For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిల్ల జమిందార్ రివ్యూ

  |

  నటీనటులు: నాని, హరి ప్రియ, బింధు మాధవి, అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, ఎం.ఎస్ నారాయణ, శివప్రసాద్, వెన్నెల కిషోర్, సమీర్ , నాగినీడు, తాగుబోతు రమేష్ తదితరులు.

  బ్యానర్: శ్రీ శైలేంద్ర సినిమాస్

  మాటలు: చంద్రశేఖర్

  సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

  సంగీతం: సెల్వ గణేష్

  నిర్మాతలు: డిఎస్ రావు, ఎస్ ఎస్ బుజ్జి

  దర్శకత్వం: జి. అశోక్

  సినిమా సినిమాకు తనలోని నటుడన్ని మెరుగు పరుచుకుంటూ ఎదుగుతున్నాడు హీరో నాని. తాజాగా పిల్ల జమిందార్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి థియేటర్లో వాలాడు. మరి ఈ 'పిల్ల జమిందార్" సంగతేంటో చూద్దాం..

  జమిందారీ కుటుంబంలో పుట్టిన కుర్రాడు పిజె(నాని). కోపిష్టి మాత్రమే కాదు విపరీతమైన అహంభావి.. పైగా బేవార్సు. రూ. 5 వేల కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. అయితే పిజె మేజర్ అయిన తర్వాతనే ఆ ఆస్తి దక్కేలా వీలునామా రాస్తాడు వాళ్ల తాత(నాగినీడు). మేజర్ కాగానే సరిపోదు, అందుకు కొన్ని కండీషన్లు కూడా పెడతాడు. అందులో ముఖ్యమైన కండీషన్ పిజె మూడు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేయాలి. అయితే బేవార్సుగా తిరిగే పీజేకి ఈ షరతులంటే అస్సలు పడవు. మరి ఆస్తి దక్కించుకోవాలి కాబట్టి వీలునామా కండీషన్ల ప్రకారం సిరిపురం గ్రామంలో మిలటరీ రాజన్న(రావు రమేష్) హాస్టల్ లో ఉంటూ, మంగమ్మ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకోవడానికి బయలుదేరుతాడు పిజె. వీలునామా కండీషన్లులో నెగ్గడం బేవార్సు పిజె వల్ల అవుతుందా? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే థియేటర్లదాకా వెళ్లాల్సిందే.

  నటన విషయానికొస్తే... నాని నాచురల్‌గా నటించాడు. గతంలో కంటే తన యాక్టింగ్ టాలెంట్‌ను మరింత మెరుగు పరుచుకున్నాడు. తన ఒక రకంగా చెప్పాలంటే సినిమాను ఒంటి చేత్తో నడిపించాడు. హీరోయిన్లు హరిప్రియ, బింధు మాధవి పాత్రలకు తగిన విధంగా నటించాడు. బింధు మాధవి హాట్ గా కనిపించడంతో పాటు తన అందంతో ఆకట్టుకుంది. నానికి క్యారెక్టర్ కు సపోర్టుగా ఉండే పాత్రలో బింధుమాధవి, నాని క్యారెక్టర్ లో మార్పుకు కారణమయ్యే పాత్రలో హరిప్రియ బాగా నటించారు. ఇక హాస్టల్ వార్గెన్ గా రావు రమేష్, తెలుగు లెక్చరర్ గా ఎంఎస్ నారాయణ ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ తనదైన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ ఇతర నటీనటులు వారి పరిధిమేర రాణించారు. మేఘన నాయుడు ఊటం సాంగ్ ఊరమాస్ పాటగా స్టెప్పులేయిస్తుంది.

  సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. అయితే సెల్వగణేష్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. చంద్రశేఖర్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

  కథ, కథనానికి తోడు దర్శకుడి పని తీరు, నాని యాక్టింగ్ సినిమాను ప్రేక్షకులు మెచ్చే వినోదాత్మక చిత్రంగా నిలబెట్టాయి. పంచ్ డలాగులు, కామెడీ అంశాలను పేల్చడంలో దర్శకుడు అశోక్, నాని కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చక్కగా కుదిరాయి. అలాగే గుండెను తట్టే సెంటిమెంటు సీన్లు కూడా అంతే బాగా కుదిరాయి. మొత్తం మీద 'పిల్ల జమిందార్"ఫ్యామిలీతో చూడదగ్గ చక్కనైన ఎంటర్ టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు.

  English summary
  Nani, Hari priya, Bindhu Madhavi starred 'pilla zamindar movie released on Oct 14. This film directed by Ashok and directed by D S Rao, S S Buchibabu. The good side of the film is that the script has been met with a different treatment altogether.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X