»   » కుక్క పిల్లలను రక్షించిన పవన్ పిల్లలు(ఫొటోలు)

కుక్క పిల్లలను రక్షించిన పవన్ పిల్లలు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యధా తండ్రి, తథా పిల్లలు....తల్లి తండ్రుల నుంచే లక్షణాలు పిల్లలుకు వస్తూంటాయి...అవి మంచైనా ..చెడైనా..పవన్ కళ్యాణ్ పిల్లలు అకిరా, ఆద్య..ఇలా తండ్రి లోని సేవా గుణాన్ని అందిపుచ్చుకున్నారనటానికి ఇదే ఉదాహరణ. నిన్న పూణే సిటీలో వర్షం కురిసింది. ఈ వర్షంలో పవన్ మాజీ భార్య రేణు, పిల్లలు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేసారు. పిల్లలు వర్షంలో ఆడుకుంటూండగా..కొన్ని చిన్న కుక్క పిల్లలు..వర్షంలో వణుకుతూ కనిపించాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వాటిని చూసిన వెంటనే పిల్లలిద్దరూ పరుగుపరుగున వెళ్లి,గొడుగు తీసుకుని వెళ్లారు. వాటిని షెల్టర్ కు తీసుకెళ్లారు. పిల్లలే కాకుండా రేణు కూడా వారి వెనకే వెళ్లి ఆ పిల్లకు సాయిం చేసింది. ఈ ఫొటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసింది. ఆ తర్వాత ఆ పిల్లలకు ఇదిగో ఈ ఫొటో లో లాగనే కేకు చేసి పెట్టింది.

Pawan’s kids rescues puppies in rain

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గాఉంటారు. అయితే వాటిల్లో ఎక్కడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉండదు. కానీ ఆమె తన పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 4న అంటే రేపు ఆమె పుట్టిన రోజు. ఆ రోజున ఆమె ఓ ఇంటర్వూ ద్వారా తన మనస్సులో విషయాలు మన ముందుంచుతాను అంటున్నారు. అందులో ఖచ్చితంగా పవన్ గురించి ప్రస్దావన ఉండవచ్చు.

ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ... "పర్శనల్ మరియు స్పెషల్ ఇంటర్వూ నా పుట్టిన రోజున ఇస్తున్నా...నా గురించి తొలిసారిగా మాట్లాడుతున్నా...నాలుగో తేదిన యూ ట్యూబ్ లో కనపడతాను :)," అని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

Pawan’s kids rescues puppies in rain

మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తన దర్శకత్వంలోని రెండో సినిమా ఇష్క్‌ వాలా వ్‌ తెలుగులోనూ త్వరలో రిలీజవుతోంది.

Pawan’s kids rescues puppies in rain

రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా పరిచయం అవబోతోంది. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. పవన్ వి, తనవి ఇద్దరూ ఆలోచనలు చాలా విషయాల్లో ఒకటే అని చెప్తోంది.

మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో ఇలా పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అందామె.

అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.

English summary
When kids Akira and Adya are playing in the rain, they have found out couple of puppies getting drenched in the rain shower. Unable to see that, both the kids immediately rushed to them with an umbrella in hand and took those puppies into a shelter.
Please Wait while comments are loading...