For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వన్ మ్యాన్ షో ('రచ్చ' రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  బ్యానర్: మెగాసూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ ప్రై.లిమిటెడ్‌

  నటీనటులు: రామ్ చరణ్ తేజ్, తమన్నా, నాజర్‌, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, పార్తీబన్‌, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు

  సమర్పణ :ఆర్‌.బి.చౌదరి

  సంగీతం: మణిశర్మ

  ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి

  రచన: పరుచూరి బ్రదర్స్‌

  ఎడిటింగ్: గౌతంరాజు

  కళ: ఆనంద్‌సాయి

  కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి

  నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్

  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది

  'ఏదో చెప్పి తొడలు కొట్టే రకాన్ని కాదురా నేను', 'నా అబ్బను అంటే ఎవడి అబ్బనయినా నరుకుతా'వంటి డైలాగులతో 'రచ్చ'.. రచ్చ చేయటానికి థియేటర్లోకి దూకింది. అలాగే పంచ్ డైలాగులు, ఫార్ములా కథతో ఈ మాస్ సినిమాని రూపొందించి ఓ వర్గాన్ని ఆనందపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాఫ్ సరదా సరదాగా ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోయిన ఈ సినిమా సెకండాఫ్ కి వచ్చేసరికి పాతబడిన 'బన్నీ'తరహా ఫ్లాష్ బ్యాక్ తో బయిటపడాలనే ప్రయత్నం చేసింది. అప్పటికీ రామ్ చరణ్ తనదైన స్టైలిష్ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

  బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్) ఎప్పటిలాగే బెట్టింగ్ లు కడుతూ కుటుంబాన్ని లాక్కొస్తూంటాడు. అయితే అనుకోకుండా అతని పెంపుడు తండ్రి(ఎమ్.ఎస్ నారాయణ)తెగ తాగి లివర్ పాడుచేసుకుంటే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద ఎమౌంట్ కోసం హీరో అతి పెద్ద బెట్ కి సిద్దమవుతాడు. చైత్ర(తమన్నా) అనే టైట్ సెక్యూరిటీ ఉన్న కోటీశ్వరురాలు కూతురుని లవ్ లో పడేస్తానని పందెం కాస్తాడు. అందుకోసం అతను రాత్రింబవళ్లూ ఆమె చుట్టూ తిరిగి... ఆమెను ఆకట్టుకోవటం కోసం సాహసాలు చేస్తూ.. పాటలు పాడుతూంటాడు. సరిగ్గా పందెం గెలచామనుకునే సమయానికి అతనికో నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ చైత్ర ఎవరు... ఏంటా నిజం అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  ఫస్టాఫ్.. ఎంటర్టైన్మెంట్.. సెకండాఫ్.. యాక్షన్ అంటూ ఫార్ములా ప్రకారం స్క్రిప్టుని విడతీసి మరీ స్క్రీన్ ప్లే చేసుకున్న ఈ చిత్రం ఫస్టాఫ్.. హీరోయిన్ పడేయటానికి హీరో చేసే ట్రిక్కులతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఎప్పుడన్నా ఎంటర్నైమెంట్ తగ్గుతుందనుకుంటే... బ్రహ్మానందం వంటి కమిడెయిన్స్ తో లాగేసారు. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి... అసలు కథ ఏమిటి... హీరో, హీరోయిన్స్ గతం ఏమిటి.. వాళ్లిద్దరికి ఉన్న రిలేషన్ ఏమిటి.. ఈ ప్రేమ పందెం కాయటం వెనక ఉన్న అసలు రీజన్ ఏమిటి వంటి సవాలక్ష సందేహాలకు సమాధానం చెప్పటం కోసం ప్లాష్ బ్యాక్ వెయ్యాల్సి వచ్చింది.

  ప్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి లవ్ స్టోరీ కాస్త రివెంజ్ స్టోరీగా టర్న్ తీసుకుంది. దాంతో కథ బ్రేక్ లు పడి... కాస్తా డ్రై గా మారిపోయింది. దానికి తోడు ఆ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్నో సార్లు తెలుగు తెరపై చూసింది కావటం వల్ల కాస్త ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా హీరో కి విలన్స్ ఎవరో తెలిసి కౌంటర్ ఇచ్చేసరికి కథ క్లైమాక్స్ చేరుకుంది. దాంతో విలన్ పై విజయం సాధించటానికి హీరోకి స్క్రీన్ టైం సరిపోలేదు. ఎంతసేపు హీరోయిన్ ని తన ట్రిక్ లో పడేసిన హీరో, విలన్స్ పై ఒక్క ట్రిక్కూ ప్లే చేయలేకపోయాడు.. ఒక్క ట్విస్టు ఇవ్వలేకపోయాడు. పూర్తి ప్యాసివ్ గా మారాడు.

  ఇక నటీనటుల్లో రామ్ చరణ్ తనదైన శైలిలో వన్ మ్యాన్ షో లాగ సినిమాని మోసుకు వెళ్లిపోయాడు. ముఖ్యంగా డైలాగు డెలవరీలో పంచ్ విసిరేటప్పుడు చాలా నేర్పుగా తన తండ్రిని గుర్తుకు తెస్తూ పరిణితితో సాగిపోయాడు. ఇహ పాటల్లో రచ్చ టైటిల్ సాంగ్, వానా వానా వెల్లువాయేలకు అద్బుతమైన డాన్స్ స్పెప్స్ వేసి తన తోటి హీరోలకు సవాల్ విసిరాడు. హీరోయిన్ తమన్నా.. ఊసరవెల్లిలో తన పాత్రను గుర్తు చేసినట్లైంది. కమిడెయిన్స్ లో బ్రహ్మానందం రంగీలా ఫ్రమ్ చికాగో గా బాగానే నవ్వించాడు. అలీ ఉన్నది కాస్సేపయినా తనదైన పంచ్ వేసాడు. ఎమ్.ఎస్ నారాయణ.. కమిడెయిన్ గా కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా మెప్పించాడు.

  సంగీత దర్శకుడు మణిశర్మ తన స్పెషలైజేషన్ రీరికార్డింగ్ అని మరో సారి నిరూపించుకున్నారు. ఎడిటింగ్, కెమెరా ప్రతీ ప్రేమ్ ని రిచ్ గా చూపెట్టడంలో సఫలీకృతమయ్యాయి. సంపత్ నంది.. పెద్ద హీరోని అయినా ఎక్కడా తడబడకుండా బాగా డీల్ చేసాడు. కథ, కథనం బాగా చేసుకుంటే మరో మాస్ డైరక్టర్ ఇండస్ట్రీకి దొరికినట్లే. ఇక పరూచూరి బ్రదర్శ్ డైలాగుల విషయానికి వస్తే ఎప్పటిలాగే వారు హీరోని ఎలివేట్ చేస్తూ పంచ్ లతో దూసుకు వెళ్లిపోయారు.

  ఏదైమైనా మొదటి నుంచి ఈ చిత్రం రూపకర్తలు తమ టార్గెట్ మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అని స్పష్టంగా చెప్తున్నారు. వారి అంచనాలకు తగినట్లే తయారైన ఈ చిత్రం వారిని రీచ్ అయ్యే అవకాశం ఉంది. పాటలు, ఫైట్స్ మిగతా జనాలకి కూడా పడితే సినిమా ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంది.

  English summary
  Ram Charan's Rachcha film released today. It's a twisted story with Love and Sentiment. Punch dialogues and Tamanna's beauty, Ram Charan's action is the USP of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X