twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తం మరగించే చరిత్ర (రక్త చరిత్ర రివ్యూ)

    By Srikanya
    |
    Rakta Charitra
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: స్టూడియో సినర్జీ పిక్చర్స్
    తారాగణం: వివేక్ ఒబెరాయ్, రాధిక అప్టే, ప్రియమణి, సూర్య, శత్రుఘ్న సిన్హా, సుదీప్, అభిమన్యు సింగ్
    కధ: ప్రషాంత్ పాండే
    సినిమాటోగ్రఫీ: అమోల్ రాథోడ్
    డైలాగులు: నాగేశ్వరరావు
    కూర్పు: నిపుణ్అశోక్ గుప్త
    సంగీతం: ధరమ్-సందీప్
    నిర్మాత: మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
    విడుదల తేదీ: 22, అక్టోబర్ 2010

    రామూ...రక్తమూ ఎప్పుడూ హాట్ టాపిక్సే. ఇక ఆ రెండూ కలిస్తే ఇంకేముంది. నిజానికి నాకు ఈ సినిమా మొదలైనప్పటినుంచీ ఓ సందేహం పీకుతోంది. హిందీ హీరోతో తెలుగువారి కథ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది..జనం డబ్బింగ్ సినిమాలా ఫీలవరా అని. అయితే రక్త చరిత్ర చూసాక కేవలం పాత్ర మాత్రమే కనపడటానికే రామూ ఈ సాహసం చేసారని అర్దమైంది. రాయలసీమ వాస్తవ కక్షల చరిత్ర నేఫధ్యంతో పక్కా ఫార్ములా కథ అల్లి, విలన్-హీరోల మధ్య సంఘర్షణలనే హైలెట్ చేస్తూ వర్మ ఈ రక్త చరిత్ర సృష్టించారు. దాంతో చిత్రం చరిత్ర సృష్టించకపోయినా ప్రేక్షకాదరణకు మాత్రం లోటుండదని అన్పిస్తుంది. అయితే క్లైమాక్స్ లో కంక్లూజన్ ఇవ్వకుండా సెకెండ్ పార్ట్ కోసం వదిలేయటం మాత్రం కొంత నిరాశ కల్గిస్తుంది. అలాగే మితిమీరిన హింస (వర్మ చెప్తున్నదే అనుకోండి) ఫ్యామిలలను ధియోటర్స్ వైపు కన్నెత్తి చూడనీయదు. ఇక వీటిని ప్రక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటూ తీసిన కొత్త షాట్స్, ప్రేమ్ లు చూడ్డానికి మాత్రం సినీ ప్రియులు వెళ్ళాల్సిందే.

    సిటీలో చదువుకుంటున్న ప్రతాప్ రవి(వివేక్ ఒబరాయ్) తండ్రి హత్యకు గురి అవటంతో తన ఊరు ఆనందపల్లికి వస్తాడు. అయితే అప్పటికే తన అన్న అడవుల్లోకి వెళ్ళి గొరిళ్లా పద్దతుల్లో పగ తీర్చుకుంటున్నాడని తెలుసుకుంటాడు. అన్నకి సపోర్టు ఇచ్చి తానూ ఆ పగ తీర్చుకునే క్రమంలో పాలుపంచుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్న ప్రతాప్ కి తన అన్న కూడా పోలీసులకు దొరికి లాకప్ డెత్ చేయబడటం రగిలిస్తుంది. అక్కడనుంచి తన తండ్రి,అన్న మరణానికి కారణమైన వారిని వేటాడి వేటకొడవళ్ళుతో చంపేస్తాడు. అయితే హత్యకు గురైన నాగమణి రెడ్డి (కోట శ్రీనివాసరావు)కో కొడుకు బుక్కారెడ్డి(అభిమన్యు సింగ్) ఉంటాడు. బుక్కారెడ్డి మామూలుగానే మహా నీచుడు. అలాంటిది తన తండ్రి హత్యకు గురౌటంతో చంపిన ప్రతాప్ రవి పై కక్ష తీర్చుకోవాలని తిరుగుతూంటాడు. మరో ప్రక్క సినిమా స్టార్ శివాజీ రావు (శత్రుఘ్న సిన్హా) కొత్తగా తను పెట్టిన ప్రజాదేశం పార్టి టిక్కెట్ ప్రతాప్ రవికి ఇస్తాడు. అది జీర్ణించుకోలేని బుక్కారెడ్డి ఏం ఎత్తువేస్తాడు. దాన్ని ప్రతాప్ ఎలా ఎదుర్కొంటాడు అన్న విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

    రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఫస్టాఫ్ రన్ స్పీడుగా నడిచినప్పటికీ సెకెండాఫ్ స్లో అయ్యి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంటన్సెటీ లేకుండా పోయింది. అందులోనూ ప్రతాప్ రవి పాత్ర రాజకీయాల్లోకి వచ్చి హోం మినిస్టర్ అవటంతో అప్పటి దాకా పెంచుకుంటూ వచ్చిన బుక్కారెడ్డి పాత్ర చిన్నదై కాంప్లిక్ట్ తగ్గినట్లైంది. అయితే తెరపై శతృఘ్నసింహా పాత్ర ఎంటరవటంతో చాలామంది ఎన్టీఆర్ కి కనెక్ట్ అయి ఆ లోపాన్ని గమనించటం జరగదనిపిస్తుంది. అలాగే సెకెండ్ పార్ట్ కోసం అక్కడికి ఆ కథని ముగించకపోవటం కూడా పూర్తి సినిమాని చూసిన సంతృప్తిని ఇవ్వలేకపోయింది. అయితే క్లైమాక్స్ దగ్గర బుక్కారెడ్డిని చంపే ఎపిసోడ్ మాత్రం సినిమాకు హైలెట్ అయి నిలుస్తుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ...నేరాలు-ఘోరాలు టైపులో విజువల్ గా చక్కగా కనపడుతున్న సీన్స్ కు కూడా వాయిస్ ఓవర్ చెప్పటం విసుగేస్తుంది.

    ఇవన్నీ ఎలా ఉన్నా రామ్ గోపాల్ వర్మ వంటి గొప్ప టెక్నీషియన్, మాస్టర్ స్టోరీ టెల్లర్ తన మనస్సు పెట్టి పూర్తి స్ధాయిలో టెక్నికల్ గా (రీ రికార్డింగ్, ఎడిటింగ్, కెమెరా) వండర్ అనిపించారు. అలాగే హింసను కూడా భావోధ్వేగాలతో మిళితంచేసి పండించటం ఆయనకే చెల్లు. ఇక ఆర్టిస్టులులో ప్రతాప్ రవి గా వివేక్ ఒబరాయ్...కరెక్టుగా సరిపోయారు. ఇక ఎన్టీఆర్ ని తలపిస్తూ శతృఘ్నసింహా చెప్పే డైలాగులు, హావ భావాలు హైలెట్ అనిపిస్తాయి. అంతేగాక ప్రతాప్ రవి భార్య నందిని గా చేసిన రాధా ఆఫ్టే కూడా కేవలం కళ్ళతోనే కొన్ని సీన్స్ లో నటించి మైమరిపించింది. ఇవన్నీ ఒకెత్తు అయితే బుక్కా రెడ్డి గా చేసిన అభిమన్యు సింగ్ మరో సారి విజృంభించాడు. దుర్మార్గానికి ప్యాంటు షర్ట్ వేస్తే అలాగే ఉంటాడనిపించేలా చేసాడు. హ్యాట్యాప్ అభిమన్యు..అలాగే చెయ్యి జనాలకి ఊపుతున్న పెటింటిగ్ ద్వారా హస్తం (కాంగ్రేస్)ని గుర్తు చేయటం, తెలుగుదేశం పార్టీ అన్నట్లు సైకిల్ ని చూపెట్టడం వంటి ఎన్నో సింబాలిజాలు సామాన్య ప్రేక్షకుడుని కూడా అలరింప చేస్తాయి. పాటల్లో ధీమ్ సాంగ్ జనాలు హమ్ చేసుకుంటూ ధియోటర్ లోంచి బయిటకు వస్తారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం అనవసరం.

    ఏది ఎలా ఉన్నా పరిటాల రవి కథ ఇది అనే కాంటెస్ట్ తో సినిమాకి వెళితే తెరపై ఆ తరహా అంశాలేమీ కనపడక కొంత నిరాశ ఎదురవ్వవచ్చు. వర్మ కొత్త సినిమా అని వెళితేనే ఆ హింసను ఫీలవుతాం. అలాగే వర్మ చాలా గ్యాప్ తర్వాత హిట్టు కొట్టిన చిత్రంగా చెప్పవచ్చు. వర్మ అభిమానులే కాక మామూలు వాళ్ళకూ ఈ సినిమా నచ్చే అవకాసం ఉంది. ఫైనల్ గా ఇదో "ఫీల్ వెయలెన్స్" సినిమా. సెకెండ్ పార్ట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూసే సినిమా.ట్రైలర్స్ చూసే ఏమిటండీ ఇంత హింస...అనుకునే వారు మాత్రం ఈ చిత్రం జోలికి వెళ్లకపోవటం మేలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X