For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ: లాఫింగ్ టైమ్.. హు.. హు.. కూల్ కూల్

  By Rajababu
  |

  Rating:
  3.0/5
  Star Cast: రవితేజ, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్
  Director: అనిల్ రావిపూడి

  Raja the Great Movie Public Talk - Filmibeat Telugu

  టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు దాదాపు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. 2015లో కిక్2, బెంగాల్ టైగర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం రాజా ది గ్రేట్. విభిన్నమైన పాత్రలతో, హై ఎనర్టీ అటిట్యూడ్‌తో తెరపైన కనిపించే రవితేజ.. ఈ సారి ఓ ప్రయోగానికి ఒడిగట్టాడు. రాజా ది గ్రేట్‌లో అంధుడి పాత్రలో కనిపించాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను మేలవించి రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. అంధుడి పాత్రలో నటించిన రవితేజ ఏ మేరకు మెప్పించడానే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  రాజా ది గ్రేట్ కథ ఇలా

  రాజా ది గ్రేట్ కథ ఇలా

  లక్కీ (మెహ్రీన్) తండ్రి ప్రకాశ్‌రాజ్ నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. విధి నిర్వహణలో విలన్ (వివాన్ భటేనా) చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. తన తమ్ముడి మరణానికి కారణమైన లక్కీని చంపాలనుకొంటాడు. ఇక రాజా (రవితేజ) పుట్టుకతోనే గుడ్డి. పోలీసు ఉద్యోగి అనంత లక్ష్మి (రాధిక) కుమారుడు రాజా. రాజాను పోలీస్‌గా చూడాలనుకొంటుంది. కానీ అంధుడు కావడం వల్ల పోలీస్ శాఖ ఒప్పుకోదు. అయితే అంధుడైనప్పటికీ అన్ని విద్యల్లో పర్‌ఫెక్ట్‌గా శిక్షణ పొందుతాడు. చాలా స్టయిలీష్‌గా ఉండటం రాజాకు చాలా ఇష్టం. ఇలా జీవితం కొనసాగిస్తుండగా లక్కీ జీవితంలోకి రాజా ప్రవేశిస్తాడు. లక్కీని చంపాలనుకొన్న విలన్ బారి నుంచి గుడ్డివాడైన రాజా సిద్ధమవుతాడు.

  కథలో చిక్కుముడులకు సమాధానం ఇలా..

  కథలో చిక్కుముడులకు సమాధానం ఇలా..

  పోలీస్ డిజైన్ చేసిన ఆపరేషన్‌లో భాగమవుతాడు. పోలీస్ ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించాడు. విలన్ ఆట ఎలా కట్టించాడు. తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి లక్కీ ఎలాంటి కష్టాలు పడింది. గుడ్డివాడిగా రవితేజ ఎలా మెప్పించాడు. కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కొన్న మెహ్రీన్ ఏ విధంగా సహాయపడ్డారు. సొంత భార్యలపై అరాచకానికి పాల్పడే మెహ్రీన్ బాబాయిలను గుణపాఠం ఎలా నేర్పాడు. ఇంకా వివిధ విభాగాల పనితీరు ఎలా ఉందనే ప్రశ్నలకు సమాధానమే రాజా ది గ్రేట్ మూవీ.

  తొలిభాగం ఇలా..

  తొలిభాగం ఇలా..

  హీరోయిన్ మెహ్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ప్రారంభమవుతుంది. సినిమా ప్రారంభంలోనే తండ్రిని కోల్పోయి అనాథగా మారడం, రవితేజ ఎంట్రీ, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సరదాగా సినిమా అలా నడిచిపోతుంది. హీరోయిన్‌ సమస్యలో రవితేజను భాగం చేయడం, ఆమెను రక్షించే ప్రాసెస్‌‌ను మంచి యాక్షన్‌ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌‌తో ఆసక్తి కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుడు హ్యాపీ అవుతాడు. కానీ తొలి భాగంలో బ్యాంక్ దోపిడి ఎపిసోడ్ చాలా నాసిరకంగా ఉండటం ప్రేక్షకులకు పరీక్ష లాంటిదే.

  సెకండాఫ్ ఇలా

  సెకండాఫ్ ఇలా

  ఇక రెండో భాగంలో విలన్ గ్యాంగ్, రవితేజ మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు సాగుతుంది. క్లైమాక్స్ కోసమే కథను సాగదీసాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రీక్లైమాక్స్‌లో ట్రైన్ ఎపిసోడ్, విలన్ గ్యాంగ్‌ను ఛేజ్ చేయడం వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఇలాంటివి తప్పితే కథ ఆసాంతం చక్కటి వినోదంతో సాగుతుంది. రాజా ది గ్రేట్ రెండున్నర గంటల వినోదమేనే ఫీలింగ్‌ను కల్పించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. సినిమాలొ విలనిజం నాసిరకంగా ఉంది. విలన్ పాత్రలో వివాన్ భటేనా తేలియాడు. మొత్తంగా విలనిజం బలంగా లేకపోవడం సినిమాకు ప్రధానమైన లోపం అని చెప్పవచ్చు.

  అనిల్ రావిపూడి డైరెక్షన్

  అనిల్ రావిపూడి డైరెక్షన్

  దర్శకుడు హీరోయన్‌ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను నడుపుతూ దానికి గుడ్డివాడైన హీరోను జత చేయడం ఈ సినిమాలో ఆసక్తికరమైన పాయింట్. అయితే కథ, కథనంలో కొంత తేడా వచ్చినా సినిమా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉండే సబ్జెక్ట్ ఇది. అయితే అలాంటి ప్రమాదాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి చక్కటి కథనంతో సినిమాను పరుగులుపెట్టించాడు. రవితేజ్ ఎనర్జీ లెవల్ తగినట్టు కామెడీ ట్రాక్‌ను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేయడంతో సినిమాకు ప్లస్‌గా మారాయి. కథలో కాంప్లికేషన్ లేకుండా సింగిల్ ట్రాక్‌పై కథను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో ప్రేక్షకుల మెప్పు పొందాడని చెప్పవచ్చు. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్‌ కోసం ఆలోచనకు అందని సీన్లు గుడ్డివాడితో చేయించడమనేది ప్రేక్షకుడికి రుచించని అంశం అని చెప్పవచ్చు.

  రవితేజ ఫెర్ఫార్మెన్స్

  రవితేజ ఫెర్ఫార్మెన్స్

  కిక్2, బెంగాల్ టైగర్ చిత్రాలు రవితేజ కెరీర్‌కు మంచి ఊపును ఇవ్వలేకపోయాయి. దాంతో సరైన కథ కోసం రెండేళ్లు వేచి చూశాడు. అంధుడి పాత్రతో రాజా ది గ్రేట్ అంటూ రవితేజ ప్రయోగానికి సిద్ధపడ్డాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ కలబోసిన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్థమైన రవితేజ మంచి ఫలితానే పొందాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ లెవెల్స్ తప్ప మరోక అంశం ప్రేక్షకుడికి కనిపించదు.

  మెహ్రీన్ నటన ఓకే

  మెహ్రీన్ నటన ఓకే

  సినిమా అంతా హీరోయిన్ కథా నేపథ్యంగా సాగడం మెహ్రీన్‌కు మరో అవకాశం అందివచ్చింది. అయితే కీలకమైన సన్నివేశాల్లో పర్వాలేదనిపించినప్పటికీ రవితేజ ముందు తేలిపోయింది. నటనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దర్శకుడి ప్రతిభ, రవితేజ టాలెంట్ ముందు హీరోయిన్ లోపాలను పెద్దగా పట్టించుకోరు. మెహ్రీన్ కాకుండా మరో హీరోయిన్ అయితే సినిమాకు అదనంగా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉండేది.

  రాధికకు కమ్ బ్యాక్ మూవీ

  రాధికకు కమ్ బ్యాక్ మూవీ

  ఒకప్పడు చిరంజీవితో కలిసి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సీనియర్ నటి రాధిక మరోసారి టాలీవుడ్‌లో కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ తల్లి పాత్రలో సహజంగా నటించింది. క్లైమాక్స్‌లో రాధిక చెప్పిన డైలాగ్స్, చూపించిన హావభావాలతో ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయం. తల్లి పాత్రల రేసులో నేను ఉన్నాను, క్యారెక్టర్ పాత్రలకు నేను రెడీ అని దర్శకులకు రాధిక సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చింది.

  ఆకట్టుకొన్న ప్రకాశ్ రాజ్

  ఆకట్టుకొన్న ప్రకాశ్ రాజ్

  రాజా ది గ్రేట్‌లో ప్రకాశ్ రాజ్‌ది మొత్తంగా పదిహేను నిమిషాల అతిథి పాత్ర. కానీ ప్రకాశ్ నటన సినిమా మొత్తం ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. మెహ్రీన్‌తో చేసిన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకొంటాయి. ఇక శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, పోసాని తదితరుల పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణ.

  విలనిజం మైనస్

  విలనిజం మైనస్

  రాజా ది గ్రేట్‌లో ప్రధాన లోపం విలనిజం. విలన్‌కు తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి మరోసారి వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. అయితే వివాన్ భటేనా పోషించిన విలన్ పాత్ర చాలా నాసిరకంగా ఉంది. ఆ పాత్రలో హీరోకు సవాల్ విసిరేంత బలం లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. రవితేజ పాత్రను హైలెట్ చేయడానికి విలన్ గొంతు నొక్కినట్టు అనిపిస్తుంది.

  రాశీఖాన్నా, సంపూ స్పెషల్ ఎంట్రీ

  రాశీఖాన్నా, సంపూ స్పెషల్ ఎంట్రీ

  సెకండాఫ్‌లో సినిమా రొటీన్‌గా మారుతుందనే ప్రమాదాన్ని గ్రహించిన దర్శక, నిర్మాతలు సడెన్‌గా రాశీఖాన్నాను ఓ పాటలో మెరిపించి ప్రేక్షకుల్లో జోష్ పెంచారు. ఇక క్లైమాక్స్ ముందు ప్రేక్షకులకు ఉత్సాహాన్ని పెంచడానికి పెట్టిన పాటలో సంపూ, తాగుబోతు రమేశ్, సప్తగిరిలను ప్రవేశపెట్టి మరో ఝలక్ ఇచ్చాడు. దాంతో సినిమాలో మరింత వినోదాన్ని జొప్పించాడు.

  సాయి కార్తీక్ మ్యూజిక్ హైలెట్

  సాయి కార్తీక్ మ్యూజిక్ హైలెట్

  సినిమాలో సాయి కార్తీక్ మ్యూజిక్ మరో హైలెట్ అని చెప్పవచ్చు. గున్న గున్నా లాంటి మాస్, జానపద పాటతో ప్రేక్షకులకు మత్తెక్కించాడు. ఈ పాటకు సినిమా హాళ్లలో ప్రేక్షకులు ఈలలతో సందడి చేయడం ఖాయం. ఇక గీత రచయిత శ్యాం కాసర్ల రాసిన రాజా ది గ్రేట్, ఎన్నియెల్లో ఎన్నియెల్లో పాటలు బ్రహ్మండంగా పేలాయి. సాయి కార్తీక్ రీరికార్డింగ్ సన్నివేశాలకు బలంగా మారింది.

  సినిమాటోగ్రఫీ గుడ్

  సినిమాటోగ్రఫీ గుడ్

  సినిమాటోగ్రాఫర్ మోహన కృష్ణ పనితీరు బాగుంది. ప్రకాశ్ రాజ్, మెహ్రీన్ ఎపిసోడ్స్ కానీ, యాక్షన్ సీన్లు గానీ కొత్తగా అనిపించాయి. ట్రైన్ ఎపిసోడ్, చేజింగ్ సీన్లను చక్కగా చిత్రీకరించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. అక్కడక్కడ కొన్ని సీన్లపై కత్తెర పడి ఉంటే ఇంకా సినిమా షార్ప్‌గా ఉండేది.

  దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ భేష్

  దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ భేష్

  నిర్మాణ విలువల విషయంలో దిల్ రాజు పాటించే ప్రమాణాలకు పేరుపెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే సినిమా నిర్మాణంపై ఆయనకు ఉన్న నిబద్ధత, అంకితభావం అలాంటిది. ఎప్పటిలానే సినిమాలో ఉన్నత నిర్మాణ ప్రమాణాలను కొనసాగించాడు.

  రవితేజ్ కుమారుడు మహధాన్

  రవితేజ్ కుమారుడు మహధాన్

  రవితేజ కుమారుడు మహాధన్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రను మహాధన్ పోషించాడు. తొలి చిత్రంలోనే ఛాలెంజ్‌గా ఉండే గుడ్డివాడి పాత్రలో నటించాడనే కంటే జీవించాడని చెప్పవచ్చు.

  తుది తీర్పు..

  తుది తీర్పు..

  రాజా ది గ్రేట్ కథను పక్కాగా కమర్షియల్ హంగులతో దర్శకుడు అనిల్ రాసుకున్నప్పటికీ.. దివ్యాంగులు ఏ విషయంలోనూ తీసిపోరనే ఆ సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా మహిళలను రాచి రంపనా పెట్టే భర్తలకు గుణపాఠం నేర్పే సీన్లు రాసుకోవడం దర్శకుడి సామాజిక కోణానికి అద్దం పట్టింది. రాజా ది గ్రేట్ గొప్ప విలువలు ఉన్న చిత్రం కాకపోయినప్పటికీ వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే హిట్‌గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  రవితేజ నటన

  కథ, దర్శకత్వం

  సెంటిమెంట్

  నెగిటివ్ పాయింట్స్

  ఫస్టాఫ్‌లో బ్యాంక్ ఎపిసోడ్

  సెకండాఫ్‌లో కొంత సన్నివేశాలు

  విలనిజం

  తెర ముందు.. తెర వెనుక

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: రవితేజ, మెహ్రీన్, వివాన్ భటేనా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, రాధిక, రాశీ ఖన్నా (స్పెషల్ సాంగ్)

  కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి

  నిర్మాత: దిల్ రాజు

  సంగీతం: సాయి కార్తీక్

  సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ

  ఎడిటింగ్: తమ్మిరాజు

  బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  రిలీజ్ డేట్: 18 అక్టోబర్ 2017

  English summary
  Ravi Teja's latest movie is Raja The great. This movie is slated to release on October 18. Ravi acting as bling first time on screen. Ravi Teja's son Mahadhan is giving the entry into tollywood. This movie may be come back for Radhika, which acted as mother.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X