»   » బోర్ లీ (‘బ్రూస్ లీ' రివ్యూ)

బోర్ లీ (‘బ్రూస్ లీ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

--సూర్య ప్రకాష్ జోశ్యుల

మొదటినుంచీ శ్రీను వైట్ల సినిమాలంటే యాక్షన్ కామెడీలకు, కాస్తంత ఫ్యామిలీ ఎమోషన్స్ తిరగమోత పెట్టి వడ్డిస్తాడని తెలిసిందే. దాంతో కామెడీ పండితే అది 'దూకుడు' లేకపోతే 'ఆగాడు' అవుతోంది. అలాగే తను మొదలు పెట్టిన ఫార్మెట్ ని మార్చకుండా హీరోలను మాత్రమే మారుస్తూ వస్తున్నారు. అదే స్కీమ్ లో ఇప్పుడు రామ్ చరణ్ తో విలన్ ఇంట్లో హీరో చేరి అతన్ని ఇబ్బంది పెట్టి, ఆట కట్టించే కథనే కొంచెం అటూ చేసి తీసాడు. బ్రహ్మానందంని ఎప్పటిలాగే సెకండాఫ్ కు తెచ్చాడు. ఇంకొంచెం బలంగా ఉంటుందని The Valet (2006) అనే ఫ్రెంచ్ సినిమాని సైతం తీసుకు వచ్చి కలిపారు. అలీ తో అమీర్ ఖాన్ ..పీకే స్పూఫ్ చేసారు. జయప్రకాష్ రెడ్డి చేత డ్యూయిల్ రోల్ వేయించి కామెడీ చేయించారు.


ఇలా ఎన్ని కలిపినా ఎన్ని చేసినా సెకండాఫ్ సోసోగానే సాగి,డ్రాప్ అవుతూ వచ్చింది. అనుకున్న స్ధాయిలో బ్రహ్మీ కామెడీ పేలి ఈ సారి శ్రీను వైట్లను కాపాడలేదు. రామ్ చరణ్ క్యారక్టర్ కు సినిమాలో సరైన సమస్య ఇచ్చే నెగిటివ్ పాత్ర లేకపోవటంతో నీరసపడిపోయింది. అయితే రామ్ చరణ్ మాత్రం నటుడుగా, స్టైల్స్ లోనూ, డైలాగు డెలవరీలోనూ అదరకొట్టారు అని చెప్పటం లో సందేహం లేదు. ముఖ్యంగా డాన్స్ లకు అతను వేసే స్టెప్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమా చివర లో సినిమాని సేవ్ చేయటానికా అన్నట్లు చిరంజీవి ఎంట్రీ...ఆయన చెప్పే...జస్ట్ టైం గ్యాప్ మాత్రమే..టైమింగ్ లో మాత్రం కాదు అనే డైలాగు హైలెట్.


అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు. ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


‘బ్రూస్ లీ' ఎనౌన్స్ చేయగానే చాలా మందిలో ఒకే ఆలోచన...శ్రీను వైట్ల ఫార్మెట్ లోకి వచ్చి రామ్ చరణ్ చేస్తాడా...లేక రామ్ చరణ్ పంధాలోకి వెళ్లి శ్రీను వైట్ల సినిమా చేస్తాడా అని...అయితే రామ్ చరణ్ మాత్రం దర్శకుడుకే గౌరవం ఇచ్చి...ఆయన ఫార్మెట్ లోకే వెళ్లి సినిమా చేసాడు. ముఖ్యంగా కథకు గానీ, హీరోకు గానీ సరైన లక్ష్యం ఏర్పాటు చేయటంలో విఫలమయ్యారు. దాంతో సినిమాలో ఎక్కడా విలన్ కు, హీరో కు మధ్య కాంప్లిక్ట్ అనేది లేకుండా పోయింది. విలన్ కు అసలు ...ఫలానా వాడు హీరో తనను ఇరికించబోతున్నాడనే విషయం తెలిసే సరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ క్లైమాక్స్ అయినా సవ్యంగా ఉందా అంటే పాత చిరంజీవి సినిమాల్లో లాగ...విలన్ చేసే కిడ్నాపులు(హీరోయిన్ ని, హీరో తండ్రిని) తో నిండిపోతుంది.


విలన్ వల్ల తనకు కానీ తన కుటుంబానికి గానీ (ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి) లేదా తనను నమ్ముకున్న జనాలకు కానీ ఇబ్బంది కలిగినట్లు ఎక్కడా చూపరు. అతను విలన్ కాబట్టి హీరో వెళ్లి అతని అసలు రూపం బయిటపెట్టాలి అంతే అన్నట్లు రాసుకున్నారు సీన్స్. ఓ క్రిమినల్ సెకండ్ వైఫ్ ని బయిటపెట్టి ప్రపంచానికి తెలియచేస్తే ఎంత తెలియచెయ్యకపోతే ఎంత..అతని క్రిమినల్ లైప్ ని బయిటపెట్టి అంతమొందించాలనేది పట్టించుకోలేదు.


హైలెట్స్, మైనస్ లు స్లైడ్ షోలో...


పోలీస్ డ్రస్ లో ...

పోలీస్ డ్రస్ లో ...

రామ్ చరణ్ ఇంట్రడక్షన్ పోలీస్ డ్రస్ లో చాలా బాగుంది. పోలీస్ గా ఎంట్రీ ఇచ్చి చేసే ఫైట్, దాని కంటిన్యూషన్ మిస్ అండర్ స్టాండింగ్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి.


ఇంకో హైలెట్

ఇంకో హైలెట్

సినిమాలో బాగా వర్కవుట్ అయిన వాటిలో సిస్టర్ సెంటిమెంట్ సీన్స్, తండ్రి,కొడుకు ల సీన్స్ . కృతి కర్బంద, రామ్ చరణ్ పోటీ పడి చేసారు. రావు రమేష్ పాత్ర సినిమాలో బాగా పండింది.


చివర్లో వచ్చి సేవ్

చివర్లో వచ్చి సేవ్

రామ్ చరణ్ ...క్లైమాక్స్ లో వచ్చిన చిరంజీవితో ఓ డైలాగు అంటారు..చివర్లో వచ్చి సేవ్ చేసారు అని... అదే రీతిలో చిరంజీవి లుక్, ఎంట్రీ ఎనర్జీ తో ఉంటుంది.


డాన్స్ లు ,ఫైట్స్

డాన్స్ లు ,ఫైట్స్

ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బోట్, ఫైట్ సీక్వెన్స్ బాగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కూడా బాగా డిజైన్ చేసారు. డాన్స్ లు కూడా రామ్ చరణ్ దుమ్మురేపాడనే చెప్పాలి


ఏమైందో..

ఏమైందో..

సినిమా మొదట్లో సినిమా హీరోగా బ్రహ్మాజీ మీద చేసిన ఫన్ బాగుంది. గతంలో దుబాయి శ్రీను... ఎమ్ ఎస్ నారాయణ మీద చేసిన పాత్ర గుర్తుకు వస్తుంది. అయితే బ్రహ్మాజీ ఎప్పుడూ ఓ స్వామిజీ దయ అంటూ చెప్తూంటారు. ఆ స్వామీజిని సెకండాఫ్ లో ఏమన్నా ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నారు అంతా...అయితే అది కనపడలేదు.


దెబ్బ కొట్టింది

దెబ్బ కొట్టింది

ఇక ఎప్పుడూ బ్రహ్మానందం పాత్రను అదరకొట్టే రీతిలో మలిచే శ్రీను వైట్ల ఈ సారి ఆ పాత్రను పెద్ద మైనస్ చేసారు. అండర్ కవర్ కాప్ గా బ్రహ్మానందం నవ్వులు పండించకపోగా బోర్ కొట్టించాడు.


ఇవీ వర్కవుట్ కాలేదు

ఇవీ వర్కవుట్ కాలేదు

అలీ అయితే ఎందుకు పీకే స్ఫూఫ్ చేసారో ఆయనకే తెలియాలి. జబర్దస్త్ టీమ్ తో చేసిన కామెడీ అయితే శుద్దం వేస్ట్. ఉన్నంతలో సప్తగిరి పంచ్ లు పేలాయి. పోసాని, ఫృద్వీ జస్ట్ ఓకే అనిపించారు. నదియా పాత్రకు డెప్త్ లేదు.


వీళ్ళంతా ...

వీళ్ళంతా ...

చిరంజీవి అయితే ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించారు. రకుల్ ప్రీతి సింగ్ చాలా గ్లామర్ గా కనిపించింది. రామ్ చరణ్ కు మాత్రం ఇది కొత్త పాత్రే. విలన్ గా చేసిన అరుణ్ విజయ్ లుక్ పరంగా చాలా బాగున్నారు. సంపత్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేసారు.


టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

ఈ సినిమా లో సాంకేతికంగా ఎక్కువ మార్కులు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కే పడతాయి. ఫస్టాఫ్ లో ఎడిటర్ స్పీడు కనపడుతుంది. సెకండాఫ్ లో అది ఎందుకనో మందగించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసారు


నాన్న గారి ఉప్పు తిన్నాను

నాన్న గారి ఉప్పు తిన్నాను

నాన్న గారి ఉప్పు తిన్నాను...తప్పు చేయలేను, క్యారక్టర్ లో కంటెంట్ ఉండాలి కానీ టెంట్ వేసుకుని కూర్చుంటాను వంటి కోన వెంకట్ డైలాగులు అద్బుతం కాదుకానీ బాగానే పేలాయి. స్క్రీన్ ప్లే నే నాశిరకంగా కూర్చుకోవటంతో సెకండాఫ్ తేలిపోయింది.


చెలరేగాడు

చెలరేగాడు

సంగీత దర్సకుడు తమన్ తన పాటలుతోనే కాకుండా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ లేపి నిలబెట్టాడు. మెగా మీటర్ సాంగ్ కు, కుంగుఫూ కుమారి పాటకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.


ఎవరెవరు...

ఎవరెవరు...

బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
నటీనటులు: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్, రావు రమేష్, సప్తగిరి, బ్రహ్మానందం, కీర్తి కర్బంద, సంపత్ రాజ్, అలీ, నదియా, అరుణ్‌ విజయ్‌ తదితరులు.
కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌,
మాటలు: కోన వెంకట్‌,
ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస,
కూర్పు: ఎ.ఆర్‌. వర్మ,
కళ: నారాయణరెడ్డి,
ఫైట్స్‌: అణల్‌ అరసు,
సమర్పణ: డి. పార్వతి,
మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.
విడుదల తేదీ: 16,అక్టోబర్ 2015ఫైనల్ గా... రామ్ చరణ్ డాన్స్ లు కోసం, చిరంజీవి ఎంట్రీ సీన్ కోసం తప్పక చూడదగ్గ సినిమా. అంతేకానీ ఎప్పటిలాగే శ్రీను వైట్ల ఇరగతీసే కామెడీ తీసుంటాడు అని వెళ్తే మాత్రం ఆకట్టుకోదు.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Bruce Lee The Fighter starring Ram Charan and Rakul Preet Singh released today.Super hit songs, rocking dances, impressive promotional trailers, ensemble cast and of-course Megastar Chiranjeevi's cameo has brought in much attention to the project.
Please Wait while comments are loading...