twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే కానీ... ('ఉలవచారు బిర్యాని' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    రీమేక్ సినిమా అంటేనే కొంత రిస్క్...మరికొంత సేఫ్. సినిమా బాగుండి హిట్టైతే...ఏముంది రీమేకే కదా అని చప్పరించేస్తారు(కాని హిట్టైతే డబ్బులొస్తాయి కాబట్టి నిర్మాత సేఫ్ అవుతాడు)...అదే తేడా వస్తే... మంచి సినిమాని పాడు చేసేసాడు అని అందరూ తిట్టిపోస్తారు. ఇవన్ని ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ కి తెలియకా కాదు...సృజనాత్మక లేమి అంతకన్నా కాదు... అయినా నచ్చిన సినిమా రైట్స్ కొనేసి, తన దైన శైలి నటనతో, దర్శకత్వ ప్రతిభతో దాన్ని తెలుగు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసాడు..అక్కడవరకూ అభినందించాల్సిందే. అయితే ఎంతో మక్కువతో చేసిన ఈ ప్రయత్నం..ప్రయోగం రెండూ ఫలించినట్లు కనపడటం లేదు. ఒరిజనల్ లో ఉన్న సోల్ ...నేటివికి మార్చే క్రమంలో మిస్సై నీరసంగా మారింది. ఫస్టాఫ్ లో ఉన్న ఫన్, స్పీడు సెకండాఫ్ లో కొరవడి...ఇబ్బంది పెట్టింది. మల్టిప్లెక్స్ లు,ఎ సెంటర్లకు టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడి వారినైనా అలరిస్తుందా అంటే కష్టమే అనిపిస్తోంది.

    పురావస్తు శాఖలో పనిచేసే కాళిదాసు(ప్రకాష్ రాజ్) భోజన ప్రియుడు...క్రానిక్ బ్యాచులర్. మరో ప్రక్క గౌరీ(స్నేహ) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతకంలో ఉన్న దోషంతో పెళ్లి కాక మిగిలిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోనివిధంగా..విధి వశాత్తు ఫోన్ లో గొడవ పడతారు. అయితే తర్వాత తాము పొరపాటు పడ్డామని,రాంగ్ నెంబర్ అని తెలుసుకుని సారీ చెప్పుకుంటారు. అలా మొదలైన వీరి ఫోన్ స్నేహం... పెరిగి ఓ ఫైన్ డే కలవాలనే నిర్ణయానికి వస్తారు. అయితే తమ వయస్సులు గురించి ఆలోచించిన కాళిదాసు,గౌరీ ఒకరినొకరు కలవటానికి సంశయిస్తారు. ఆ సంసయంలో తమ అసలు ఐడెంటిటీ బయిటపెట్టకుండా... కాళి దాసు తన మేనల్లుడు నవీన్ (తేజస్)ని, గౌరీ తన సోదరి(సంయుక్త)ని పంపుతారు . అప్పుడేం జరిగింది. వీరిద్దరూ ఎలా కలిసి,ఒకటయ్యారు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఈ యువ జంట పాత్రేమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    రొమాంటిక్ కామెడీ గా రూపొందిన ఈ చిత్రం కథలో ని ప్రధానమైన మలుపు లవ్ ట్రాక్ గతంలో మనం ఆది చిత్రం లవ్ లీ చిత్రంలో చూసిందే కావటంతో ప్రెష్ గా అనిపించదు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ తన నటనతో ఆ సినిమా గుర్తుకు రాకుండా చేయగలిగారు కానీ...అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. నేటివిటీ కోసం ఒరిజనల్ లో చేసిన మార్పులు స్క్రీన్ ప్లే లో ఇమడక దెబ్బ తీసాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు, అందులో ఎలిమెంట్స్ కు అలవాటు పడిన వారికి అసలే ఈ సినిమా కష్టమనిపిస్తుంటే,అంతే కాకుండా బాగా స్లో నేరేషన్ లో కథ చెప్పటం ద్వారా దర్శకుడు ఫీల్ తీసుకు వద్దామనుకున్నారు. కానీ... మరీ అంత స్లోగా చిత్రంచూస్తున్నవారికి భారంగా మారి ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకు వచ్చింది. అయితే ప్రకాష్ రాజ్, స్నేహ తమ నటనతో సినిమాకు ప్రత్యేకంగా నిలచారని చెప్పటంలో సందేహం లేదు. ఇళయరాజా సంగీతం ఉన్నంతలో సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సైతం డీసెంట్ గా ఉన్నాయి.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    ఫీల్ క్యారీ చేయలేపోయారు

    ఫీల్ క్యారీ చేయలేపోయారు

    ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద ప్లస్ పాయింగ్ ఉండేది ఫీల్. అదే ఈ సినిమాలో ప్రధానంగా మిస్సైంది. సినిమా మొత్తం ఒకే ఫీల్ తో నడపటంతో దర్శకుడు పడ్డ తడబాటు స్పష్పంగా కనిపిస్తుంది.

    ఎంటర్టైన్మెంట్ తక్కువ

    ఎంటర్టైన్మెంట్ తక్కువ

    ఈ రొమాంటిక్ కామెడీలో కొంత కామెడీ ఉన్నా రెగ్యులర్ తెలుగు ప్రేక్షకుడు ఆశించే రేంజిలో కామెడీ పేలలేదనేది సుస్పష్టం. దర్శకుడు క్లాస్ గా తీయాలన్న తపనలో ఇక్కడ జనాలకు కావాల్సిన ఇంట్రిగ్రెంట్స్ మిస్సయ్యాడు.

    ట్రైబల్ ట్రాక్ ఎందుకు

    ట్రైబల్ ట్రాక్ ఎందుకు

    జగ్గయ్య అంటూ ఓ ట్రైబల్ ట్రాక్ మొదటి నుంచీ చివరి వరకూ రన్ అవుతుంది. అది ఎందుకు పెట్టారో..దాని పర్పస్ ఏమిటో దర్శకుడుకి తప్ప మనికి తెలియనంత జాగ్రత్త పడ్డారు.

    సోసోగా...

    సోసోగా...


    కథకు కీలకమైన స్నేహ, ప్రకాష్ రాజ్ ల లవ్ ట్రాక్ కూడా జస్ట్ ఓకే అన్నట్లు సాగింది. ఎందుకనో దర్శకుడు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.

    యంగ్ రొమాన్స్

    యంగ్ రొమాన్స్


    సినిమాలో సబ్ ప్లాట్ గా వచ్చే యంగ్ రొమాన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. కథని అది కదపటంతో దారుణంగా విఫలమైంది. ప్రధాన కథతో అది మింగిలి కాలేకపోయింది.

    క్లైమాక్స్...

    క్లైమాక్స్...

    ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ ఓ రేంజిలో భావోద్వేగ భరితంగా ఉండాలి. కానీ అదేంటో అదీ తేలిపోయి..సినిమాను క్రిందకి లాగేసింది.

    ప్లస్ లు...

    ప్లస్ లు...


    ఈ సినిమాకు పెద్ద ప్లస్ ప్రకాష్ రాజ్ నటన. అయితే ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. అతను నటుడుగా పాసయ్యాడు...దర్శకుడు గా విఫలమయ్యాడని చెప్పాలి.

    సినిమాటోగ్రఫి

    సినిమాటోగ్రఫి


    సినిమా ఆ మాత్రమైనా చివరి వరకూ చూడగలిగామంటే అది కెమెరామెన్ గొప్పతనమే. చిత్రాన్ని విజువల్ ట్రీట్ గా మలచటంతో తనవంతు సాయిం చేసాడు.

    ఎడిటింగ్

    ఎడిటింగ్


    అప్పటికీ లెంగ్త్ ని చాలా చిన్నగా చేసి వదిలారు. కానీ సినిమా చాలా చోట్ల బోర్ కొట్టడం వల్ల లెంగ్త్ మరింత తగ్గితే బాగుండేది...ఎడిటర్ తన సాఫ్ట్ వేర్స్ (కత్తికి) మరింత పదును పెట్టి ఉండాల్సింది అనిపిస్తుంది.

    తెర వెనక, ముందు

    తెర వెనక, ముందు


    బ్యానర్: ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్
    నటీనటులు : ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త , ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు
    సంగీతం: మేస్ట్రో ఇళయరాజా,
    కెమెరా: ప్రీతా జయరామన్,
    ఆర్ట్: కదిర్,
    ఎడిటింగ్: హర్ష,
    దర్శకత్వం: ప్రకాష్‌రాజ్.
    నిర్మాత : కె.ఎస్.రామారావు
    విడుదల తేదీ : 6-6-2014


    ఫైనల్ గా దర్శకుడుగా ప్రకాష్ రాజ్ మరో దండయాత్ర విఫలమైంది. నటుడుగా ఈ సినిమాలో మరో మెట్టు ఎక్కారనిపించారనిపించుకోవటానికే ఈ చిత్రం చేసినట్లుంది. ప్రకాష్ రాజ్ నటనా అభిమానులు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. కానివారు సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రం డీవీడి తెచ్చుకుని ఎంజాయ్ చేయటం బెస్ట్.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Prakash Raj’s ‘Ulavacharu Biryani’ released today with divide talk. Sneha is played the female lead in the movie produced by Prakash Raj. The film is a remake of the hit Malayalam film Salt N Pepper. The film is going to be releasing in Tamil and Kannada as well. Music maestro Ilayaraja has composed the music for the film being released under the Prakash raj productions banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X