For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను-రొటీన్ ( 'నేను- శైలజ' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  గతంలో చాలా పొరపాట్లు జరిగాయి....ఈసారి వాటిని రిపీట్ కానివ్వండా జాగ్రత్తపడ్డాం ..అని దర్శక,నిర్మాతలు లేదా హీరో కొత్త సినిమా మొదలెట్టినప్పుడల్లా చెప్పటం..దాంతో ఈ సారి ఏదో అద్బుతం జరుగుతుందని ఎదురుచూడటం...సినిమా చూసాక వాళ్లు చెప్పింది నిజమే...ఈసారి పాతవి లేవు కానీ కొత్త పొరపాట్లు దొర్లాయి అనుకోవటం రొటీన్ అయ్యిపోయింది. కొత్త కథతో, చాలా సహజత్వంతో వచ్చానని రామ్ ...తన గత చిత్రాలు రొటీన్ వి కొట్టిపారేస్తూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా చూసాక...అది రొటీన్ డైలాగులో భాగంగా చెప్పాడే కానీ రొటీన్ కథను మాత్రం వదలలేదని స్పష్టమవుతుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఓ సుఖం ఉంది. నెక్ట్స్ సీన్ ఫలానాది అని మీరు ఊహించనవి అన్నీ అక్షరాలా జరిగి..మీరూ ఓ సినిమా కథకుడు అవ్వచ్చు అనే ధైర్యాన్ని ఈ సినిమా ఇస్తుంది. అయితే రొటీన్ సినిమాలకు పరమ రొటీన్ గా అలవాటు పడినవాళ్లకు రొటీన్ గా ఫరవాలేదు ..బాగుంది అనిపించినా ఆశ్చర్యంలేదు. అయితే ఈ సినిమాని మాత్రం రామ్...తన ఫెరఫార్మెన్స్ తో భుజాలపై పూర్తిగా వేసుకుని మోసే ప్రయత్నం చేసాడనే చెప్పాలి.

  హరి(రామ్) కి చిన్నప్పటినుంచీ కనపడ్డ అమ్మాయికల్లా ప్రపోజ్ చేయటం..నో చెప్పించుకోవటం అలవాటే. ఇలా రొటీన్ గా నో చెప్పించుకుంటున్న హరికి అదే ఊళ్లో ఉంటున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెను చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన హరి...తర్వాత అతని కుటుంబం వేరే ఊరికి షిప్ట్ అవటంతో దూరం అవుతాడు. ఈ మనసంతా నువ్వే లవ్ స్టోరీ ...వీళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ మొదలవుతుంది. పెరిగి పెద్దైన శైలజ (కీర్తి సురేష్) అతనికి అనుకోకుండా కనిపిస్తుంది. ఆమెను పరిచయం చేసుకుని, ఇంప్రెస్ చేసి, ట్రై చేసి ప్రపోజ్ చేస్తాడు. అయితే శైలజ...ఐ లవ్ యు..బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ లవ్ యు అని కన్ఫూజ్ డైలాగు చెప్పి..దూరం అయిపోతుంది. ఆమె అలా ఎందుకు హరికి కన్ఫూజ్ డైలాగు చెప్పింది. ఆమెకు ఏదన్నా సమస్య ఉందా...ఉంటే హరి దాన్ని ఎలా తీర్చాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు అనే విషయాలుతెలియాలంటే...ఈ హరి కథ మీరు తెరపై చూడాల్సిందే.

  ఈ సినిమా రొటీన్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే...ఇప్పటికే హీరో తన ప్రేమను కాదని కుటుంబం కోసం వెళ్లి వేరే వ్యక్తిని చేసుకోవటానికి సిద్దపడిన హీరోయిన్ కోసం..ఆమె ఇంటికి ..వేరే వ్యక్తిలా మారు పేరుతో వెల్లి అక్కడవారందరినీ తన తెలివి తేటలు, చేష్టలతో మెప్పించి, అక్కడ సమస్యలను ఒంటి చేత్తో తీర్చేయటం... చాలా సార్లు చూసేసాం. ఇప్పుడు ఈ సినిమా సెంకండాఫ్ లోనూ అక్షరాలా అదే జరిగింది. దాంతో ..ఈ సినిమా చూస్తూంటే.. డీడీ ఎల్ జే, మనసంతా నువ్వే, సోలో, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా అంటూ వరస పెట్టి సినిమాలుప గుర్తు రావటమే కాక ఆ సీన్స్ తెరపై కనపడుతూంటాయి. సరే తెలుగు సినిమాకు అదీ రామ్ లాంటి హీరోకు ఇంతకు మించిన కథ ఏం దొరుకుతుంది అని ఎడ్జెస్ట్ అయ్యి చూద్దామన్నా, స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్ గా ఆ సినిమాల్లో జరుగుతున్నట్లే ఆ సినిమాలన్నీ దగ్గరపెట్టుకుని రాసినట్లుంది.

  సినిమా స్క్రీన్ ప్లే లో కాంఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయటంలోనే దర్శకుడు విఫలమయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ల లవ్ స్టోరీలో కాంప్లిక్ట్ ఇంటర్వెల్ కు వస్తే...ఆ కాంప్లిక్ట్ కి కారణం ఏమిటి అనేది సెకండాఫ్ సగం దాకా అర్దం కాదు. విలన్ ని అయితే కేవలం ఫైట్స్ కోసమే పెట్టారని, కథకు కొంచెం కూడా సంభంధం లేదని స్పష్టమవుతుంది. సినిమా ప్రారంభం రోజునుంచి పదే పదే సహజంగా ఈ సినిమా తీసాం అని చెప్పిన టీమ్...ఫైట్స్ కూడా సహజత్వంలో భాగం అనుకోవాలమో.

  మిగతా రివ్యూ ...స్లైడ్ షోలో...

  పేలాయి..

  పేలాయి..

  ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్ ఏమిటీ అంటే కిషోర్ తిరుమల రాసిన డైలాగ్స్. దర్శకుడుగా కన్నా డైలాగు రైటర్ గా కిషోర్ తిరుమల సినిమాకు న్యాయం చేసాడనే చెప్పాలి. చాలా చోట్ల డైలాగులు బాగా పేలాయి.

  అదే దెబ్బ

  అదే దెబ్బ

  ఫస్టాఫ్ కన్ఫూజ్ ఉన్నా ఫ్రెష్ ఫీల్ తో ఉన్నా..సెకండాఫ్ రొట్ట కొట్టుడు రొటీన్ ట్రాక్ లో కి వెళ్లిపోయింది. దాంతో ఈ సినిమా గతంలో చూసిందే కదా అని ఆవలింతలు వచ్చేసాయి.

  ఐడియా అదుర్స్

  ఐడియా అదుర్స్

  వంశీ సినిమాల్లో విలన్ పాత్రధారుల చేత కామెడీ చేయించినట్లు..ఈ సినిమాలో విలన్ గా ప్రతీసారి కన్పించే ప్రదీప్ రావత్ చేత చేయించిన కామెడీ బాగా పండింది.

  ఈ డిపార్టమెంట్ కేక

  ఈ డిపార్టమెంట్ కేక

  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆల్బం మేజర్ ఎస్సెట్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా శైలజా..శైలజా..నువ్వెందుకు మారావు..శైలజా అనేది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయ్యింది.రొటీన్ సీన్స్ ను కూడా ఏదో ఉంది అనిపించేలా చేసింది.

  తమిళ వాసన

  తమిళ వాసన

  విలేజ్ సీన్స్ ఓవర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోషన్ తో కన్సీవ్ చేయటం.. తమిళ సినిమాలను గుర్తు చేస్తే ..సత్యరాజ్ ఉండే ఎపిసోడ్స్ చూస్తూంటే ఏదో తమిళ డబ్బింగ్ సినిమా ని చూస్తున్న ఫీల్ తీసుకు వచ్చాయి.

  రామ్ ఓకే కానీ...

  రామ్ ఓకే కానీ...

  రామ్ రొటీన్ కమర్షియల్ సినిమా స్టైల్ నుంచి బయిటపడి నటిస్తే..హీరోయిన్ మాత్రం చాలా సీన్స్ లో ఎనీ ఎమోషన్ సింగిల్ రియాక్షన్ అన్నట్లు చూస్తూండిపోయింది.

  టెక్నికల్ గా...

  టెక్నికల్ గా...

  సమీర్ రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు రిచ్ లుక్ తెస్తే... ఆర్ట్ డిపార్టమెంట్ అందం తీసుకువచ్చింది. ఎడిటింగ్ ఫస్టాఫ్ ...షార్ప్ గా ఉంటే..సెకండాఫ్..ఏదో అయ్యిందనిపించారు.

  ఎవరెవరు

  ఎవరెవరు

  బ్యానర్ :స్రవంతి రవికిషోర్
  నటీనటులు: రామ్, కీర్తి సురేష్ ,సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు
  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్,
  డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్ రక్షిత్, రఘు,
  ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్,
  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
  ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్,
  కెమెరా: సమీర్‌రెడ్డి,
  సంగీతం: దేవిశ్రీప్రసాద్,
  సమర్పణ :కృష్ణచైతన్య,
  రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.
  నిర్మాత: స్రవంతి రవికిషోర్
  విడుదల : జనవరి 1, 2015.

  ఫైనల్ గా... రామ్ గత చిత్రాలు పండుగ చేస్కో, మసాల, శివమ్ ల కన్నా బెస్ట్ సినిమా. ముఖ్యంగా రొటీన్ సినిమాలు ఇష్టపడేవారికి ఎప్పుడు సినిమాని అప్పుడే మర్చిపోయి...ప్రతీ సినిమాను కొత్తగా ఫీలయ్యే వారికి బాగా నచ్చే సినిమా ఇది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Ram's Nenu Sailaja under Kishore Tirumala's direction released today with average talk. Movie breaks no fresh ground in the theme ,but remarkably comical at others.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X