For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Playback’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  రేటింగ్ : 2.75

  తెలుగులోనూ మూస ధోరణిని పక్కన పెట్టేసి.. ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కొత్తదనానికి పట్టం కడుతున్నారు. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలను ఆదరించే రోజులు పోయాయి. ఈ విషయం ఈ మధ్య అందరికీ అర్థమైంది. అందుకే మేకర్స్ కూడా కొత్త జానర్లు, కథ కథనాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆక్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ప్లే బ్యాక్. గతాన్ని వర్తమానాన్ని లింక్ చేస్తూ చేసిన ప్రయోగం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

  కథ..

  కథ..

  కార్తి (దినేష్ తేజ) అనే యువకుడికి జర్నలిస్ట్ కావాలనే కోరిక ఉంటుంది. మీడియా సంస్థలో ఉద్యోగానికి చేరుతాడు. అనుకోని కారణాల వల్ల ఓ పాత ఇంటికి మారిపోతాడు కార్తి. టెక్నాలజీ పరుగులు పెడుతున్న సమయంలో పాత ఇంట్లో పురాతన ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్‌తో అసలు కథ మొదలవుతుంది. ఆ ల్యాండ్ లైన్‌కు సుజాత (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి ఫోన్ చేస్తుంటుంది.

  కథలో ట్విస్టులు..

  కథలో ట్విస్టులు..

  ల్యాండ్ లైన్ కనెక్షన్ లేకపోయినా ఫోన్ రావడం ఏంటి? అసలు సుజాత చెప్పే వాటికి జరుగుతున్న వాటికి పొంతన ఎందుకు ఉండదు? 1993లో ఉన్న సుజాత.. వర్తమానంలో ఉన్న కార్తికి ఎలా కలిసింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? గతంలో సుజాతకు ఏర్పడిన ప్రమాదాన్ని, వర్తమానంలో ఉన్న హీరో ఎలా పరిష్కరించగలిగాడు వంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్లే బ్యాక్.

  ఫస్టాఫ్‌ అనాలిసిస్..

  ఫస్టాఫ్‌ అనాలిసిస్..

  సినిమా ప్రారంభమైన కొద్ది క్షణాలకే అసలు కథలోకి వెళ్తాం. ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించదు. నేరుగా కథలోకి వెళ్లడం, టెక్నాలజీతో దూసుకుపోతోన్న తరుణంలో అమాయకంగా ఉన్న సుజాతకు, నేటి కాలానికి తగ్గట్టున్న కార్తికి మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే అసలు కథ మాత్రం ఇంటర్వెల్‌కు యూటర్న్ తిరుగుతుంది. అసలు ట్విస్ట్ తెలిసి కార్తి షాక్ అవుతాడు. ఇంటర్వెల్ సమయానికి ప్రేక్షకులు ఫుల్ థ్రిల్ ఫీల్ అవుతాడు.

  Nithiin Is Very Lucky - Kalyani Malik | Check Movie
  సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  క్రాస్ కనెక్షన్ వల్లే ఇదంతా జరిగిందని, గతంలో ఉన్న అమ్మాయిని ఇప్పుడు ఇలా తనతో మాట్లాడుతోందని తెలుసుకుంటాడు కార్తి. గతం, వర్తమానం అంటూ తిరిగే కథ అందరినీ సీటు అంచును కూర్చునేలా చేస్తుంది. ద్వితీయార్థం మొత్తం కూడా స్క్రీన్ ప్లే అదరగొడుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా తరువాత ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అంటూ సినిమాలో లీనమై చూసేలా చేయడంతో ద్వితీయార్థం ప్రధాన పాత్రను పోషిస్తుంది.

  నటీనటులు..

  నటీనటులు..

  ప్లే బ్యాక్ సినిమా మొత్తంలో ఐదారు పాత్రలే ఉంటాయి. కానీ మన కళ్లు మాత్రం అనన్య నాగళ్ల, దినేష్ తేజ్ చుట్టే తిరుగుతుంటాయి. దినేష్ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. అయితే కొన్ని సీన్స్‌లో తడబడినట్టు కనిపిస్తోంది. ఇక అనన్య మాత్రం చూపు తిప్పుకోనిక్కుండా చేసేస్తుంది. అందంలో, నటనలో తనకు తానే సాటి అనిపించుకుంది. మల్లేశం తరువాత మళ్లీ తన సత్తాను చాటుకుంది. ఇక టీవీ 5 మూర్తి, టీఎన్ఆర్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  క్రాస్ కనెక్షన్ అనే లైన్‌తో సినిమా అనేది తెలుగు తెరకు కొత్త. ఇలాంటి విభిన్న కథలు, ప్రయోగాలు ఎక్కువగా అంతర్జాతీయ స్థాయిలో వస్తుంటాయి. ఈ ప్లే బ్యాక్ సినిమా కూడా అక్కడినుంచి స్ఫూర్తి పొందిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా.. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు కథను అల్లడంలో హరి ప్రసాద్ జక్కా నూటికి నూరు మార్కులు సాధించేశారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు మన స్క్రీన్‌కు కొత్త కావడంతో చాలా మంది ఆడియెన్స్‌కు ఎక్కకపోవచ్చు. కానీ వాటిని ఎంజాయ్ చేసే ఓ సెక్షన్ వారికి మాత్రం ప్లే బ్యాక్ బాగా ఎక్కేస్తుంది. సుకుమార్ గ్రూపులోంచి వచ్చిన జక్కా ప్రసాద్.. తన కంటూ ఓ ముద్రను వేసుకున్నాడు. సుకుమార్ కాంపౌండ్ చాయలేవీ కనిపించకుండా అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  ప్లే బ్యాక్ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించాలంటే సాంకేతిక విభాగాలు ఎంతో గొప్పగా సహకారం అందించాల్సి ఉంటుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి విభాగాలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అలా ప్లే బ్యాక్ సినిమాకు కమ్రన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయింది. బుజ్జి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. బ్యాంక్ అండ్ ఫోర్త్ లాంటి సినిమాల్లో ఎడిటింగ్ ప్రధానం. ప్లే బ్యాక్ సినిమాను ప్రేక్షకులకు ఎక్కేలా నాగేశ్వర్ రెడ్డి బొంతల అద్బుతంగా కట్ చేశారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

  బలం బలహీనతలు..

  బలం బలహీనతలు..

  ప్లస్ పాయింట్స్

  హీరో హీరోయిన్స్

  కథ

  దర్శకత్వం

  మైనస్ పాయింట్స్

  ప్రథమార్థం

  అక్కడక్కడా లాజిక్స్ మిస్ అవ్వడం

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  ఇలాంటి కొత్త సినిమాలు రావడం, ప్రయోగాలు చేయాలనే అనుకోవడమే అరుదుగా జరుగుతుంటుంది. అలా కొత్త చిత్రాలు వచ్చినప్పుడు ఆదరించాల్సి ఉంటుంది. ప్లే బ్యాక్ వంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలకు జనాలు మరి ఏ మేరకు ఓట్లు వేస్తారో చూడాలి. ప్లే బ్యాక్ కచ్చితంగా థ్రిల్లింగ్‌కు గురి చేస్తుందని మాత్రం చెప్పవచ్చు.

  నటీనటులు

  నటీనటులు

  నటీనటులు : దినేష్ తేజ్,అనన్య నాగళ్ల తదితరులు

  దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా

  నిర్మాత : ప్రసాద్ రావు పెద్దినేని

  మ్యూజిక్ : కమ్రన్

  సినిమాటోగ్రఫి : కె బుజ్జి

  ఎడిటింగ్ : నాగేశ్వర్ రెడ్డి బొంతల

  రిలీజ్ డేట్ : 2021-03-05

  రేటింగ్ : 2.75

  English summary
  Playback is an Telugu language Science Fiction And Thriller written and directed by Hari prasad jakka. The film stars Dinesh teja, Ananya nagalla,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X