twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరాన్నజీవి మూవీ రివ్యూ అండ్ రేటింగ్: RGVపై విమర్శనాస్త్రం

    |

    Rating:
    2.5/5

    కరోనావైరస్ వ్యాప్తితో స్థబ్దత నెలకొన్న టాలీవుడ్‌ను రెండు చిత్రాలు ఒక్కసారిగా కుదుపుకు గురిచేశాయి. నిరాశలో ఉన్న సినిమా పరిశ్రమలో ఉత్తేజాన్ని, ఉల్లాసం నింపే విధంగా సినిమా షూట్స్ మొదలుపెట్టి ఓటీటీలో చిత్రాలు రిలీజ్ కావడం సినిమా పరిశ్రమకు శుభపరిణామంగా కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రాలు పరాన్నజీవి, పవర్‌స్టార్. ఈ రెండు చిత్రాల్లో శ్రేయాస్ ఈటీ యాప్‌లోని 99 థియేటర్‌లో రిలీజైన పరాన్నజీవి చిత్రం ఎలా ఉందో తెలుసుకొందాం.

     పరాన్నజీవి సినిమా కథ ఏమిటంటే

    పరాన్నజీవి సినిమా కథ ఏమిటంటే

    నా ఇష్టం, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే విధంగా అహభావంలో ఉండే డైరెక్టర్ రాధా గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి (షకలక శంకర్). వేషాలు ఎర వేసి వాళ్లను వాడుకొంటూ అన్యాయం చేస్తున్న వర్మకు ఓ ఔత్సాహిక యువతి భంగపాటుకు గురవుతుంది. అలాగే వర్మతో సినిమా తీయాలనే ఎప్పటి నుంచో ఎదురుచూసే నిర్మాత శేఖర్ (మహేష్ కత్తి)కి ఆర్జీవి షాకిస్తాడు. తాను ఊహించుకొన్న ఆర్జీవికి ఎదురుగా ఉండే వ్యక్తి నిజస్వరూపం చూసి దిగ్బ్రాంతికి గురవుతాడు.

    పరాన్నజీవిలో ట్విస్టులు

    పరాన్నజీవిలో ట్విస్టులు

    ఆర్జీవి చేసిన నమ్మక మోసానికి గురైన హీరోయిన్ ఏం చేసింది? ఎలా పగతీర్చుకొన్నది? ఆర్జీవి నుంచి ఊహించిన ప్రవర్తనను చూసిన నిర్మాత శేఖర్ ఆయనకు ఎలా బుద్ది చెప్పారు? తన అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి (లక్ష్మణ్ మీసాల) తన బాస్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పారు. అలాగే గత చిత్రాలు రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాల్లోని పాత్రలు కూడా ఆర్జీవికి ఎలా బుద్ది చెప్పారనే అనే ప్రశ్నలకు సమాధానమే పరాన్నజీవి కథ.

    పరాన్నజీవి ఫస్టాఫ్ రివ్యూ

    పరాన్నజీవి ఫస్టాఫ్ రివ్యూ

    డైరెక్టర్ ఆర్జీవి అమ్మాయిలపై చూపే శ్రద్ద, నీలిచిత్రాలపై ఉండే ఆసక్తి, మద్యం (వోడ్కా) వ్యసనం లాంటి అంశాలను ప్రధానంగా చేసుకొని సినిమా మొదలవుతుంది. ఎదుటి వాళ్లను చూసి భయంతో వణికిపోయే లక్షణం ఆయనను మానసిక బలహీనతకు కారణమవుతుంది. ఇలా ఆర్జీవి చేతిలో మోసపోయిన ప్రతీ వ్యక్తి, అలాగే ఇతరుల జీవితాలతో ఆయన ఎలా ఆడుకొంటారు, నిర్మాతలను ఎలా వేధిస్తారనే అంశాల ఆధారంగా సన్నివేశాలు సాగుతాయి.

    పరాన్నజీవి సెకండాఫ్ రివ్యూ

    పరాన్నజీవి సెకండాఫ్ రివ్యూ

    ఇక రెండో భాగంలో వర్మకు ఎదురైన ప్రతికూల సంఘటనలు, వాటిని చూసి ఎలాంటి ఆత్మనూన్యతకు లోనయ్యారు? ఇక ఆయన చేతిలో భంగపాటు గురైన వ్యక్తులు ఏకమై ఆర్జీవికి హితబోధ చేశారనే విషయాలు అత్యంత సినిమాటిక్‌గా అనిపిస్తాయి. చివర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా మాకు విచక్షణ ఉంది. ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవడం మా నాయకుడు నేర్పించలేదు. మిమ్మల్ని ఏదైనా చేయాలంటే ఓ క్షణం పట్టదు. కానీ మా విధానం అది కాదు అంటూ సినిమా ముగుస్తుంది. ఇక ఎండ్ టైటిల్స్‌లో జనసేన అధినేత ఉద్దేశించి చిత్రకరించిన పాట ఫ్యాన్స్ ఉత్తేజాన్ని ఇస్తుంది.

     దర్శకుడిగా నూతన్ నాయుడు

    దర్శకుడిగా నూతన్ నాయుడు

    ఇక నటుడిగా, బిగ్‌బాస్ ఫేమ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితులైన నూతన్ నాయుడు పరాన్నజీవికి దర్శకుడిగా వ్యవహరించారు. రాధా గోపాల్ వర్మకు తగిన పాత్రకు తగినట్టుగా కథ రాసుకోవడంలో, కథనాన్ని అందించడంలో సఫలమయ్యాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ రాదు. తక్కువ సమయంలో మంచి అవుట్‌పుట్‌ను ప్రేక్షకుడికి అందించడంలో తన ప్రతిభను చాటుకొన్నారు. పరాన్నజీవిని ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా అందించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదనే భావన కలుగుతుుంది.

    ఆర్జీవిగా అదరగొట్టిన షకలక శంకర్

    ఆర్జీవిగా అదరగొట్టిన షకలక శంకర్

    ఇక శకలక శంకర్ ఆర్జీవిగా అదరగొట్టేశాడు. ఆర్జీవి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సరైన హావభావాలు పలికిస్తూ సూపర్ అనిపించేలా చేశాడు. రాధా గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి అనే డైరెక్టర్‌ను గుర్తుచేసేలా నటించాడు. పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా వందశాతం న్యాయం చేశాడనిచెప్పవచ్చు. ఇంకా కంటెంట్ నిడివి ఎక్కువగా ఉండి పాత్రను బలంగా రూపొందించినట్టయితే ఇంకా ఇరగదీసేవాడనే ఫీలింగ్ కలిగింది.

    మహేష్ కత్తి.. లక్ష్మణ్ మీసాల

    మహేష్ కత్తి.. లక్ష్మణ్ మీసాల

    పరాన్నజీవి చిత్రంలో మిగితా పాత్ర విషయానికి వస్తే.. కనిపించినంత సేపు లక్ష్మణ్ మీసాల, కత్తి మహేష్ తన హావభావాలు, డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నారు. హీరోయిన్‌ పాత్రలో నటించిన యువతి ఫర్వాలేదనిపించారు. మిగితా పాత్రల్లోని వారు ఒకే అనిపించారు. 40 నిమిషాల నిడివి ఉన్నందున్న ఆర్జీవి పాత్ర తప్పిస్తే మిగితా పాత్రలకు అంతగా స్కోప్ లేకపోయింది.

    టెక్నికల్ విభాగాలు

    టెక్నికల్ విభాగాలు

    పరాన్నజీవి సినిమా సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. మ్యూజిక్, పాటలు బాగున్నాయి. సన్నివేశాలను చాలా రిచ్‌గా చిత్రకరించారు. ఎడిటింగ్ ఫర్వాలేదు. అక్కడక్కడా హడావిడిగా షూట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఇతర విషయాల్లో ఎక్కడా పెద్దగా లోపాలు కనిపించవు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పరాన్నజీవి ఓ డైరెక్టర్ జీవితంపై తీసిన సినీ విమర్శనాస్రం. నైతిక విలువలకు తిలోదాలకు ఇచ్చిన ఓ గొప్ప దర్శకుడికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం కనిపిస్తుంది. కాకపోతే వ్యక్తిగతంగా, డైలాగ్స్, పాటలతో భారీగా టార్గెట్ చేయడం అభిమానులకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇక ఎలాంటి అంచనాల లేకుండా.. సరదాగా వీకెండ్‌లో టైమ్ పాస్ చేద్దామనుకొనే వారికి.. డై హార్డ్ ఫ్యాన్స్ వాళ్లకు నచ్చుతుంది. ఈ సినిమా శ్రేయాస్ ఈటీ యాప్‌లోని 99 థియేటర్ వరల్డ్‌లో రిలీజైంది. టికెట్ ధర 100 రూపాయలు. 48 గంటలపాటు వాలిడిటీ ఉంటుంది.

    Recommended Video

    PARANNAGEEVI Official Trailer | RGV | Shakalaka Shankar
    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: షకలక శంకర్, మహేష్ కత్తి, మీసాల లక్ష్మణ్ తదితరులు
    దర్శకత్వం: నూతన్ నాయుడు
    నిర్మాత: సీఎస్
    సంగీతం:
    సినిమాటోగ్రఫి:
    ఎడిటింగ్:
    రిలీజ్

    English summary
    Parannageevi reckles Genetic Virus movie trailer released. Shakalaka Shankar' RGV Character creates sensational with dialogues. This movie released on Shreyas ET app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X