»   » వద్దురా సామీ (‘రొమాన్స్’ రివ్యూ)

వద్దురా సామీ (‘రొమాన్స్’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.0/5

----సూర్య ప్రకాష్ జోశ్యల

మంచో ...చెడో మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ అనే ఇమేజ్ వచ్చేసింది. దానికి తోడు డార్లింగ్ చిత్రం రైటర్ స్వామి ...దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ సైతం స్పైసీగా ఉండి...జనాలని థియోటర్స్ కి లాక్కొచ్చింది. అన్ని ఉన్నా...ఏదో లేదన్నట్లు సినిమాలో కథ,కథనం సరిగ్గా లేకపోవటంతో బోర్ షో గా మిగిలిపోయింది. జోక్ లు పేలకపోవటం.. టైటిల్ తగ్గట్లుగా సీన్స్ లేకపోవటంతో సగటు ప్రేక్షకుడుకి నిరాసే మిగిలింది. అటు కామెడీ యాంగిల్ లోనూ, ఇటు మారుతి బ్రాండ్ అయిన బూతు గా గానీ, టైటిల్ జస్టిఫికేషన్ పరంగా రొమాన్స్ గానీ పండించలేకపోయింది.

'రొమాన్స్ చేయడానికి అమ్మాయి, ప్రాణం తీయడానికి గన్ ఉంటే ప్రపంచాన్ని గెలవొచ్చు' అనే డైలాగుతో ప్రారంభమైన ఈ చిత్రంలో ....కృష్ణ(ప్రిన్స్) కు తను ప్రేమించి,జీవితం పంచుకునే అమ్మాయి ఫెరఫెక్ట్ గా ...(అంటే ఇంతకు ముందు ఏ అనుభవం లేని ...)కావాలనేది కోరిక. అందుకోసం ఓ అమ్మాయిని ప్రేమించి తర్వాత ఫెరఫెక్ట్ అవునా కాదా అన్నది టెస్ట్ పెట్టి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అతనికి.... అనూరాధ(డింపుల్) పరిచయమవుతుంది. ఆమెను మెల్లిగా ప్రేమలో దింపి... పడకమీదకు తీసుకెళ్లి టెస్ట్ పెడతాడు. ఆమె టెమ్ట్ అయ్యి అతనికి లొంగితే...ఆమెతో ప్రేమ వద్దనుకుందామని అతని ఆలోచన. అయితే ఆ ప్లాన్ రివర్స్ అవుతుంది. ఆమె..అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన ప్రేమను కృష్ణ ఎలా గెలుచుకున్నాడు...ఆ ప్రాసెస్ లో అనూరాధ ఏం టెస్ట్ లు కృష్ణకు పెట్టింది..మిగతాది తెరపైనే చూడాల్సిందే.

రొమాన్స్ అనే టైటిల్, మారుతి సమర్పణ అనేవి ఖచ్చితంగా ..ఓ వర్గం ప్రేక్షకుడ్ని టెమ్ట్ చేసే ఎలిమెంట్సే..అయితే అవి పేయింగ్ ఎలిమెంట్స్ గా మారుతున్నాయా లేదా అనేది అతి ముఖ్యమైన అంశం. దానికి తోడు వెబ్,పబ్ కల్చర్ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో...కేవలం అలాంటి సీన్స్ మీదే ఆధారపడి సినిమా చూస్తే ... చూడబుద్ది కాదు...నీలి చిత్రాలకు కూడా కథ అడుగుతున్నారంటూ జోక్స్ వస్తున్న టైమ్ ఇది. అలాంటప్పుడు ...ఈ సినిమాకు కథ,కథనం సరిగ్గా రచయిత,దర్శకుడు అయిన స్వామి చూసుకోవాల్సింది.

ముఖ్యంగా... హీరో.....వర్జిన్ టెస్ట్ హీరోయిన్ కి పెట్టడం అనేది తప్పు అనే కాన్సెప్టు ఎత్తుకున్నప్పుడు ..ఆ తప్పుని తప్పుగానే చూపిస్తూ కథనం నడపాలి కానీ...ఛీ కొట్టిన హీరోయిన్ తిరిగి అదే తరహా టెస్ట్ హీరోయిన్ కి పెట్టడం ఆమె పాత్రను దెబ్బ తీసినట్లైంది. దాంతో సెకండాఫ్ లో వచ్చే సీన్స్ బోర్ గా మారిపోయాయి.. దానికి తోడు ఇలాంటి కధా,కధనమే కొద్ది రోజుల క్రితం..వచ్చిన...వరుణ్ సందేశ్ ..సరదాగా అమ్మాయితో లోనూ ఉంది. దాంతో రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చింది.

మిగాతా రివ్యూ...స్లైడ్ షోలో...

లవ్ ,ఫీల్ మిస్ ..

లవ్ ,ఫీల్ మిస్ ..

సినిమాలో....హీరో,హీరోయిన్స్ మధ్య ఎస్టాబ్లిష్ కావాల్సిన లవ్, ఫీల్ మిస్సైపోయాయి. దాంతో ...సెకండాఫ్ లో వచ్చే సీన్స్ పండాల్సిన రీతిలో పండలేదు. పస్టాఫ్ లో హీరో,హీరోయిన్స్ మధ్య ఆ ఫీల్ మరింత బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. ఆ ఏంగిల్ లో వర్క్ చేసి ఉంటే అడల్ట్ కంటెట్ ...తగ్గి లవ్ స్టోరిగా మిగిలేది.

హీరో ఫెరఫార్మెన్స్

హీరో ఫెరఫార్మెన్స్


బస్టాఫ్ తర్వాత అదే బ్యానర్ లో చేసిన ప్రిన్స్ మంచి ఫెరఫార్మన్స్ చేసాడనే చెప్పాలి. అయితే అతను మహేష్ బాబు కి డూప్ గా ఉండటం,కొన్నిచోట్ల మహేష్ ని అనుకరించటం జరిగినట్లు అనిపించింది. సెంటిమెంట్, రొమాన్స్ సీన్స్ లో ప్రిన్స్ మంచి ఈజ్ ని కనపరిచాడు.

హీరోయిన్స్...

హీరోయిన్స్...

హీరోయిన్స్ గా చేసిన మానస,డింపుల్ ఓకే అనిపించుకున్నారు. ప్రిన్స్ తో వాళ్ల కెమిస్ట్రి బాగా పండింది. అయితే కొత్త వాళ్లు కావటం వల్లనేమో కానీ చాలా చోట్ల ఎక్సప్రెషన్ లెస్ ఫేస్ లు కనిపించాయి. ఎమోషన్ పండించాల్సిన చోట కూడా హీరోయిన్ అదే లుక్ తో హీరోని చూస్తూండటం ఇబ్బందిగానే ఉంటుంది.

సాయి కామెడీనే...

సాయి కామెడీనే...

మారుతి సినిమాలో రెగ్యులర్ గా కనిపించే సాయి ...ఈ సినిమాలోనూ కాస్త బూతు ఎక్కువైనా బాగానే నవ్వించాడు. అతనే కొద్దో గొప్పో ఈ సినిమాకు ప్లస్. అయితే బస్ స్టాఫ్, ఈ రోజుల్లో మాదిరిగా సాయి పాత్రని కథలో కలవలేదు. కానీ చివరి వరకూ మంచి ఈజ్ తో సీన్స్ పండించాడు. అతను రాగానే థియోటర్స్ లో విజిల్స్ పడ్డాయండే అతని క్రేజ్ ఊహించుకోవచ్చు.

సంగీతం

సంగీతం

సాయి కార్తీక్ సంగీతం...సినిమాకు ప్లస్ కాకపోయినా మైనస్ మాత్రం కాలేదు. ఇందులోని ఓ పాట ఇప్పటికే మంచి హిట్ అవటంతో సినిమా ప్రమేషన్ కి అది బాగా ఉపయోగపడింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు బాగా ఇచ్చాడు. సరిగ్గా మార్కెటింగ్ చేసుకుంటే ఈ సినిమా అండతో అతను పెద్ద సినిమాలకు ఎదిగే అవకాసం ఉంది..

ఛాయాగ్రహణం

ఛాయాగ్రహణం

మారుతి సినిమాలకు రెగ్యులర్ గా ఛాయాగ్రహణం అందిస్తూ..ఈ మద్యనే ప్రేమ కథా చిత్రంతో దర్శకుడుగా మారిన ప్రభాకర్ రెడ్డి గారు కెమెరా వర్క్ కు ఎక్కడా వంకపెట్టడానికి లేదు. చాలా సీన్స్ బ్రిలియెంట్ గా ప్లాన్ చేసారు. గ్రాండియర్ లుక్ ని ఈ లో బడ్జెట్ సినిమాకు తీసుకు వచ్చారు.

మిగతా విభాగాలు

మిగతా విభాగాలు

కాస్ట్యూమ్స్, మేకప్,ఆర్ట్ డిపార్టమెంట్ వంటివన్నీ ఈ సినిమాకు బాగానే కుదిరాయి. కథ,కథనం తప్ప మిగతావన్నీ సినిమాని బాగానే మోసాయి. ముఖ్యంగా సినిమాకు యూత్ లుక్ తీసుకురావటంలో అన్ని డిపార్టమెంట్ లు ..మంచి వర్క్ చేసాయి. ఎడిటింగ్ కూడా ఓకే.

దర్శకుడుగా స్వామి

దర్శకుడుగా స్వామి

రచయితనుంచి ప్రమేషన్ పొందిన స్వామి ఈ సినిమాకు దర్శకుడుగా మంచి మార్కులు వేయించుకున్నారు. సీన్స్ ని గ్రిప్పింగ్ గా ఎక్కడా తడపడకుండా తీసారు. అయితే తన జాబ్ అయిన కథ,స్క్రీన్ ప్లే, డైలాగులనే సర్గిగా చేయలేకపోయారు. డైలాగులలో ఆశించిన పంచ్ రాలేదు.

సినిమా టీమ్

సినిమా టీమ్

బ్యానర్: గుడ్ సినిమా గ్రూప్ మారుతీ మీడియా హౌస్
నటీనటులు: ప్రిన్స్, డింపుల్, మానస , ప్రభాక్, నల్లవేణు, సాయి, భారవి, వెంకీ, విష్ణుప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు
పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్,
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్,
కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి,
సంగీతం: సాయి కార్తీక్,
కథ-మాటలు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.
నిర్మాతలు: జి.శ్రీనివాసరావు, ఎస్.కె. ఎన్.
సమర్పణ: మారుతి


ఫైనల్ గా ఈ చిత్రం మారుతి అభిమానులను కూడ అలరించటం కష్టమే అనిపిస్తుంది. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నా.. కథ,కథనం సరిగ్గా లేకపోతే ఉపయోగం లేదని మరో సారి తెలియచేస్తుంది. లో బడ్జెట్ చిత్రాలు కథ,కథనంపై మరింత కసరత్తు చేస్తేనే చూడగలుగుతాం అనే విషయం నిరూపిస్తుంది.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Romance starring Prince, Dimple Chopade and Manasa in the leads releasedtoday with negitive talk. 'Ee Rojullo' and 'Bus stop' fame Maruthi is presenting the film under Maruthi media house banner. Srinivasa Rao and SKN are producing the film under Good Cinema group.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu