twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీయ గ్లామర్ షో...(పవిత్ర రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5
    హైదరాబాద్ : దర్శకుడు జనార్ధన మహర్షి గతంలో 'దేవస్థానం' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం కమర్షియల్‌గా ఫెయిలైంది. రైటర్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన ఈయన తన సెకండ్ స్టెప్‌లో మసాలా అంశాలతో శ్రీయ ప్రధాన పాత్రలో వేశ్యగా 'పవిత్ర' సినిమా రూపొందించారు. మరి సినిమా విశేషాలేమిటో చూద్దాం...

    పవిత్ర(శ్రీయ) క్యాన్సర్ భారిన పడిన తన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు సంపాదన మార్గంగా వేశ్య వృత్తిలోకి దిగుతుంది. ఖరీదైన వేశ్య అయిన ఆమె వద్దకు అవినీతి ఎమ్మేల్యే సుదర్శన్(సాయికుమార్), ఫేక్ బాబా సర్వ రోగా నిరోధానంద స్వామి(రవిబాబు) లాంటి వారు కూడా వస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును మున్నా(కౌషిక్ బాబు)ను పోటీలో నిలబెట్టాలని చూస్తాడు సుదర్శన్. మున్నా భయస్తుడు కావడంతో అనిలో మార్పు తేవడానికి కొడుకును పవిత్ర దగ్గరికి పంపిస్తాడు.

    దీంతో మున్నా పవిత్రను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని తండ్రితో చెప్పడంతో...రాజకీయంగా ప్లస్సవుతుందని వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత కథ మలుపు తిరిగి పవిత్ర రాజకీయాల్లోకి వస్తుంది. మోడల్స్ గా మారుస్తానని అమ్మాయిలను మోసం చేస్తున్న శివ(శివాజీ)ని పవిత్ర పథకం ప్రకారం జైలుకు పంపడంతో శివ పవిత్రపై కక్షకట్టి చంపడానికి ప్లాన్ చేస్తాడు. పవిత్ర రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి? వచ్చి ఏం చేసింది? శివ ఏం చేసాడు అనేది తర్వాతి కథ.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో..

    శ్రీయ పెర్ఫార్మెన్స్...

    పెర్మార్మెన్స్ పరంగా శ్రీయ అదరగ గొట్టింది, ఇక గ్లామర్ పరంగా శ్రీయ గత సినిమాల కంటే రెండాకు ఎక్కువే చూపింది కానీ...అందాల ప్రదర్శనలో ఎలాంటి లోటు చేయలేదు.

    ఇతర పాత్ర ధారులు ఓకే


    అవినీతి ఎమ్మెల్యే పాత్రలో సాయి కుమార్, స్వామిజీ పాత్రలో రవిబాబు బాగా నటించారు. తనికెళ్ల, యండమూరి, తెలంగాణ శకుతల, రక్ష, ఏవీఎస్, రోజా, కౌశిక్ బాబు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. బ్రహ్మనందం ఓ చిన్నపాత్రలో కొంతసేపు మాత్రమే కనిపించారు.

    టెక్నికల్ అంశాలు


    టెక్నికల్ అంశాల పరంగా సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రమేష్ ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. ఎంఎం శ్రీలేఖ సంగీతం ఓ రేంజి కాకున్నా వినసొంపుగా ఉంది. డైలాగులు బాగున్నాయి. స్టోరీ కూడా మంచి ఉద్దేశ్యంతో తయారు చేసి ఆలోచనాత్మకంగా ఉంది.

    స్ర్కీప్లే విషయంలో ఫెయిలైన దర్శకుడు


    తను అనుకున్న ప్రకారం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు...ప్రేక్షకులకు వినోదం పంచే అంశాన్ని మరిచాడు. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కొన్ని సీన్లు మరీ పేలగా ఉన్నాయి. దీంతో సినిమా బోరింగ్ గా తయారైంది. ముందే సినిమా క్లైమాక్స్ చూపి...మిగతా స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లాగా చూపడంతో ప్రేక్షకులకు ముందే స్టోరీ అర్థమై సస్పెన్స్ లేకుండా పోయింది.

    చివరగా చెప్పేదేమంటే...


    సినిమా బోరింగే కానీ....శ్రీయ గ్లామర్ అభిమానులకు కన్నుల విందు చేస్తుంది

    పవిత్ర...

    నటీనటులు, సంకేతిక విభాగం
    తారాగాణ : శ్రీయ, శివాజీ, సాయికుమార్, కౌశిక్ బాబు, ఏవిఎస్, బ్రహ్మానందం, యండమూరి, అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, కొడవలస, రోజా, తెలంగాణ శకుంతల,తదితరులు..
    సినిమాటోగ్రఫీ : సురేష్ కుమార్
    ఎడిటింగ్ : రమేష్
    సంగీతం : ఎంఎం శ్రీలేఖ
    సమర్పణ : అల్లూరు అరవింద్ రెడ్డి
    నిర్మాతలు : గురజాల మహేశ్వర రెడ్డి, కరమశెట్టి సుధాకర్
    కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శత్వం : జనార్ధన మహర్షి

    English summary
    Janardhana Maharshi had earlier directed a soft film like ‘Devasthanam' and the film almost remained as a film which could be screened in international film festivals but failed commercially.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X