»   » సందేశం,స్పీచ్ మధ్యలో శ్వేతాబసు రిఫెరెన్స్ (‘జ్యోతి లక్ష్మి’ రివ్యూ)

సందేశం,స్పీచ్ మధ్యలో శ్వేతాబసు రిఫెరెన్స్ (‘జ్యోతి లక్ష్మి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

హీరోయిన్స్ వేశ్య పాత్రలలో తెరపై కనపడటం కొత్తేమీ కాదు కానీ ...పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరక్టర్ చిన్న బడ్జెట్ లో... అదీ హీరోయిన్ ఓరియెంటెడ్ గా, అందులోనూ నవలా ఆధారం గా సినిమా చేయటం అనేది ఈ రోజుల్లో చెప్పుకోదగ్గ విశేషమే...అభినందించాల్సిన సంగతే. అయితే పూరి మేకింగ్ లోనూ, డైలాగులలోనూ చూపిన శ్రద్దను కథ, కథనం, ట్రీట్ మెంట్ లో చూపలేకపోయారు. సినిమాలో ఎత్తుకున్న విషయం పై చర్చ కన్నా సందేశం ఎక్కువైంది. పోనీ ఆ మెసేజ్ అయినా సరిగ్గా అందించారా అంటే పూర్తిగా సినిమాటెక్ లిబర్టీస్ తో నడుస్తూంటుంది. సెకండాఫ్ లో సందేశాలతో కూడిన ఉపన్యాసాలతో విసుగెత్తించారు.

ముఖ్యంగా ఛార్మిని హీరో గా మలచాలన్న తాపత్రయంతో ఎత్తుకున్న పాయింట్ ని వదిలి కథని దారి తప్పించారు. శ్వేతాబసు ఉదంతంలో చెలరేగిన కాంట్రావర్శి అయిన... ఆ పారిశ్రామిక వేత్త ఎవరు అనే ఎలిమెంట్ తో సెకండాఫ్ నడిపేద్దామని చూసారు. ముఖ్యంగా మల్లాది వెంకట కృష్ణమూర్తి... ‘మిసెస్‌ పరాంకుశం' నవల ని అప్ డేట్ చేసి అందించే ప్రక్రియలో నవలలో చర్చించిన మెయిన్ ఎలిమెంట్ ని వదిలేసి, విలన్ సంహారం, వేశ్యా సంస్కరణ వంటివి హెలెట్ చేసారు. ప్రోమోలు,పోస్టర్స్ చూసి థియోటర్ కు వెళ్లిన వారికి నిరాశనే కలిగించినట్లైంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


జ్యోతిలక్ష్మి (ఛార్మి) ఓ సెక్స్‌వర్కర్‌. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్య(సత్యదేవ్) ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఉండే చోటకి రోజూ వెళ్తూ...ఓ రోజు ..ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ పెట్టి...ఒప్పించి బయిటకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో తిక్కగా బిహేవ్ చేసినా తర్వాత సత్య ..నిజమైన ప్రేమకు ఆమె ..అతనితో నిజాయితీగా జీవితం ప్రారంభిద్దామనుకుంటుంది. కానీ ఆమె గత జీవితం ఆమెను వెంబడిస్తుంది. ఆ వ్యభిచార గృహాల (కంపెనీ) రాకెట్ నడిపే...నారాయణ పట్వారీ (అజయ్ ఘోష్) డబ్బు సంపాదించే ఆమెను వదులుకోదలుచుకోడు. అతను చేతిలో పోలీసులు, డబ్బు, రౌడీలు ఉంటారు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అంత పరర్ ఫుల్ విలన్ ని ఆమె ఎలా ఎదుర్కుని తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంది...మిగతా వ్యభిచారుల జీవితాలు సైతం ఎలా నిలబెట్టింది అనేది మిగతా కథ.


నవలలో... ఓ సెక్స్ వర్కర్ ని పెళ్లి చేసుకున్న వాడు జీవితం ఎలా నడుస్తుంది...అదే సమయంలో సెక్స్ వర్కర్ ..మామూలు గృహిణిగా ఎలా ఎడ్జెస్ట్ అవుతుంది..చుట్టూ ఉన్న సమాజం సెక్స్ వర్కర్ వివాహాన్ని ఎలా స్వీకరిస్తుంది..మార్పు ని అంగీకరించే ప్రాసెస్ లో ఏ విధమైన ఇబ్బందులు ఆ సెక్స్ వర్కర్ కు పెడుతుంది అనే విషయాలు చుట్టూ తిరుగుతుంది. అయితే పూరి నవలను ఎడాప్ట్ చేసే పక్రియలో వాటిని ప్రక్కన పెట్టేసారు. వృభిచార కంపెనీ నడిపే పాత్రకు, హీరోయిన్ కు మధ్య కథను నడిపాడు. సాధ్యమైనంత యాక్షన్ ని చొప్పించే ప్రయత్నం చేసాడు. దాంతో అటు ఇటూ కాకుండా పులిహారలో చికెన్ బిర్యాని కలిపినట్లైంది.


ఫైనల్ గా ... ఈ సినిమాలో పూరి సందేశం ఇచ్చినా నమ్ముకున్నది మాత్రం క్రైమ్ అండ్ సెక్స్ అని స్పష్టంగా అర్దమవుతుంది. అయితే వాటిని కూడా సరిగ్గా కథలో బ్లెండ్ చేయకుండా అవి ఎక్కడ హైలెట్ అవుతాయో అనే డౌట్ తో ...వాటిని సందేశంతో కవర్ చేయాలని ప్రయత్నించాడు. ఆ నిజాయితీ లోపమే సినిమాను ప్రక్కదారి పట్టించింది. బ్రహ్మానందం నుంచి కామెడీ....వేశ్య పాత్రలో ఉన్న ఛార్మి నుంచి శృంగార రసం, హీరో పాత్ర నుంచి హీరోయిజం, పూరి నుంచి పోకిరిలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయకపోతే ఈ సినిమా నచ్చుతుంది.


మెయిన్ హైలెట్

మెయిన్ హైలెట్

ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చార్మి నటన. మొదట వేశ్యగా...తర్వాత తనను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్యగా, సమాజంపై తిరగబడే ఆదిపరాశక్తిగా, తన సమస్యను తెలివిగా పరిష్కరించుకునే స్త్రీగా, ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. అలాగే...సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పాపులర్ అయిన భధ్రం కూడా బ్రోకర్ పాత్రలో రాణించారు. ఛార్మిని సపోర్ట్ చేసే రౌడీ కొత్తతను బాగా చేసారు.ప్రధానమైన మైనస్

ప్రధానమైన మైనస్


సినిమాలో ఛార్మి పాత్రమైన సానుభూతి ఎక్కడా కలగదు. ఆ విధంగా సీన్స్ రాసుకోలేదు. దాంతో ఆమె తిరగబడుతున్నా ప్రేక్షకులు ఆమెతో సహాయానుభూతి కలగటం కష్టమై పోయింది. సెటప్ లో ఆ సీన్స్ కరెక్టుగా ఉంటే పేఆఫ్ చేసే క్లైమాక్స్ లో అద్బుతం జరిగేది.బ్రహ్మీ శుద్ద వేస్ట్...

బ్రహ్మీ శుద్ద వేస్ట్...


ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్ర సినిమాకు మరో మైనస్ అని చెప్పాలి. కామెడీ మాట దేవుడెరుగు. జుగుప్స కలిగించింది. బ్రహ్మానందం వంటి కమిడియన్ పై మోతాదు మించిన డైలాగులు పెట్టడం, సీన్లు అల్లటం చేసారు. అలాగే కథకు కీలకమైన పాత్రగా చేయాలని చూడటం రసాభాస ను కలిగించింది.సెకండాఫ్ దెబ్బ

సెకండాఫ్ దెబ్బ


సినిమాకు కీలకమైన సెకండాఫ్ లో పూరి కేవలం యాక్షన్, సందేశం ఈ రెండే నమ్ముకున్నారు. అంతేకానీ కథలో ఉన్న బేసిక్ ఎమోషన్స్ ని రిజిస్టర్ కానివ్వలేదు. వాటిపై చర్చ చేయలేదు.సాకేంతికంగా...

సాకేంతికంగా...


సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మారుతున్న మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు. ఎడిటింగ్ కూడా పూరి స్టైల్లో స్పీడుగానే నడిచిపోయింది.సంగీతం

సంగీతం


అసందర్భంగా వచ్చినా.... సునీల్ కశ్యప్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా భాస్కరభట్ల రచన టైటిల్ సాంగ్ లో కొత్త పుంతలు తొక్కింది. నేపథ్య సంగీతం ఆకట్టుకునే ఉంది.వీళ్లంతా ఎందుకు

వీళ్లంతా ఎందుకు


ధనరాజ్, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు, నెల్లూరి సప్తగిరి వీళ్లందరినీ క్లైమాక్స్ లో పెట్టారు కానీ రిజిస్టర్ అయ్యేలా కూడా చేయలేకపోయారు. కేవలం ప్రోమోల కోసమే వీరిని తీసుకున్నట్లు అనిపించింది.చాలా కాలం తర్వాత

చాలా కాలం తర్వాత


సినిమాలో ప్రియదర్శిని రామ్...కీలకమైన పోలీస్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత ఆయన తెరపై మెరిసారు. ఇప్పటికీ ఈ వయస్సులో ఆయన ఫెరఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయటం విశేషం. పాత్రలో లీనమై చేసి సినిమాకు ప్లస్ అయ్యారు.ఎవరెవరు

ఎవరెవరు


బ్యానర్: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌
నటీనటులు: ఛార్మి కౌర్‌, సత్య, వంశీ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.జి.వింద,
కథ: మల్లాది వెంకట కృష్ణ మూర్తి
సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
సమర్పణ: ఛార్మి కౌర్
విడుదల తేదీ: 12, జూన్ 2015.English summary
Puri Jagannadh's Jyothi Lakshmi movie released today with divide talk. Starring Charmme Kaur, Brahmanandam, Satya, Bhadram etc. This Movie is directed by Puri Jagannadh .produced by Swetha Lana, Varun, Teja, CV Rao under CK Entertainments and Sree Subha Swetha films Banner. Music is Composed by sunil kashyap .
Please Wait while comments are loading...