»   » వద్దండీ... ('చండీ' రివ్యూ)

వద్దండీ... ('చండీ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
0.0/5
బ్యానర్ : ఒమిక్స్ క్రియేషన్స్
నటీనటులు: ప్రియమణి,కృష్ణం రాజు, శరత్ కుమార్, నాగబాబు, వినోద్‌కుమార్, ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, జీవి, ఆలీ, గిరిబాబు, ఎం.ఎస్., రంగనాథ్, కాదంబరి కిరణ్ తదితరులు
సంగీతం: ఎస్.ఆర్.శంకర్, చిన్నా,
ఫొటోగ్రఫీ: వాసు,
ఎడిటింగ్: నందమూరి హరి,
కథ, మాటలు: కరణం పి.బాబ్జీ,
సమర్పణ: జగన్నాథనాయుడు,
నిర్మాత: జి.శ్రీనుబాబు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సముద్ర
విడుదల తేదీ:08,నవంబర్,2013

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలంటే వాళ్ళుకు అనుష్క లా స్టార్ ఇమేజ్ ఉండాలి..లేకపోతే బిజినెస్ పరంగానూ,ఓపినింగ్స్ పరంగానూ ఇబ్బంది. అయితే మన హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవుతున్న దశలో ఇటు టర్న్ తీసుకుని తమ కెరీర్ కి క్లైమాక్స్ ఇచ్చుకుంటూంటారు. ఛార్మి తర్వాత ఈ రూట్ లోకి ప్రియమణి వచ్చి చేరికి. తనకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ దూరమయ్యాక హీరోల ప్రక్కన ఛాన్స్ లు దొరక్క ఇలా టర్న్ తీసుకుంది.

Chandi

రకరకాల యుద్ద విద్యల్లో ఆరితేరిన చండి(ప్రియమణి) ...తన మెంటర్ చంద్ర శేఖర్ అజాద్(శరత్ కుమార్) సాయింతో హైదరాబాద్ లో పొలిటీషన్స్ ని, సంఘ విద్రోహ శక్తులను హత్యలు చేస్తూంటుంది. దాంతో అంతటా అలజడి రేగటంతో ఆమెను పట్టుకోవటానికి సిబిఐ ఆఫీసర్ శ్రీమన్నారాయణ(నాగబాబు)రంగంలోకి దిగుతాడు. ఈ లోగా..చండి మరో మంత్రి(ఆశిష్ విద్యార్ది) తమ్ముడు బంగార్రాజు (సుప్రీత్)ని చంపేస్తుంది. దాంతో మినిస్టర్ పూర్తిగా ఆమెను వెటాడే పని పెట్టుకుంటాడు. ఇంతకీ ఈ చండి ఎవరు..ఎందుకు ఆమె ఇలా మర్డర్స్ చేస్తోంది. ఆమెకీ అశోక్ గజపతి రాజు(కృష్ణంరాజు)కి సంభంధం మేమిటి అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

అల్లూరి సీతారామరాజు వంశంలో నాలుగో తరం అయిన చండీ (ప్రియమణి) హైదరాబాద్ లో చంద్ర శేకర్ ఆజాద్ (శరత్ కుమార్) సహాయంతో కొన్ని హత్యలు చేస్తుంది ఆమెను పట్టుకోడానికి వచ్చిన సి బి ఐ ఆఫీసర్ శ్రీమన్నారాయణ (నాగబాబు). ఒక వైపు నాగ బాబు ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఉంటె చండీ మాత్రం సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తులను హత్యలు చేస్తూ ఉంటుంది ఇదే క్రమంలో చండీ మినిస్టర్( ఆశిష్ విద్యార్ధి ) తమ్ముడు బంగార్రాజు (సుప్రీత్) ని చంపేస్తుంది. అప్పటినుండి మినిస్టర్ చండీని చంపే ప్రయత్నాలలో ఉంటాడు. అసలు చండి ఎవరు ? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది ? రెబెల్ కి చండి కి ఉన్న సంభంధం ఏంటి? రెబెల్ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్ర కథ..

'ఖైదీ'లో చిరంజీవిలా, 'సింహా'లో బాలకృష్ణలా, 'గబ్బర్‌సింగ్'లో పవన్ కల్యాణ్‌లా, 'దూకుడు'లో మహేశ్‌లా, 'ఛత్రపతి'లో ప్రభాస్‌లా కనిపిస్తుంది 'చండీ'. ప్రియమణి పాత్రలో ఇన్ని కోణాల్ని చూపించాం అని దర్శకుడు సముద్ర చెప్పారు. అయితే ఇన్ని యాంగిల్స్ ట్రై చేయటమే సినిమాకు చేటు అయ్యిందనిపిస్తుంది. ఒకదానికొకటి అతకని సీన్స్ , న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తలతో చేసిన సీన్స్ తో పులిహారలా తయారైంది. ముఖ్యంగా చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడా...పోసాని సీన్స్ తప్ప వేరేదీ కనపడలేదు. అలాగే ముఖ్యపాత్రలైన శరత్ కుమార్,వినోద్ కుమార్ పాత్రలకు డెప్త్ లేకపోవటంతో ఎమోషనల్ గా ప్రేక్షకులుకు కనెక్ట్ అవలేకపోయింది. దానికి తోడు గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ ..పేలకపోగా కథనానికి ఇబ్బందిగా మారింది.

ఇవే కాకుండా... 'నేను రెబల్. నా వారసులు రెబల్. మా ఫ్యామిలీయే రెబల్‌రా', 'ప్రజల కోసం నేను, నా ఫ్యామిలీ ఒక్కసారి కాదురా వంద సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నాం', 'చచ్చే ధైర్యం నాకుంది. చంపే ధైర్యం నీకుందిరా' అంటూ కృష్ణ రాజు చెప్పే డైలాగ్స్ ఈలలు వేయించటానికి బదులు నీరసం చెప్పిస్తాయి... ఇక జాతీయ ఉత్తమనటి ప్రియమణి ఇలాంటి పాత్ర లో తేలిపోయింది. ఆమె 'చండీ' లా నటించింది కానీ జీవం పోయిలేకపోయింది. మిగతా పాత్రలు సోసోగా ...వీక్ పాత్రలతో డల్ గా సాగారు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫి చాలా పూర్ గా ఉంది. ఎడిటింగ్ కూడా స్మూత్ గా ఎక్కడా నడవలేదు. వీటిన్నటికీ...సంగీతం మరింత దారుణంగా మార్చేసింది. రీ రికార్డింగ్ ...సినిమా మూడ్ ని మరింత డల్ గా మార్చేసింది. సముద్ర డైరక్షన్ కూడా మెయిన్ డ్రా బ్యాక్ సినిమాకు.

ఫైనల్ గా ఒకసారి చూస్తే జీవిత కాలం గుర్తుండే ఈ సినిమాని చూడటానికి మరీ మరీ ఆలోచించి అడుగేయటమే మంచిది. ప్రియమణి ఉంది కదా అని థియోటర్ కి పరుగెడితే తర్వాత తీరిగ్గా బాధపడాల్సి ఉంటుంది.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Priyamani’s ‘Chandi’ has hit the screens today with Negitive talk. Samudra has directed this movie and Omix Creations banner has produced the film. Krishnam Raju, Sarath Kumar and Vinod Kumar have essayed important roles in this movie. The movie has been given the caption ‘The Power of Woman’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu