విలన్‌గా వరు శరత్ కుమార్

  ఇక సినిమాలో మరో కీలకమైన పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్‌ది. వితంతువుగా భవానీ పాత్రలో రౌద్రాన్ని ప్రదర్శించేందుకు చేసిన ప్రయత్నం అభినందించదగినదే. తన పాత్ర పరిధి మేరకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. పాత్రలో మరింత ఇంటన్సెటీ జోప్పించడానికి అవకాశమున్నా స్క్రిప్టులో ఆ బలం లేకపోవడంతో అక్కడక్కడా భవానీ పాత్ర చతికిలపడుతుంది. మగ విలన్లు డామినేట్ చేస్తున్న తరుణంలో లేడీ విలన్‌గా కనిపించే సాహసం చేయడం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే.

  మిగితా పాత్రల్లో నటుల..

  విశాల్ తండ్రిగా రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు రాజ్ కిరణ్ నటించాడు. ఊరి పెద్దగా, భారమైన పాత్రలో ఆకట్టుకొన్నాడు. కీలక సన్నివేశాల్లో హుందాతనాన్ని ప్రదర్శించడం ఆ పాత్రకు అలంకారంగా మారింది. మిగితా పాత్రలో నటించిన తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే అయినప్పటికీ వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

  యువన్ మ్యూజిక్ గురించి

  పందెం కోడి 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. పాటల్లో తెలుగు నేటివిటీ కనిపించకపోవడం మైనస్. కీలక ఎపిసోడ్స్‌లో రీరికార్డింగ్ బాగుంది. విశాల్, కీర్తీ సురేష్‌పై చివర్లో వచ్చే మాస్ పాట ఆకట్టుకొనేలా ఉంది.

  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

  కేఏ శక్తివేల్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జాతర సన్నివేశాలను, యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారు. ఛేజింగ్ సీన్లు చక్కగా చిత్రీకరించాడు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్‌లో కొంత లోపాలు ఉన్నాయి. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కత్తెర్లకు పనికల్పించే అవకాశం ఉంది.

  విశాల్ నిర్మించారు

  తమిళంలో ఈ చిత్రాన్ని విశాల్ నిర్మించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత టాగోర్ మధు రిలీజ్ చేశారు. డబ్బింగ్ పరంగా నాణ్యతను పాటించడంలో సఫలయ్యాడు. తమిళ నేటివిటిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం బాగుంది.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  విశాల్, వరలక్ష్మీ నటన
  కీర్తి సురేష్ గ్లామర్
  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్‌లో సాగదీత
  రెగ్యులర్, రొటీన్ కథ
  మ్యూజిక్

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాజ్ కిరణ్ తదితరులు
  దర్శకత్వం: ఎన్ లింగుస్వామి
  నిర్మాత: టాగోర్ మధు, విశాల్
  సినిమాటోగ్రఫి: కేఏ శక్తివేల్
  ఎడిటింగ్: ప్రవీన్ కేఎల్
  మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
  రిలీజ్ డేట్: 2018-10-18

  ఫైనల్‌గా

  ఎలాంటి కొత్తదనం లేకుండా మితిమీరిన తమిళ నేటివిటి, రెగ్యులర్ ఫ్యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన చిత్రం పందెం కోడి 2. విశాల్ మాస్ అప్పీల్, విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటన సినిమాకు హైలెట్‌. అల్లరి పిల్లగా కీర్తి సురేశ్ నటన మరో ప్రత్యేక ఆకర్షణ. తమిళ వాసన ఎక్కువగా కావడం భరించలేని విషయం.

  English summary
  Pandem Kodi 2 is an upcoming action drama film written and directed by N. Linguswamy. A sequel to the successful Sandakozhi (2005), the film features Vishal for his 25th film in a dual role as Father & Son with Keerthy Suresh and Rajkiran in the lead roles. Varalaxmi Sarathkumar and Soori in other pivotal roles. The film seto be released in October 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more