twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైఫ్-కత్రినా ‘ఫాంటమ్’ (షార్ట్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సైఫ్‌ అలీఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'ఫాంటమ్‌'. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలుసన్నాహాలు చేస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బజరంగీ భాయిజాన్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

    విడుదల ముందే ఈ చిత్రం వివాదాల్లో ఇరుక్కుంది. పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఈచిత్రంపై నిషేదం విధించింది. ఈ సినిమా ఉగ్రవాదానికి వ్యతిరేకమే తప్ప, పాకిస్థాన్ కు వ్యతిరేకం కాదని దర్శకుడు కబీర్ ఖాన్ ఇప్పటికే మీడియా ముఖంగా వెల్లడించారు. కనీసం సినిమాలో ఏముందో కూడా చూడకుండా నిషేదం విధించడం నన్ను షాక్ కు గురి చేసిందన్నారు.

    ఆ సంగతి పక్కన పెడితే విడుదలకు ముందే ఈ చిత్రాన్నిముంబైతో పాటు, పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శించారు. ఆ మధ్య బాహుబలి సినిమాకు చెత్తగా ఉందని రివ్యూ రాసిన కైరా... ఈ సినిమాలో సేమ్ ఓల్డ్ స్టోరీ అని విమర్శిస్తూ జీరో రేటింగ్ ఇచ్చింది. జనాలు చెత్త సినిమా అని తేల్చిన జంజీర్ కు సూపర్ రేటింగ్ ఇచ్చిన ఘనత కూడా ఈవిడదే.

    Phantom Movie Review

    మరి ఇంతకీ ఫాంటమ్ సినిమా ఎలా ఉంది? నిజంగానే ఓల్డ్ స్టోరీతో సినిమా తెరకెక్కిందా? ప్రేక్షకులను సినిమా పూర్తయ్యే వరకు సీట్లో కూర్చో పెట్టే సత్తా ఈ సినిమా ఉందా? అనేది రివ్యూలో చూద్దాం...

    తారాగణం: సైఫ్ అలీ కాన్, కత్రినా కైఫ్
    డైరెక్టర్: కబీర్ ఖాన్

    ఫాంటమ్ స్టోరీ విషయానికొస్తే..
    26/11 ముంబైపై ఉగ్రవాదుల దాడి అంశాలతో రచయిత హుస్సేన్ జాయిది రాసిన ‘ముంబై అవెంజర్స్' పుస్తకంగా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 26/11 దాడుల తర్వాతి రియల్ ఫూటేజీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆర్మీ ఆఫీసర్ డేనియల్ ఖాన్‌ను RAW... 26/11 దాడులకు సంబంధించిన మిషన్ పూర్తి చేయడానికి రంగంలోకి దించుతుంది. అతడు తన టీం, మాజీ RAW ఏజెంట్, ఆయుధాల సప్లయయర్ నవాజ్ (కత్రినా కైఫ్)తో మిషన్ మొదలు పెడతాడు. మిషన్ ఎలా పూర్తి చేసారు అనేది తర్వాతి స్టోరీ.

    పాజిటివ్ పాయిట్స్..
    మిషన్ పూర్తి చేయడంలో మాజీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓంకారా చిత్రం తర్వాత సైఫ్ అలీ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో చూడొచ్చు. బజరంగీ భాయిజాన్ తర్వాత కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఆ స్థాయి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ బావున్నాయి. సినిమాకు సంబంధించిన మెయిన్ పాజిటివ్ పాయింట్... వేగంగా సాగే స్టోరీలైన్. సినిమా పూర్తయ్యే వరకు మిమ్మల్ని సీట్లో కూర్చునేలా చేస్తుంది. నేరేషన్ కూడా బావుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది.

    నెగెటివ్ పాయింట్స్..
    సినిమాలో కత్రినా కైప్ పెరెర్పార్మెన్స్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఆమె తప్ప అందరూ బాగానే నటించారు.

    చివరగా...
    సినిమా కథలోని ఊహించని ట్విస్టులు మిమ్మల్ని ఎంటర్టెన్ చేస్తాయి.

    English summary
    Phantom movie directed by Kabir Khan found itself in a host of controversies owing to the Pakistan Censor Board banning it! Saif Ali Khan's comments on the issue led to his movies getting banned in the country forever. Film reviewer Kiaara ended up giving the movie 0 rating out of 5, claiming it to be a same old story. So is Phantom really a same old story or is it an edgy tale which keeps you at the edge of your seats? Time to find out, read the movie review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X