twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెంటలే..కృష్ణా(రివ్యూ)

    By Staff
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    రేటింగ్:వరస్ట్
    నటీనటులు:పోసాని కృష్ణ మురళి,సత్యకృష్ణన్,నాగబాబు,
    బ్రహ్మానందం,ఈటీవీ ప్రభాకర్,గిరిబాబు,రఘుబాబు,
    రంగనాధ్,గౌతంరాజ్,శివాజీరాజా తదితరులు.
    ఆర్ట్:బాబ్జి
    కెమెరా:గాదిరాజు శ్రీనివాస్
    ఎడిటింగ్:మోహన్-రామారావు
    సంగీతం:వందేమాతరం
    నిర్మాత: మోహన్ వడ్డపట్న
    కథ,స్క్రీన్ ప్లే,రచన,దర్శకత్వం:పోసాని కృష్ణ మురళి
    రిలీజ్ డేట్:ఒకటి జనవరి 2009.

    క్రితం సంవత్సరం 'ఆపద మ్రెక్కులవాడు' సినిమాతో జనాల్ని భయపెట్టిన పోసాని కృష్ణ మురళి తాజాగా మెంటల్ కృష్ణ సినిమాతో టైటిల్ జస్టిఫికేషన్ కి పూనుకున్నారు.మహిళలకు ఫేవర్ చేస్తున్నానంటూ తీసిన ఈ చిత్రంలో మహిళలేకాక,మగవాళ్ళు సైతం వినలేని,తట్టుకోలేని సన్నివేశాలు రాసి,తీసి,నటించారు. కన్నడ హీరోను ఉపేంద్రను అనుకరిస్తూ గెటప్స్ వేసిన ఈ సినిమా ఏ వర్గాన్నీ (చివరకు ఏ వర్గాన్ని కూడా) ఆకట్టుకోవటం కష్టం.

    పాయింట్ ఏంటి?
    పెళ్ళయిన రాత్రే తన భార్యకో లవర్ ఉన్నాడని, అతన్ని,ఆమెనీ డబ్బుకోసం పెద్దలు విడతీసారని తెల్సుకుని వాళ్ళని కలపాలనుకుని నానా వేషాలు వేసిన ఓ తింగర త్యాగమూర్తి కథ ఇది.

    కథగా...
    సత్య(సత్యకృష్ణన్) ఓ పాలబ్బాయిని ప్రేమిస్తుంది.(ఆ కుర్రాడుని చూస్తే ప్రేమ గుడ్డిది అన్న నానుడి నిజమేననిపిస్తుంది) పెద్దలును సైతం ఒప్పించి ఆ ప్రపోజల్ ని పీటలు మీదకు తీసుకొస్తుంది. అయితే కరెక్టుగా పెళ్ళి సమయంలో ఆ పెళ్ళికొడుకు మిస్సవుతాడు. పెళ్ళి ఆగిపోతుందనుకునే ఆ పరిస్ధితిలో తమ ఫ్యామిలీ ప్రెండ్ పుత్రరత్నం అయిన ముద్దు కృష్ణ(పోసాని)ఆదుకుని పెళ్ళి చేసుకుంటాడు. పోన్లో ఏదో పెళ్ళి అయిందిలే అనుకున్న ఆమె సంతోషం ఎంతో సేపు నిలవదు. శోభనం రాత్రే అతను ఓ నైటీ వేసుకుని శాడిస్టులా బిహేవ్ చేస్తూ తన విశ్వరూపం చూపెడతాడు. నువ్వు ఇంతకు ముందు వేరే వాడితో తిరిగిన దానివి కదా అని టార్చర్ పెడతాడు. మరో ప్రక్క తాను నపుంసకుడిని అని అసలు విషయం చెబుతాడు. అంతటితో ఆగుతాడా అంటే తనకో భాయ్ ప్రెండ్ బాబి(రఘుబాబు) ఉన్నాడని వెళ్ళి అతని ప్రక్కలో దూరుతాడు. రఘుబాబు కూడా నైటి వేసుకుని అతనితో అసహ్యంగా బిహేవ్ చేస్తూంటాడు. అలా ఆమెకు మనశ్శాంతికి(అఫ్ కోర్స్ మనక్కూడా)దూరం చేస్తాడు. ఇంకోసారి అయితే ఆమెను నొక్కుతూ..ఇదేంటి నీ శరీరం ఇంత లూజ్ గా ఉందని అంటాడు. అప్పుడామె నన్నెవరూ ఒత్తలేదు..నా ఒంట్లో పార్ట్ లు మెత్తపడటానికి అంటుంది . అలా తారాస్ధాయికి తన పిచ్చితో వెళతాడు. అప్పుడా ఇల్లాలు ఏం చేసింది. అసలు ముధ్దు కృష్ణ మెంటల్ కృష్ణలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది తెరపై చూడాల్సిందే .

    మరి క్లైమాక్స్ ఏంటో!!(ఇప్పటికీ సినిమా చూద్దాం అనుకున్న దయచేసి ఈ లైన్స్ వదిలేయండి)

    అలా సత్యకు పోసాని పెట్టే టార్చర్ పెరిగి పెరిగి క్లైమాక్స్ కి వస్తుంది. ఓ రోజు మీడియాను పిలిచి సత్యతో నీ భాయ్ ప్రెండ్ తో ఇప్పటికీ నువ్వు తిరుగుతున్నావు అని నిరూపిస్తాను అంటాడు. మీడియా కదిలి వస్తుంది. అప్పుడు అసలు విషయం రివిల్ అవుతుంది. సత్యని లవర్ ఆ రోజు మిస్సవటానికి కారణం బయిటపడుతుంది.

    అధ్బుతమైన ట్విస్టు
    అదేంటంటే సత్య తల్లి తండ్రులు..పోసాని తల్లి తండ్రులు కలసి సత్య లవర్ మన అంతస్ధుకు సరితూగడని తప్పించి తెలివిగా పోసానికి అంటగడతారు. అయితే మన పోసానికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయి. కానీ వెంటనే వారిద్దరీనీ కలుపుదామంటే అతని తెలివైన బుర్రకో అనుమానం వస్తుంది. తను పెళ్ళి చేసినా ఇప్పుడు తనతో పెళ్ళి అయింది కాబట్టి తను సంసారం చేసాడని ఆ ప్రేమికుడు డౌట్ పడవచ్చు. కాబట్టి ఓ ఆడకూతరు బాగు కోసం తను మగవాడు కాదు...నపుంసకుడు అనిపించుకున్నా ఫరవాలేదని డిసైడ్ అవుతాడు. అందుకే అలా అందరి దృష్ఠిలో నపుంసకుడని ఎస్టాభ్లిష్ చేసుకుంటాడన్నమాట. కామన్ గానే అన్ని క్యారెక్టర్స్ కలిసి ఎంత త్యాగ హృదయం అని చివరలో అంతా పొగడేస్తారు.

    ఎనాలిసిస్
    చెయ్యటానికి ఏమీ లేదు. కథ అయితే దాసరి స్వయంవరం సినిమా నుంచి ప్రేరణ పొందిందని అర్ధమవుతుంది.అలాగే భరత్ తపస్సు సినిమా ట్విస్ట్ నుండు ఎత్తుకున్నాడు. మరో ప్రక్క నానాపటేకర్ అగ్నిసాక్షిలో సన్నివేసాలు కొన్ని లిఫ్ట్ చేసారు( అందుకేనేమో నిర్మాత పోసాన్ని నానాపటేకర్ తో పోలుస్తున్నారు). ఇక సినిమా నిండా బూతులు,చెప్పటానికి వీల్లేని వల్గారిటీ,అసహ్యం పుట్టించే సన్నివేశాలు కోకొల్లలు. మిగతా టెక్నికల్ విషయాల గురించి చెప్పుకోవాలంటే ఓ పాత జోక్ గుర్తు కొస్తోంది. మీ సినిమా ఎలా ఉంది అంటే ఆ నిర్మాత మాది టెన్ వీక్స్ సినిమా అండీ అంటాడు. దానికి అతను కరెక్టే..పది విభాగాలూ వీకే అని సైలైంట్ గా వెళ్ళిపోతాడు. అదే జోక్ దీనికీ వర్తిస్తుంది కానీ ఒక కరెక్షన్..ట్వంటీ ఫోర్ (క్రాప్ట్స్ )వీకే.

    ఇక ఈ సినిమా చూసిన వారికి ఒకే ఒక అనుమానం వస్తుంది. నిజంగా సత్యని ప్రేమించిన వాడిది నిజమైన ప్రేమ అయితే ఆమెకు పెళ్ళయినా మనసే ముఖ్యమనుకుంటాడుకదా(తరతరాలుగా వస్తున్న సినిమా రూల్ ఇదేకదా) అలాగే అంత చదువుకున్న సత్య ఎందుకలా (ఆధునిక మహిళ కదా) టార్చర్ పెడుతున్నా తిరగబడకుండా ఓర్చుకుంటుంది.. ఇలా డౌట్ లు వస్తాయి.

    అయినా రామోజీరావు గారబ్బాయి సుమన్ మీద డైలాగులు వేయటానికి సినిమా తీయటం అవసరమా అని కూడా అనిపిస్తుంది.(ఎందుకంటే ఎమ్మెస్ నారాయణ పాత్రకి సుమన్ అనే పేరు పెట్టి డైలాగులు వేస్తూంటాడు)ఇక నాగబాబు పాత్ర చివరలో ఎందుకొస్తుంది(అభిమానంతోనా లేక పోస్టర్ వాల్యూ కోసమా)నన్ను ఇన్వాల్స్ చేయకండంటూ ఢీ కామెడీని బ్రహ్మానందం చేత ఎందుకు రిపీట్ చేయించటం..నవ్వు ఎక్కడయినా వస్తుందా ఇక ఈ సినిమాలో ఒకే ఒక ప్లస్ పాయింట్ ఒకే పాట ఉండటం. మరో రకంగా ఇది మైనస్ కూడా (పాటలు ఎక్కువుంటే బయిటకు వెళ్ళిపోవచ్చుకదా.)కాబట్టి అవకాశమున్నంతవరకూ ఈ సినిమాని ఎవాయిడ్ చేయిటం ఉత్తమం.అంతగా వెళ్ళాల్సి వస్తే...మీ జాగ్రత్తలు మీరు తీసుకుని వెళ్ళండి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X