twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంచ్‌' తంత్రం!

    By Staff
    |

    Panchatantra
    - జలపతి
    చిత్రం: పంచతంత్రం
    నటీనటులు: కమల్‌ హాసన్‌, సిమ్రాన్‌, రమ్యకృష్ణ,
    రమేష్‌ అరవింద్‌, సంఘవి, ఊర్వశి, జయరాం రమేష్‌,
    శ్రీమాన్‌, యుగీసేతు...
    కథ: కమల్‌ హాసన్‌
    మాటలు: వెన్నెలకంటి
    సంగీతం: దేవా
    నిర్మాత: మహాలక్ష్మి ఇమేజింగ్‌ అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌

    ఈ మధ్య కాలంలో కమల్‌ పూర్తి స్థాయి కామెడీ చిత్రాలే చేస్తున్నాడు. ఆ ధారవాహికంలో పంచతంత్రం మరో చిత్రం. కమల్‌, రచయిత క్రేజీమోహన్‌ కాంబినేషన్‌ లో భామనే సత్యభామనే, బ్రహ్మచారి, తెనాలి వంటి సూపర్‌ డూపర్‌ కామెడీ చిత్రాలు వచ్చాయి. క్రేజీమోహన్‌ పంచ్‌ డైలాగ్‌ లకు పెట్టింది పేరు. ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని చూసి కమల్‌ కథ రూపొందిస్తే..దానికి క్రేజీమోహన్‌ డైలాగ్‌ లు రాసి పంచతంతిరమ్‌ గా తమిళంలో తీశారు. తెలుగులోనూ డైలాగ్‌ లు పండినా..కథలో కొత్తదనం లేకపోవడంతో పెద్దగా పేలలేదు. పాత కథకు కొత్తదనం తీసుకువచ్చేందుకు...దర్శకుడు కె.ఎస్‌.రవికూమార్‌ 'ఫెయిరీ టేల్‌' కథనాన్ని ఎన్నుకున్నాడు.

    చిత్రం మొత్తాన్ని హీరోయిన్‌ సిమ్రాన్‌ - తన బిడ్డకు కథ చెప్పుతున్నట్లుగా 'కామిక్‌' స్టైల్‌ లో చిత్రీకరించడంతో కొంత వినూత్నంగా ఉంది. హాలీవుడ్‌ ఈ స్టైల్‌ లో ఎన్నో చిత్రాలు వచ్చినా ఇక్కడ మాత్రం కొత్తదే. ఈ చిత్రం మొత్తంలో హైలెట్‌ రమ్యకృష్ణ నటనే. విలన్‌ గా నటించిన రమ్యకృష్ణ పాత్రలోని ట్విస్టే ఈ చిత్రానికి మూలం. కమల్‌ ఐదుగురు ఫ్రెండ్స్‌ కూడా ఫ్రెంచ్‌ గెడ్డం పెట్టుకొని కొత్త గెటప్‌ లో కనిపించినా..ఈ చిత్రంలోని వీరి పాత్ర కేవలం పరమానంద శిష్యుల స్థాయి వరకే.

    కమల్‌ కమర్షియల్‌ పైలెట్‌. ఆడపిల్లల వీక్‌ నెస్‌. కనపడ్డ ప్రతి అమ్మాయి వెంట పడుతుంటాడు. కానీ సిమ్రాన్‌ ను మాత్రం తొలిచూపులోనే ప్రేమించి..ఓ అడుగు ముందుకేసి పెళ్ళి కూడా చేసుకుంటాడు. పెళ్ళి అయ్యాక కూడా కమల్‌ మారలేదని సిమ్రాన్‌ అనుకుంటుంది. కమల్‌ నిజానికి అలా చేయకున్నా పరిస్థితుల వల్ల సిమ్రాన్‌ అలా భావిస్తుంటుంది. సో..ఇద్దరూ విడిపోతారు. భార్యకు దగ్గరయ్యే ప్రయత్నం కమల్‌ చేస్తుండగా...ఆయన ఫ్రెంచ్‌ పాండవులు..ఓ పిక్నిక్‌ ఏర్పాటు చేస్తారు.

    ఆ పిక్నిక్‌ లో కాల్‌ గర్ల్‌ రమ్యకృష్ణను పిలుస్తారు. కమల్‌ కు రమ్యతో గడపడం ఇష్టం ఉండదు. ఆ విషయంలో వీళ్ళు తర్జన భర్జన పడుతుండగానే..రమ్యకృష్ణ హత్యకు గురవుతుంది. ఈ హత్యనుంచి వీళ్ళంతా ఎలా బయటపడుతారు? చివరికి సిమ్రాన్‌, కమల్‌ ఎలా ఒకటవుతారానేదే కథ.

    కమల్‌ తో పాటు ఫ్రెంచ్‌ పాండవులుగా నటించిన శ్రీమాన్‌, యూగీసేతీ, జైరాం రమేష్‌, రమేష్‌ అరవింద్‌ ల నటన సాధారణంగానే ఉంది. వీరి పాత్రలు చాలా తక్కువ. ఈ చిత్రంలో అందరికన్నా బాగా నటించింది రమ్యకృష్ణ, కైకాల సత్యనారయణ, నగేష్‌ లు. రమ్యకృష్ణకు అందరికన్నా ఎక్కువ మార్కులు పడుతాయి.

    మ్యాగీ ..మ్యాగీ అనే యాడ్‌ జింగిల్‌ తో పాటు..పాత హిందీ పాటను మిక్స్‌ చేసి దేవా కంపోజ్‌ చేసిన పాట ఈ చిత్రంలో హైలెట్‌. వెన్నెలకంటి డైలాగ్‌ లు ఫర్వాలేదు. కె.ఎస్‌.రవికుమార్‌ ఇంతకన్నా చక్కటి చిత్రాలు రూపొందించాడు ఇదివరకు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X