For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Penguin movie review: కీర్తి సురేష్ నటన తప్ప మరోటి పెద్దగా చెప్పుకొనే అంశాలే కనిపించవు!

  |

  Rating:
  2.5/5
  Star Cast: కీర్తీ సురేష్, మాస్టర్ అద్వైత్, లింగా, రఘు
  Director: ఈశ్వర్ కార్తీక్

  మహానటి తర్వాత కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. అప్పటి వరకు గ్లామర్ తారగానే ముద్రవేసుకొన్న కీర్తీ సురేష్ ఆ చిత్రం తర్వాత ఫెర్మార్మర్‌గా, నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మంచి గుర్తింపే తెచ్చాయి. ఈ క్రమంలో కీర్తీ సురేష్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడటంతో పెంగ్విన్ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జూన్ 19న ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నది, కీర్తీ సురేష్ నటన ఎలా ఉందనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథ, కథనాలను, సాంకేతిక నిపుణుల పనితీరును పరిశీలించాలిద్దాం.

  పెంగ్విన్ మూవీ కథ

  పెంగ్విన్ మూవీ కథ

  అజయ్ (మాస్టర్ అద్వైత్) అనే బిడ్డకు తల్లి అయిన రిథమ్ (కీర్తీ సురేష్) రెండో బిడ్డకు జన్మనివ్వడానికి గర్బం దాల్చుతుంది. ఆ క్రమంలో అజయ్‌ను చార్లిచాప్లిన్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అజయ్‌ తిరిగి వస్తాడు. కానీ అజయ్‌కు అపాయం తలపెట్టేందుకు చాప్లిన్ వేషధారి వెంటాడుతుంటాడు. తన బిడ్డ అజయ్‌ను ఎవరు, ఎందుకు వెంటాడుతున్నారనే విషయంపై రిథమ్ దృష్టిపెడుతుంది. ఆ చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే తెలుసుకోవడానికి ప్రాణాలకు తెగిస్తుంది. ఆ పరిస్థితుల్లో డాక్టర్ డేవిడ్ (మాథి) లాంటి వ్యక్తిని అనుమానిస్తుంది.

  పెంగ్విన్‌లో ట్విస్టులు

  పెంగ్విన్‌లో ట్విస్టులు

  ఇంతకు అజయ్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? అజయ్‌ను ఎందుకు ఎత్తుకెళ్లారు? అజయ్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా రిథమ్‌ను మానసికంగా ఎందుకు వేధించాలనుకొన్నారు? రిథమ్‌పై చాప్లిన్ మాస్క్ ధరించిన వ్యక్తి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? డాక్టర్ డేవిడ్ ఎందుకు కిడ్నాప్ చేస్తుంటాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే పెంగ్విన్ కథ.

  ఫస్టాఫ్‌ అనాలిసిస్

  ఫస్టాఫ్‌ అనాలిసిస్

  అజయ్‌ను చాప్లిన్ వెంటాడే సీన్‌తో కథ మొదలవుతుంది. ఓ మరణం సంభవించిన ఇంట్లో అజయ్ తప్పిపోవడం లాంటి సీన్‌తో రిథమ్ తన కొడుకుపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని ఎమోషనల్‌గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అజయ్ గురించి అన్వేషణతో కథ సాగుతుంది. తొలి భాగంలో అజయ్ అన్వేషణ, గర్బవతిగా కీర్తీ సురేష్ అనుభవించే వేదనతో సరిపుచ్చారు. అలా సాదాసీదా కథ సాగుతుంది.

  కడుపులో ఉండే బిడ్డ, అలాగే తన ప్రాణాలు లెక్క చేయకుండా అజయ్ కోసం రిథమ్ పోరాటం ఆసక్తిగా మారడంతో కథపై ప్రేక్షకుడికి కొంత పట్టు దొరికినట్టు కనిపిస్తుంది. కాకపోతే కథ, కథనాల్లో చాలా లోపాలు ఉండటం సినిమా సగటుగానే సాగినట్టు ప్రేక్షకుడికి ఓ ఫీలింగ్ కలుగుతుంది.

  సెకండాప్ అనాలిసిస్

  సెకండాప్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో కేవలం రిథమ్ (కీర్తీ సురేష్) పాత్రపై ప్రధానంగా దృష్టి సారించడం, ఆమె భర్త పాత్ర, మిగితా వారిని ఆటలో అరటిపండులాగా వాడుకోవడం కథలో ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. చివర్లో విలన్ ఎవరనే పాయింట్‌ను రివీల్ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కథలో భావోద్వేగం లోపించడం సినిమా ప్రధాన లోపంగా మారిందని చెప్పవచ్చు.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే స్టోరి బేసిక్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, దానిని బలమైన కథగా మార్చడంలో డైరెక్టర్‌గా మొదటి తడబాటు కనిపిస్తుంది. కేవలం కీర్తి సురేష్ రోల్‌పైనే దృష్టి పెట్టి.. ఆ పాత్రకు బలంగా మారడానికి అవకాశం ఉన్న పాత్రలను గాలికి వదిలేయడం అతడి ఆలోచనలో లోపంగా మారిందని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే కూడా అంత ఎఫెక్ట్‌గా కనిపించకపోవడం సినిమాకు మరో ప్రధానమైన సమస్య. దర్శకుడిగా ఈశ్వర్ బలం ఏమిటంటే.. పెంగ్విన్ చిత్రం ద్వారా మరోసారి కీర్తీ సురేష్‌లోని ప్రతిభను ప్రేక్షకులకు చూపించడమే.

  కీర్తీ సురేష్ పెర్ఫార్మెన్స్

  కీర్తీ సురేష్ పెర్ఫార్మెన్స్

  పెంగ్విన్ సినిమాకు కర్త, కర్మ, క్రియ కీర్తి సురేష్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. కీర్తీ సురేష్ విషయానికి వస్తే రిథమ్‌గా నటనతో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. పెంగ్విన్‌కు వెన్నెముకగా కీర్తి సురేష్ నిలిచిందనే విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పవచ్చు. కీర్తీ సురేష్ ఫెర్ఫార్మెన్స్ చాటున మరో రోల్ దారిదాపులో కూడా కనిపించదు. ఈ సినిమాలో భావనగా నిత్య కిరుబా పాత్ర కీలకం. ఆ పాత్రను కీర్తీ సురేష్‌కు పోటాపోటీగా మార్చడంలో విఫలమయ్యారు. కొంతలో కొంత అజయ్ పాత్ర మినహాయిస్తే మిగితా పాత్రలన్నీ నాసిరకంగానే కనిపిస్తాయి.

  టెక్నికల్‌ విభాగాల పనితీరు

  టెక్నికల్‌ విభాగాల పనితీరు

  పెంగ్విన్ సినిమాలో కీర్తీ సురేష్ తర్వాత సూపర్‌గా అనిపించే విషయాలు ఏమింటంటే.. అవి సినిమాటోగ్రఫి, మ్యూజిక్. సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చడంలో కార్తీక్ పళని సక్సెస్ అయ్యారు. కొన్ని సీన్లు మాత్రం తెర మీద బ్రహ్మండంగా, రిచ్‌గా మలవడం సఫలమయ్యారు. ఇక సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. సినిమా కొంతలో కొంత ఎమోషనల్‌గా కనిపించిందంటే ఆ క్రెడిట్ సంతోస్ నారాయణకే ఇవ్వాల్సిందే. అనిల్ క్రిష్ ఎడిటింగ్ బాగాలేదు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఓవరాల్‌గా పెంగ్విన్ సినిమా గురించి చెప్పాలంటే.. కీర్తి సురేష్ నటన తప్ప మరోటి పెద్దగా చెప్పుకొనే అంశాలే కనిపించవు. భావోద్వేగాలు ఏ మాత్రం పండని చిత్రమని చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన బలమైన ఫ్లాష్ లేకపోవడం మైనస్. అలాగే విలన్ పాత్రను గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి.. ఆ పాత్రను రివీల్ చేసిన తర్వాత ఆ రేంజ్‌ ఇంపాక్ట్ కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో సినిమా నాసిరకంగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులు ఉండటం మరో లోపంగా మారింది. కాకపోతే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

  ప్లస్, మైనస్ పాయింట్స్

  ప్లస్, మైనస్ పాయింట్స్

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  కీర్తి సురేష్ నటన

  సినిమాటోగ్రఫి

  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  కథ, కథనాలు

  డైరెక్షన్

  ఎడిటింగ్

  ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోవడం

  షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: కీర్తీ సురేష్, మాస్టర్ అద్వైత్, లింగా, రఘు, నిత్య తదితరులు

  రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్

  నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, సంతానం, సుధన్ సుందరం

  మ్యూజిక్: సంతోష్ నారాయణ్

  సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని

  ఎడిటింగ్: అనిల్ క్రిష్

  రిలీజ్: 2020-06-19

  ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

  English summary
  Penguin Telugu movie review and rating: Actress Keerthy Suresh' latest movie Penguin released on Amazon Prime video on June 19th. In this occasion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X