For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమకు రెయిన్‌చెక్ రివ్యూ అండ్ రేటింగ్

  By Rajababu
  |

  Rating:
  2.5/5

  కటెంట్ ఉన్న చిత్రాలకు, విలక్షణమైన సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్నది. కథాబలం ఉంటే చిన్న చిత్రానికైనా భారీ సక్సెస్‌ను అందిస్తున్నారనే విషయం ఇటివల బ్లాక్‌బస్టర్లుగా మారిన చిత్రాలు నిరూపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కొత్త డైరెక్టర్ ఆకెళ్ల పేరి శ్రీనివాస్, కొత్త నటీనటులు అభిలాష్ వడడా, ప్రియా వడ్లమాని, మౌనిక తావనంతో చేసిన ప్రయోగం ప్రేమకు రెయిన్‌చెక్. టైటిల్ వినగానే కొత్తగా అనిపించే ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే హాలీవుడ్ నిర్మాణ సంస్థను ఆకర్షించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ప్రేమకు రెయిన్‌చెక్ కథ

  ప్రేమకు రెయిన్‌చెక్ కథ

  రమ్య (ప్రియా వడ్లమాని) ఓ అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీకి వైస్ ప్రసిడెంట్‌గా వికీ (అభిలాష్) వస్తాడు. రమ్య పనితీరు, సమయస్ఫూర్తి వికీని ఆకట్టుకొంటుంది. వారి మధ్య తెలియని ఆకర్షణ చోటుచేసుకుంటుంది. తమ మధ్య ఉన్నది ప్రేమానా లేదా ఆకర్షణ అనే ఊగిసలాట కొనసాగుతుంటుంది. కానీ ఆఫీస్ ఎన్విరాన్‌మెంట్‌లో రొమాన్స్ ఉండకూడదనే ఓ అభిప్రాయంతో రమ్యకు వికీ దూరంగా ఉంటాడు. ఈ క్రమంలో రమ్య, వికీ మధ్య తాన్య (మోనికా) ప్రవేశిస్తుంది. తాన్యతో, వికీ సన్నిహితంగా మెదలుతుంటాడు?

  ప్రేమకు రెయిన్‌చెక్‌లో ట్విస్టులు

  ప్రేమకు రెయిన్‌చెక్‌లో ట్విస్టులు

  తాన్య రావడంతో వికీ, రమ్య మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? వీకితో పీకల్లోతు ప్రేమలో మునిగిన రమ్యకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తాన్యకు రమ్యకు మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు నెలకొన్నాయి. చివరకు తాన్య, వికీల రిలేషన్ ఎక్కడి వరకు వెళ్లింది. రమ్య, వికీల ప్రేమకు శుభకార్డు పడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమకు రెయిన్‌చెక్ సినిమా.

   ఫస్టావ్ విశ్లేషణ

  ఫస్టావ్ విశ్లేషణ

  తొలిభాగంలో పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో కథలోకి ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే అందమైన లోకేషన్లు, మంచి సినిమాటోగ్రఫి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ సగం సినిమా పూర్తయినా గానీ దర్శకుడు కథను దాచుకోవడం ఇబ్బందికి గురిచేస్తుంది. ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  సెకండాఫ్‌ విశ్లేషణ

  సెకండాఫ్‌ విశ్లేషణ

  సరే రెండో భాగంలోనైనా కథను చకచకా నడిపిస్తాడా అంటే అదీ జరుగలేదు. ఓ దశలో దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అనేది అర్ధం కాదు. ఇక ప్రీక్లైమాక్స్ ముందు తన కథను మెల్ల మెల్లగా విప్పడంతో అప్పటికి హమ్మయ్య అనే పరిస్థితి కనిపిస్తుంది. చివర్లలోనైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పాడా అంటే అదీ జరుగలేదు.

  దర్శకుడు శ్రీనివాస్ విజన్

  దర్శకుడు శ్రీనివాస్ విజన్

  రెయిన్‌చెక్ అంటే ఎవరైనా మరొకరి సహాయం పొందితే ఆ వ్యక్తికి చెక్కు రూపంలో చేసే హామీ. ఆ హామీని ఎలాంటి సందర్భంలోనైనా తీర్చుకోవచ్చు అనే పాయింట్‌తో దర్శకుడు శ్రీనివాస్ ఆఫీస్ రొమాన్స్ తెరకెక్కించాడు. కథలో సెన్సివిటి ఉన్నా గానీ, కథనంలో వేగం లేకపోవడం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి సమస్య ఏర్పడింది. తొలిభాగంలో బలమైన సన్నివేశాలు, సాగతీత లేకుండా ఉండి ఉంటే శ్రీనివాస్ విజన్‌కు ఫలితం దక్కేది. తొలి చిత్ర దర్శకుడైనా ఆయన పనీతీరు తెరపైన అనుభవం ఉన్న డైరెక్టర్‌గా కనిపించింది.

  సినిమాటోగ్రాఫి సూపర్

  సినిమాటోగ్రాఫి సూపర్

  ఈ సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి. అవుట్ డోర్ గానీ, ఇండోర్ లోనైనా గానీ శరత్ గురువుగారి పనీతీరు అద్భుతంగా అనిపిస్తుంది. బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే మరో దృశ్యకావ్యాన్ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగేది. డెహ్రాడూన్, తదితర ప్రాంతాలను అద్భుతంగా తెరకెక్కించాడు. విదేశాల్లో కనిపించని అందాలు దేశంలో ఉన్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  ప్రేమకు రెయిన్ చెక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. ఫీల్‌గుడ్ రీరికార్డింగ్‌తో పేలవమైన సన్నివేశాలకు కూడా సంగీత దర్శకుడు దీపక్ కిరణ్ బలం చేకూర్చాడు. పాటలు వెస్ట్రన్ స్టైయిల్ వినిపించినా అంతగా ఆకట్టుకునేలా లేవు.

  ఎడిటింగ్ విభాగం

  ఎడిటింగ్ విభాగం

  ప్రేమకు రెయిన్‌చెక్ సినిమాకు ప్రధానమైన లోపం ఎడిటింగ్. ఈ సినిమాలో సాగదీతకు కారణం దర్శకుడా? లేదా ఎడిటర్‌దా అనే విషయం తెలియదు గానీ, కొన్ని సీన్లు విసిగించేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దర్శకుడు తాను రాసుకొన్న సీన్లపై ఎక్కువగా అటాచ్డ్‌గా ఉంటారు. అలాంటి పరిస్థితి ఏమైనా సినిమా లెంగ్త్ పెరుగడానికి కారణం కావొచ్చనే అభిప్రాయం కలుగుతుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. ప్రదేశాల ఎంపిక, చిత్రీకరణ విధానం టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉంటాయి. ఓ దశలో ట్రావెల్ గైడ్ చూస్తున్నామా? ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మరో ఫీల్‌గుడ్ చిత్రం టాలీవుడ్‌కు పరిచయం అయ్యేది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  కథ, కథనాల్లో కొత్తదనం, బలం లేకపోవడమే ప్రేమకు రెయిన్‌చెక్ ప్రధానమైన లోపం. కాకపోతే ఆర్టిస్టుల ఫెర్మార్మెన్స్, విజ్వువల్స్ సినిమాకు బలంగా మారాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల కనీస స్పందన వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరుగా లాభాల్ని సాధించే అవకాశం ఉంటుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  నటీనటుల ప్రతిభ
  సినిమాటోగ్రఫి
  రీరికార్డింగ్
  సెకండాఫ్

  మైనస్ పాయింట్స్
  స్లో నేరేషన్
  ఎడిటింగ్

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: అభిలాష్ వడడా, ప్రియా వడ్లమాని, మౌనిక వనం, ఆకెళ్ల పేరి శ్రీనివాస్, శరత్ మరార్
  డైరెక్టర్: ఆకేళ్ల పేరి శ్రీనివాస్
  నిర్మాత: శరత్ మరార్
  మ్యూజిక్: దీపక్ కిరణ్
  సినిమాటోగ్రాఫర్: శరత్ గురువుగారి
  రిలీజ్ డేట్: 2018-09-07

  English summary
  Premaku Raincheck is a Telugu movie released on 7 Sep, 2018. The movie is directed by Akella Peri Srinivas and featured Abhilash Vadada, Priya Vadlamani and Monica Tavanam as lead characters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X