»   » ‘రాజరథం’ రివ్యూ: నిరాశ పరిచిన రానా బస్సు కథ

‘రాజరథం’ రివ్యూ: నిరాశ పరిచిన రానా బస్సు కథ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rajaratham/Rajaratha Movie Review ‘రాజరథం’ రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి, రవి శంకర్
  Director: అనూప్‌ భండారి

  నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా నటించిన కన్నడ చిత్రం తెలుగులో 'రాజరథం' పేరుతో విడుదలైంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించారు. 'రాజరథం' అంటే బస్సు. బస్సు పాత్రకు రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్లో..... 'గాలై వస్తాను, మెరుపై పోతాను, నాది రాజవంశం, నా వేగానిక ఏదైనా ధ్వంసం, నేను నడిచే దారి రాజపతం... నా పేరు రాజరథం' అంటూ రానా గంభీరమైన వాయిస్‌ బాగానే బిల్డప్ ఇచ్చారు. మరి అదే స్థాయిలో సినిమా ఉందా? రివ్యూలో చూద్దాం....

  కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

  కథలో రెండు కోణాలు

  ఈ కథలో రెండు కోణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రేమ కథ కాగా.... మరొకటి రాజకీయ కోణం. ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ రెండు కథలకు ‘రాజరథం' అనే బస్సుతో లింకు పెట్టి కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.

  నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

  లవ్ స్టోర్టీ

  అభి(నిరూప్ బండారి), అవంతిక శెట్టి (మేఘన) ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో వేర్వేరు బ్రాంచీల్లో చదువుకుంటారు. అడ్మిషన్ సమయంలోనే మేఘనను చూసి మనసుపారేసుకున్న అభి ఆమెను లాస్ట్ ఇయర్ వరకు ఫాలో అవుతూనే ఉంటాడు. కానీ మేఘనకు ఈ విషయం తెలియదు. ఆమె మరొక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అనుకోకుండా ఇద్దరూ ‘రాజరథం' అనే బస్సులో పక్క పక్క సీట్లలో ప్రయాణం చేస్తారు.

  రాజకీయ కోణం

  రాజకీయ నాయకులు తమ అవినీతి కుంభకోణానికి సంబంధించి అంశం నుండి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికి ఆంధ్రా-కర్నాటక సరరిహద్దులో అల్లర్లకు సృష్టిస్తారు. ఇందుకు అభి అన్నయ్య, ప్రజా రక్షణ సమితి నాయకుడైన విశ్వ(ఆర్య)ను పావుగా వాడుకుంటారు. ఆంధ్ర-కర్నాటక మధ్య జరుగుతున్న ఈ గొడవలు ముదరడంతో ఆందోళనకారులు రోడ్డెక్కి బస్సులను తగలబెడుతుంటారు. ఈ గొడవల్లో ‘రాజరథం' చిక్కుకుంటుంది. మరి ఆ లవ్ స్టోరీ, ఈ గొడవలను చివరకు ఎలా ముగించారు అనేది తెరపై చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్ పరంగా...

  నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి పెర్ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదు. అంత గొప్పగా ఏమీ లేక పోయినా ఓకే అనిపించారు. ప్రజా రక్షణ సమితి నాయకుడిగా తమిళ హీరో ఆర్య సీరియస్ పాత్రలో నటించి మెప్పించారు. ఆర్య కనిపించేది తక్కువ సీన్లే అయినా అతడి పాత్ర బాగా హైలెట్ అయింది. అకుంల్ పాత్రలో రవి శంకర్ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమాలో ఇంతకు మించి చెప్పుకోవడానికి అంత గొప్ప పాత్రలేమీ లేవు.

  టెక్నికల్ అంశాలు

  ఈ చిత్రానికి విలియమ్ డేవిస్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా ఉందే అందులో ముందు ఉండే పాయింట్ సినిమాటోగ్రఫీ. ప్రతీ సీను చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం కూడా దర్శకుడు అనూప్ బండారి అందించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే అజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా ఎక్కవ శ్రద్ద పెట్టాల్సింది. డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. జాలీహిట్స్‌ టీమ్‌ నిర్మాణ విలువలు బావున్నాయి.

  ప్లస్ పాయింట్స్

  సినిమాకు ప్లస్ పాయింట్స్ రానా వాయిస్ ఓవర్, ఆర్య పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్
  కథ, కథనం, డైరెక్షన్, మ్యూజిక్ ఇలా చెప్పుకోవడానికి ఇందులో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

  సినిమా ఫస్టాఫ్ అంతా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా సాగింది. పాత్రలను పూర్తిగా పరిచయం చేయడానికే ఇంటర్వెల్ వరకు సమయం తీసుకున్నారు. అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పాత్రలను కూడా వివరిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. ఫస్టాఫ్ లవ్ స్టోరీ పేరుతో సాగదీసి సాగదీసీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

  సెకండాఫ్‌ ఎలా ఉందంటే

  సెకండాఫ్ కూడా బోరింగ్‌గా సాగింది. సినిమా చివరి 30 నిమిషాలు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెండు విభిన్న కోణాలున్న కథను సరిగా అతికించేలా స్క్రిప్టు వర్క్ జరుగలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడి పనీ తీరు

  దర్శకుడు ఎంత సేపూ.... ఈ ఫ్రేము అందంగా ఉందా? ఇందులో ఏదైనా వస్తువు మిస్సయిందా? ఈ సీన్లో ఇంకా ఏదైనా చేర్చాలా? అంశాల మీదనే దృష్టి పెట్టాడే తప్ప ఆ సీన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? స్క్రీప్లే ఆసక్తికంగా సాగుతుందా? అనే అంశాల విషయంలో మాత్రం దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. కథ కూడా గొప్పగా ఏమీ లేదు.

  చాలా ఓవర్ సినిమాటిక్

  ఇక ప్రతి సీన్లోనూ ఓవర్ సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో సినిమా మరింత సాగదీసి అనుభూతి కలిగి ప్రేక్షకుడికి మరింత విసుగు తెస్తుంది.

  ఫైనల్‌గా

  ట్రైలర్ చూసిన చాలా మంది బస్సు చుట్టు ఆకస్తికర కథ సాగుతుందని ఊహించారు. రానా తన వాయిస్ ఓవర్‌తో బిల్డప్ ఇచ్చిన తీరు కూడా సినిమాలో ఏదో హైప్ క్రియేట్ చేసింది. కానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సినిమా లేదు.

  నటీనటులు, టెక్నీషియన్స్

  తారాగణం: నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి, రవి శంకర్ తదితరులు.
  మాటలు: అబ్బూరి రవి
  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజనీష్‌ లోక్‌నాథ్‌
  ఎడిటింగ్‌: శాంతకుమార్‌
  సినిమాటోగ్రఫీ: విలియమ్‌ డేవిడ్‌
  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధాకర్‌ సాజ
  నిర్మాణం: జాలీహిట్స్‌ టీమ్‌
  సంగీతం, స్క్రీన్‌ప్లే, రచన, దర్శకత్వం: అనూప్‌ భండారి.

  English summary
  After the blockbuster success of RangiTaranga, Anup Bhandari has collaborated with his brother Nirup Bhandari again for Rajaratha. The movie has been simultaneously made in Telugu as well. The Telugu title of the movie is Rajaratham. Anup Bhandari has repeated the cast by choosing Avantika Shetty and Nirup Bhandari to play the leads.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more