twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్ ఫ్యాన్ ( 'తుఫాన్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ఖాన్ ల త్రయం ఏక చక్రాధిపత్యం గా బాలీవుడ్ ని ఏలుతున్న ఈ సమయంలో సౌత్ నుంచి ఓ తెలుగు హీరో బాలీవుడ్ లో లాంచ్ అవటం... అదీ ఓ సూపర్ హిట్ క్లాసిక్ ని రీమేక్ చేస్తూ థియేటర్స్ లో దిగటం ఖచ్చితంగా అంచనాలు పెంచే విషయమే. ముఖ్యంగా మన తెలుగువారిలో మన హీరో ఏ మేరకు అక్కడ జనాల్ని ఆకట్టుకోబోతున్నాడనేది ఆసక్తికర అంశం. క్లాసిక్ ని రీమేక్ చేసేటప్పుడు...ఓపినింగ్స్ , మీడియా ఎటెన్షన్ వంటి విషయాలు ప్లస్ అయినా... ఒరిజనల్ చిత్రంతో పోల్చి ఏ మాత్రం ఆ క్వాలిటీని,ఫీల్ ని అందుకోకపోయినా పెదవి విరవటం అనే మైనస్ కూడా ప్రక్కనే పొంచి ఉంటుంది. అయితే దర్శకుడు ఈ సమస్యని అథిగమించటానికి ఒరిజనల్ కథలో మార్పులు చేయటం, రామ్ చరణ్ తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేయటం కలిసి వచ్చాయి. పాత జంజీర్ తో పోల్చకపోతే ఈ చిత్రం బాగుంటుంది. తెలుగులో ప్రస్తుతం బాగా పే చేస్తున్న ఎంటర్టైన్మెంట్,రొమాన్స్ పాళ్లు తగ్గినా ఓ సారి చూడవచ్చనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

    నీతి నిజాయితీలే ప్రాణంగా బ్రతికే పోలీస్ ఆఫీసర్ ఎసిపి విజయ్ ఖన్నా (రామ్ చరణ్). అతని నిక్కచ్చితనం, స్ట్రైయిట్ ఫార్వర్డ్ నెస్ లతో నిరంతరం ట్రాన్సఫర్స్ ఎదుర్కొంటున్నా,తన పద్దతి మాత్రం మార్చుకోడు. ప్రస్తుతం కథా కాలానికి హైదరాబాద్ లో ఉన్న విజయ్ ... లోకల్ పొలిటీషియన్స్ కి అడ్డంగా అనిపించటంతో ముంబైకి ట్రాన్స్ ఫర్ చేయిస్తారు. అక్కడ అతనికోసం ముంబై డిప్యూటి కలెక్టర్ మర్డర్ కేసు ఎదురుచూస్తూంటుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే భాధ్యత భుజాన వేసుకున్న అతనికి ఆ మర్డర్ వెనక ఉన్న ఆయిల్ మాఫియా గురించి తెలుస్తుంది. అలాగే ఆ మర్డర్ కి ఏకైక సాక్షి... ఎన్నారై మాల(ప్రియాంక చోప్రా) అని తెలిసి..ఆమె సాయిం అడుగుతాడు. ఈ క్రమంలో ఆయిల్ మాఫియా సామ్రాజ్యాధినేత రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్)ని ఎదుర్కొవాల్సి వస్తుంది. అతని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎలా అతని ఆయిల్ మాఫియాని అంతమొందించాడు...పోలీస్ పవర్ ఏంటనేది ఎలా చూపించాడు...విజయ్ కి మాలకి మధ్య ఉన్న రిలేషన్ ఏ దిశకు టర్న్ తీసుకుంది. షేర్ ఖాన్(శ్రీ హరి) ఎవరు..అతనితో విజయ్ కి పనేంటి....కథలో అతని పాత్రేంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    అమితాబ్ కి యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చిన చిత్రం జంజీర్. దాన్నీ రీమేక్ చేయాలనుకోవటం మొదటే చెప్పుకున్నట్లు ఓపినింగ్స్ పరంగా సేఫ్ గేమే కానీ... ఎంత వద్దనుకున్నా... పోలీక వస్తుంది..తెస్తారు. తెలుగు ప్రేక్షకుల వరకూ ఆ సమస్య లేకపోయినా హిందీ దర్శకుడు డైరక్ట్ చేయటం, ప్రియాంక చోప్రా హీరోయిన్ కావటం తెలుగులో తుఫాన్ అనేది ఓ డబ్బింగ్ చిత్రంగా జనాల్లో నానింది. ఇక జంజీర్ తో పోల్చి చూస్తే... ఆ సినిమా అభిమానులుకు అసలు ఈ సినిమా ఆనదు...అమితాబ్ ఫెరఫార్మెన్స్... ఆ పంచ్ లు ఇందులో కనపడవు. ముఖ్యంగా ఆ సినిమాలో షేర్ ఖాన్ పాత్ర హైలెట్. హీరోకు షేర్ ఖాన్ కు ఉండే రిలేషన్ సినిమాలో కీలకాంశం. అయితే ఈ వెర్షన్ లో అది మిస్సైంది. అలాగే ప్రియాంక చోప్రా,రామ్ చరణ్ ల మధ్య అసలు కెమిస్ట్రీ పండలేదు. ప్రస్తుతం సౌత్ లో నడుస్తున్న ట్రెడ్ అయిన ఫన్ ఎలిమెంట్స్ లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా సినిమా కథ ఇప్పటికే చాలా సార్లు తెలుగు తెరపై చూసిందే...(జంజీర్ ఆ రేంజిలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మేకర్స్ ని ప్రేరేపిస్తూనే ఉంది మరి)కావటంతో తర్వాత ఏం జరుగుతుందో ఊహకు అందుతూంటుంది. దాంతో చాలా సీన్స్ లో పాయింట్ ఆఫ్ ఇంట్రస్ట్ కొరవడింది.

    మిగతా రివ్యూ.... స్లైడ్ షోలో...

    ఫెరఫార్మెన్స్ ...

    ఫెరఫార్మెన్స్ ...

    సినిమాలో హైలెట్ గా చెప్పుకోవాల్సింది....రామ్ చరణ్ ఫెరఫార్మెన్స్. తన సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, ప్రియాంక చోప్రాలకు సైతం సవాల్ విసిరేలా ఈ పాత్రని పోషించాడు. కొన్ని చోట్ల తేలిపోయినా ...యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పాత్రలో లీనమయ్యి చేసాడు. పవన్ ఫుల్ పోలీస్ గా చరణ్ లుక్ కూడా బాగుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రామ్ చరణ్ కి ఈ చిత్రం మంచి ఎంపికే. అయితే ఓ కండీషన్ ...అమితాబ్ తో రామ్ చరణ్ ని పోల్చి చూడకూడదు.

    ప్రియాంక చోప్రా...

    ప్రియాంక చోప్రా...

    బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ప్రియాంక చోప్రా... ఈ సినిమాలో తనేంటో మరో సారి ప్రూవ్ చేసుకుంది. అయితే హీరో తో రొమాన్స్ సీన్స్ లో కెమిస్ట్రీ మాత్రం పండలేదు. ఎన్నారై గా..ఓ సాక్షి గా హీరోకు సహకరించే అమ్మాయిగా తన పాత్రను వంకపెట్టని విధంగా చేసుకుంటూ పోయింది. ‘ముంబై కె హీరో', ‘పింకీ' పాటల్లో ప్రియాంక చాలా హాట్ గా కనిపించింది.

    షేర్ ఖాన్ గా..

    షేర్ ఖాన్ గా..

    శ్రీ హరి షేర్ ఖాన్ పాత్రలో చాలా బాగా సరిపోయాడు. కానీ... ఒరిజనల్ జంజీర్ లో ఉన్న ఇంటెన్సిటి షేర్ ఖాన్ తో ఉన్న సీన్స్ లో ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. డేరింగ్ క్రైమ్ రిపోర్టర్ పాత్రలో తనికెళ్ళ భరణి చాలా బాగుంది.

    డైరక్టర్...

    డైరక్టర్...

    ఈ చిత్రం ఫాస్ట్ పేస్ తో నడపటం దర్శకుడుగా అపూర్వ లఖియా చేసిన తెలివైన పని...ఎక్కడా లాగ్ లేకుండా సీన్స్ పరుగెట్టడంతో ఇబ్బంది కలగకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇప్పుడున్న టెక్నాలిజీని అయితే వాడుకోగలిగాడు కానీ ఒరిజనల్ లో ఉన్న ఎమోషన్స్ ని పట్టుకోలేకపోయాడు...ఓ రకంగా సోల్ ని మిస్సయ్యాడనే చెప్పాలి. దర్శకుడుగా జస్ట్ ఓకే అనిపించుకున్నాడు.

    ప్రకాష్ రాజ్..

    ప్రకాష్ రాజ్..

    ఆయిల్ మాఫియా హెడ్ గా... మాఫియా డాన్ రుద్ర ప్రతాప్ తేజ పాత్రలో ప్రకాష్ రాజ్ కూల్ గా చాలా బాగా చేసారు. అయితే తెలుగులో అలాంటి పాత్రలు గతంలో చేసినవే కావటంతో మనకు పెద్దగా అనిపించదు కానీ బాలీవుడ్ కి ఆ క్యారెక్టరైజన్ లో ప్రకాష్ రాజ్ పండించే ఎమోషన్స్ నచ్చే అవకాసం ఉంది. అలాగే మోన పాత్రలో మహీ గిల్ కూడా బాగా చేసింది. వారిద్దరి మధ్యా వచ్చే సీన్స్ బి, సి సెంటర్ కోసం ప్లాన్ చేసినట్లున్నారు.

    స్క్రీన్ ప్లే...

    స్క్రీన్ ప్లే...

    మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమా స్ట్రైయిట్ సినిమా అనుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఒరిజినల్ ‘జంజీర్' తో పోల్చుకుంటే స్క్రీన్ ప్లే తేలిపోయినట్లుంది. అందులోనూ కథ,కథనం ఎన్నో సార్లు అనేక భాషల్లో మనం చూసేసిందే అవటం మైనస్.

    పాటలు..

    పాటలు..

    సినిమాలో పాటలు ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ‘ముంబై కె హీరో సాంగ్' సినిమాలో కలవలేదు. అయితే స్టైల్గా షూట్ చేసిన సినిమా టైటిల్స్ సాంగ్ లో మహి గిల్ తన అందాలతో బాగా ఆకట్టుకుంది.

    టెక్నికల్...

    టెక్నికల్...

    టెక్నికల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న అపూర్వ లఖియా... ఈ చిత్రం కోసం అంత స్ధాయిలో టెక్నికల్ గా జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. కెమెరా,ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..కానీ గొప్పగా ఉండదు. అలాగే సంగీతం కూడా మైనస్.. మన తెలుగు నేటివిటికి తగ్గ సంగీతం కాకపోవటం కూడా మనకు నచ్చకపోవటం ఓ కారణం కావచ్చు.

    బాలీవుడ్ ఎంట్రీ...

    బాలీవుడ్ ఎంట్రీ...

    ఇది రామ్ చరణ్ కి సరైన సక్సెస్ ఫుల్ బాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. అలాగే దర్శకుడు కూడా గతంలో వచ్చిన రీమేక్స్ షోలే, అగ్నిపథ్ లా కాకుండా తన దైన మార్క్ చూపిస్తూ...స్క్రిప్టు మార్చి చేయటంతో కొంత వరకూ ఉపకరించింది. ఇక రామ్ చరణ్ నెక్ట్స్ సెలెక్ట్ చేసుకునే చిత్రాలను బట్టి.. అక్కడ అతని కెరీర్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది.

    టీమ్...

    టీమ్...

    బ్యానర్ : అదై మెహ్రా ప్రొడక్షన్స్, రామ్‌తేజ్ మోషన్ పిక్చర్స్, ఫ్లైయింగ్ టర్టిల్స్
    నటీనటులు : రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, శ్రీ హరి,తణికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్ తదితరులు
    సంగీతం : చిరంతన్ భట్ - ఆనంద్ రాజ్ ఆనంద్ - మీట్ బ్రోస్ అంజన్
    స్క్రీన్ ప్లే , దర్శకుడు : అపూర్వ లఖియా
    నిర్మాతలు : పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా
    సమర్పణ : రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్
    విడుదల తేదీ : 06 సెప్టెంబర్ 2013

    ఫైనల్ గా జంజీర్ రీమేక్ వంటివి గుర్తు పెట్టుకోకుండా..ఓ ప్రెష్ ఫిలిం చూసినట్లు ఈ చిత్రాన్ని చూస్తే ఫరవాలేదనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ ..యంగ్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా చేసిన నటన గురించి కూడా ఓ లుక్కేయవచ్చు..ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్కువ నిరాసకు గురి అవుతారు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Ram Charan Teja's latest outing Thoofan, which is simultaneously made in Hindi, is a remake of 1973 Hindi action-thriller film Zanjeer relesed today with positive note. Set in the backdrop of oil mafia, the movie revolves around the life of a police office, who takes revenge against the brutal murderers of his family. Ram Charan and Priyanka Chopra are essaying the roles of Amitabh and Jaya Bachchan portrayed in the original.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X