twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్‌ 'రాఘవేంద్ర'

    By Staff
    |

    Ragavendra
    -జలపతి
    చిత్రం: రాఘవేంద్ర
    నటీనటులు: ప్రభాష్‌, అన్షు, శ్వేత, మురళీమోహన్‌, ప్రభ
    సంగీతం: మణిశర్మ
    కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు: పోసాని కృష్ణమరళి
    నిర్మాత: శ్రీనివాసరాజు
    దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    తొలి చిత్రం 'ఈశ్వర్‌'తో అడుగుపెట్టిన ప్రభాస్‌ కు మాస్‌ హీరోగా నిలబెట్టాలని రూపొందించిన చిత్రం ఇది. పలువురు మాస్‌ హీరోలకు బ్రేక్‌ ను ఇచ్చిన దర్శకుడు సురేష్‌ కృష్ణ ఇటీవల కాలంలో కథ మీద పెద్దగా దృష్టి సారించకుండా కేవలం తన 'టేకింగ్‌ పవర్‌' మీదే అధికంగా ఆధారపడుతున్నాడు. ఆ ప్రయత్నంలో వరుసగా, 'బాబా', 'ఇదీ మా అశోగ్గాడి లవ్‌ స్టోరీ' వంటి ప్లాఫ్‌ లను చవిచూశాడు. తాజా చిత్రం 'రాఘవేంద్ర'లోనూ అదే పొరపాటు చేశాడు.

    హీరో ప్రభాస్‌ మీదే నడిచే ఈ చిత్రంలో కథ మరీ పాతదీ. 'యాభై ఏళ్ళు అయినా దేశం అలానే తగలడింది..' అని తిట్టుకుంటూ తిరగబడే హీరోయిజం డైలాగ్స్‌ తో నడిచే కథలు మరీ పాతబడ్డవి. రచయిత పోసాని ఎప్పటిలాగే పాత కథను వండాడు. కానీ సినిమాలో సరైన దినుసులు లేవు. మరీ సాధారణ చిత్రం.

    హీరో ప్రభాస్‌ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఈ భక్తుడికి మరదలు శ్వేత ప్రేమభక్తురాలు. ఆమె వొంపుసొంపులు, టీజింగ్‌ లు భక్తుడి ఏకాగ్రతను చెదరనివ్వవు. ఆఖరకి ఆమెను గుండాలు దుశ్శాశునుల మాదిరిగా చీర విప్పినా చెదరడు. మరి దీనికి రీజన్‌ ఒకటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌...టియి..టియ్‌....ప్రభాష్‌ అన్యాయాన్ని సహించని యంగ్‌ హీరో. అన్యాయం చేశారని తెలిస్తే ఎవరినైనా చితకబాదుతాడు. అన్షు అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక సందర్భంలో స్థానిక మాఫియా నాయకుడు అకినీడు (ఆనంద్‌ రాజ్‌)ను హీరో ఢీకొంటాడు.

    అతను రెచ్చిపోయి అన్షును పొడిచేస్తాడు. అలాగే ఊరి వదలి వెళ్ళిపోతే మీ ప్రాణాలు సేఫ్‌ అని ప్రభాస్‌ తల్లితండ్రులను హెచ్చరిస్తాడు. (వెంకటేష్‌ 'ధర్మక్షేత్రం గుర్తుకువస్తోందా?) దీంతో ప్రభాస్‌ తల్లితండ్రులు..కొడుకును వేడుకొని మంత్రాలయం తీసుకొచ్చి రాఘవేంద్రస్వామి మాల వేయిస్తారు. ఫ్లాష్‌ బ్యాక్‌ ముగింపు. ఇక కోడలుకు జరుగుతోన్న అన్యాయాన్ని చూసి వారు మళ్ళీ కొడుకును దుష్టశిక్షణ చేయమని పురికొల్పుతారు. అదీకథ.

    ప్రభాష్‌ మాస్‌ హీరోగా బాగానే చేయగలిగినా...నటనలో ఇంకా రాటుదేలాలి. రోమాంటిక్‌ సీన్స్‌ లలో తేలిపోతున్నాడు. అన్షు, శ్వేతలు ఈ సినిమాలో చేసిందేమీ లేదు పాటలు పాడడం తప్ప. సిమ్రాన్‌, శ్వేత, అన్షులతో ప్రభాస్‌ డాన్స్‌ చేస్తూ పాటలు పాడినా..మణిశర్మ రూపొందించిన 'నమ్మిన నా మంత్రాలయం..' అనే భక్తిపాట వినసొంపుగా ఉంది. ఫోటోగ్రఫీ బాగుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X