»   » ‘రాజి’ రివ్యూ: ఆకట్టుకునే స్పై థ్రిల్లర్... అలియా భట్ అదరగొట్టింది!

‘రాజి’ రివ్యూ: ఆకట్టుకునే స్పై థ్రిల్లర్... అలియా భట్ అదరగొట్టింది!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  3.0/5
  Star Cast: అలియా భట్, శిశిర్ శర్మ, రతజ్ కపూర్
  Director: మేఘనా గుల్జార్
  బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత సువిశాల భారతదేశం రెండు ముక్కలైంది. హిందుస్థాన్-పాకిస్థాన్‌గా విడిపోయాక దాయాదుల మధ్య తరచూ ఏదో ఒక అంశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఈ క్రమంలో కొన్ని సార్లు యుద్ధాలు జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి యుద్ధాల్లో ఒకటి 1971 ఇండియా-పాకిస్థాన్ వార్. ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు మొదలైన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో భారత్ మీద దాడి చేసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేసింది. అయితే ఈ కుట్రలు భగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెంట్స్. అలాంటి ఏజెంట్లలో ఒక కీలకమైన ఏజెంట్ కథే 'రాజి' చిత్రం. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  ఇంటలిజెన్స్ ఏజెంట్ డ్రామా

  కాశ్మీర్‌కు చెందిన జెంటిల్‌మెన్ హిదయత్(రజత్ కపూర్) వ్యాపారం నిమిత్తం ఇండియా, పాకిస్థాన్ పర్యటిస్తుంటారు. పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ బ్రిగేడియర్ సయీద్ (శిశిర్ శర్మ) అతడికి క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రమంలో ఇండియాపై గూఢచర్యం చేయాల్సిందిగా తన స్నేహితుడు హిదయత్‌‌ను కోరుతాడు సయీద్. వాస్తవం ఏమిటంటే..... హిదయత్ అప్పటికే ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెంట్. స్వాతంత్ర సమరయోధుడి కుమారుడు. తన తండ్రిలాగే తాను కూడా దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ ఇంటలిజెన్స్ తరుపున పని చేస్తుంటాడు.

  సెహమత్ పాత్రలో అలియా భట్

  సయీద్‌కు అనుమానం రాకుండా అతడు చెప్పినట్లే పాకిస్థాన్‌కు గుఢచర్యం చేస్తున్నట్లు నమ్మిస్తాడు హిదయత్. 1971లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ సమయంలో తన అవసరం భారత దేశానికి ఎంతో ఉంటుంది కానీ తన అనారోగ్యం కారణంగా ఏమీ చేయలేస్థితిలో ఉంటాడు. తను చేయాల్సిన పని కూతురుతో చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న సెహమత్(అలియా భట్)ను వెంటనే ఇంటికి పిలిపించి దేశం తరుపున ఏజెంటుగా పని చేయడానికి సిద్దమవ్వాలని, ఇందులో భాగంగా పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ బ్రిగేడియర్ సయీద్ కుమారుడిని పెళ్లాడాలని, పాకిస్థాన్ కోడలిగా వెళ్లాలని సూచిస్తాడు. తండ్రి చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా తరతరాలుగా దేశం కోసం పోరాడుతున్న తన కుటుంబ సభ్యుల మాదిరిగానే తన జీవితాన్ని సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమవుతుంది సెహమత్.

  పాకిస్థాన్ నుండి సెహమత్ ఇంటలిజెన్స్ ఆపరేషన్

  పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ కుమారుడు ఇక్బాల్ సయీద్ (విక్కీ కౌశల్)ను పెళ్లాడి పాకిస్థాన్‌లో అడుగుపెడుతుంది సెహమత్. రావల్పిండి వెళ్లిన వెంటనే తన ఆపరేషన్ మొదలు పెడుతుంది. పాకిస్థాన్ మిలటరీ చేస్తున్న కీలకమైన యాక్షన్ ప్లాన్స్‌ను ఇండియాకు చేరవేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఘాజీ అనే సబ్‌మెరైన్‌ను ఇండియా మీద దాడికి సిద్ధం చేస్తున్నారనే కిలకమైన విషయం కనుక్కుంటుంది. ఈ క్రమంలో సెహమత్ ఎలాంలి పరిస్థితులు ఎదుర్కొంది? దేశం కోసం విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి పనులకు పాల్పడింది అంశాలు తెరపై చూడాల్సిందే.

  అలియా భట్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

  ఇడియన్ స్పై పాత్రలో అలియా భట్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగే ఎమోషనల్ సీన్లలో అలియా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. విధి నిర్వహణలో భాగంగా, తప్పని సరి పరిస్థితుల్లో కొందరి ప్రాణాలు సైతం తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో సెహమత్ పాత్ర పడే సంఘర్షణను అలియా భట్ తన నటన ద్వారా అద్భుతంగా ప్రదర్శించింది. అలియా భర్త పాత్రలో వీక్కీ కౌశల్, పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో శిశిర్ శర్మ, హిదయత్ పాత్రలో రతజ్ కపూర్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

  టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే జే ఐ పటేల్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. శంకర్-ఎస్సాన్-లాయ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. నితిన్ బెయిడ్ ఎడిటింగ్ బావుంది. భవానీ అయ్యర్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఉత్కంఠ రేపే విధంగా ఉంది. ఇతర టెక్నికల్ విభాగాల పని తీరు సంతృప్తికరంగా ఉంది.

  దర్శకురాలు మేఘనా గుల్జార్

  మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హరిందర్ సిక్కా రాసిన ‘కాల్ సెహమత్' అనే పుస్తకం ఆధారంగా ఆమె ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా టేకింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాత్రల ఎంపికతో పాటు ప్రతీ అంశంలో చాలా శ్రద్ధ తీసుకుని రూపొందించారు. ఈ చిత్రంలో అలియా భట్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఎక్కువ మార్కులు పడేది దర్శకురాలు మేఘనా గుల్జార్‌కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

  ‘ఘాజీ' సినిమాకు ముందు స్టోరీగా చెప్పుకోవచ్చు

  ఇటీవల ‘ఘాజీ' సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీ ఇండియా మీదకు దాడికి బయల్దేరింది అనే పాయింట్ వద్ద నుండి కథ మొదలవుతుంది. ఘాజీకి సంబంధించి సమాచారం ఇండియా ఎలా చేరింది? ఈ సమాచారం బయటకు రావడం వెనక ఎలాంటి ఇంటలిజెన్స్ ఆపరేషన్ జరిగింది అనేది ‘రాజి'లో చూడొచ్చు.

  ఫైనల్‌గా...

  బోర్డర్లో ఉండి దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల గురించి, వారి జీవితాల గురించి మనకు తెలుసు. శత్రుదేశంలో ఉండి దేశం తరుపున గూఢ చర్యం చేసే వారు తమ ప్రాణాలను మాత్రమే కాదు, జీవితాలను సైతం త్యాగం చేసే సంఘటలను ‘రాజి' చిత్రంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అద్భుతంగా చూపించారు. ఆమె చేసిన ప్రయత్నానికి అలియా భట్ తన నటనతో జీవం పోసింది. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

  English summary
  Lagan ki baazi hai, chott bhi taazi hai, lagaa de daav par dil, agar dil raazi hai- When these lines play during the opening credits of Alia Bhatt's Raazi, be prepared to get goosebumps! But wait, there are many more to come in as scenes play one after the other. While Bollywood has seen a couple of espionage thrillers in recent years, what makes this Meghna Gulzar directorial different is that it's got a female central character who is vulnerable yet at the same time won't battle an eyelid when it comes to risking her life for her motherland.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more