twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరవశించని పరవశం

    By Staff
    |

    Paravasam
    చిత్రం: పరవశం
    నటీనటులు: మాధవన్‌, సిమ్రాన్‌, లారెన్స్‌, స్నేహ
    సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
    నిర్మాత: ఎ.ఎం.రత్నం
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్‌

    ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన బాలచందర్‌ తన వందో చిత్రం ఇంత పేలవంగా తీస్తాడని ఎవరూ ఊహించరు. బాలచందర్‌ ఇప్పటి ట్రెండ్‌ కు అనుగుణంగా చిత్రం తీశాడు తప్ప చిత్రంలో ఎక్కడా 'కెబి' మార్క్‌ కనిపించదు. ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే స్టైల్‌ గా తీసిన అర్థంపర్థం లేని సినిమా. విడాకులు తీసుకున్న స్త్రీ జీతం ఎలా ఉంటుందో చెప్పాలని బాలచందర్‌ ప్రయత్నం. కానీ చివరకు ప్రేమకథ టైప్‌ లో తీయాలన్న ప్రయత్నంలో సినిమా అంత చెడగొట్టాడు. తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే కటించడం ఈ చిత్రంలో శేషం. పెద్ద దర్శకులు కూడా ఘోరమైన తప్పిదాలు చేస్తారనడానికి ఈ సినిమా క్లాసిక్‌ ఎగ్జాంపుల్‌. ప్రథమార్థం మాత్రం బాగుంది. బాగుంది కదా అని ఇంటర్వెల్‌ తర్వాత కూడా మనం కూర్చొని చూస్తే- అప్పుడు మొదలవుతుంది అసలు చెత్త సినిమా.

    సెకండ్‌ హాప్‌ అంతా తుళ టెలిజన్‌ సీరియల్‌ లాగా ఉంటుంది. అతి సాధారణమైన ఈ సినిమాలో మనల్ని ప్రథమార్తం కట్టిపడేసిది ఎ.వెంకటేష్‌ అద్భుతమైన ఫోటోగ్రఫీయే. చాలా ఫెులీయర్‌ లొకేషన్స్‌ కూడా ఎంతో వైధ్యంగా చిత్రీకరించాడు. ప్రతి దృశ్యాన్ని ఎంతో రిచ్‌ గా, టైట్‌ క్లోజప్‌ లో చిత్రీకరించాడు. ఇక రెహమాన్‌ ఈ మధ్య కాలంలో ఇంత పేలవమైన సంగీతం ఇచ్చింది ఇదే చిత్రంలో. ఈ సినిమా థీమ్‌ కు కొన్ని పాటలు సూటైనా ఓవరాల్‌ గా రెహమాన్‌ సంగీతం ఎక్కడా నసొంపుగా ఉండదు.

    దానికి తగ్గట్లే సాహిత్యం. నీవే నా జాతీయ గీతం...రంజనా..ఓ రంజనా అనే పాట నండి. ప్రియురాలుని జాతీయ గీతం అని పోల్చడం ఏుటో అర్థం కాదు. ఇక చివర్లో వచ్చే క్లైమాక్స్‌ ఘట్టం పరమ దరిద్రం. రెహమాన్‌ కంపోజ్‌ చేసిన అగ్రఘట్టం..ఉగ్ర ఘట్టం అనే ఒక సుత్తి పాట వస్తుంటుంది...మరో వైపు చిత్రచిత్రంగా దృశ్యాలు...మారుతుంటాయి. పాత్రలు కూడా రకరకాలుగా మారుతుంటాయి. సినిమాలో ఇదే అధమ ఘట్టం.

    కథ పరంగా వస్తే.... మాధవన్‌ డాక్టర్‌ కమ్‌ యాక్టర్‌. మాధవన్‌ అంటే అమ్మాయిలకు పరీతమైన ప్రేమ. ఎంతోమంది అమ్మాయిలు ప్రేుస్తుంటారు. ఆఖరికి వాళ్ళ ఆసుపత్రిలో పనిచేసే నర్స్‌ స్నేహ కూడా లవ్వాడుతుంది. వాళ్ళందర్నీ తప్పించుకునేందుకు- సిమ్రాన్‌ ను పెళ్ళిచేసుకుంటాడు. పెళ్ళి అయిన కొద్ది రోజులకే- మాధవన్‌ పాత ఎఫైర్‌ ఒకటి బయటపడుతుంది. దాంతో సిమ్రాన్‌ డిపోతుంది. విడాకులు తీసుకుంటుంది. ఆ తర్వాత సిమ్రాన్‌ నాన్న చనిపోతాడు. అన్నీ అప్పులు. ఆ టైంలో అన్ని రకాలుగా మాధవన్‌ ఆమెకు సాయం చేస్తాడు. దీంతో ఆమెకు మాధవన్‌ పై ప్రేమ మళ్ళీ కలుగుతుంది. కానీ మాధవన్‌ ఆమెను చేసుకుంటుండా...? ఇద్దరు చివరికి ఎలా కలుస్తారనేదే గంటన్నర పాటు సాగే సెకండ్‌ హాఫ్‌.

    మాధవన్‌ నటన బాగుంది. పరిణతి కనిపించే నటన. పిచ్చి, పిచ్చిగా నవ్వడం, గంతులు వెయ్యడం లేకుండా చాలా సింఫుల్‌ గా చేశాడు. సిమ్రాన్‌ ఎమోషనల్‌ సీన్స్‌ లో 'వెరైటీ'గా చేసింది( దాన్ని నటన అంటారో లేదో తెలియదు). వేక్‌ జోక్స్‌ బాగున్నాయి. ఇక ుగతా పాత్రలన్నీ మనం రోజు టీవీలో బాలచందర్‌ సీరియల్స్‌ లో చూసే వాళ్లే. అందరికన్నా లారెన్స్‌ బాగా చేశాడు. ముఖ్యంగా ఆయన ఫ్యూజన్‌ డాన్స్‌ చాలా బాగుంది. ఆయన చేసే డాన్స్‌ లు మాత్రం పరవశింప చేస్తాయి. ఇక మిగతా అంతా శుద్ద దండగ. రెహమాన్‌ రీరికార్డింగ్‌ మాత్రం బాగుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X