»   » మామయ్యగారింటికి దారేది (“పండగ చేస్కో” రివ్యూ)

మామయ్యగారింటికి దారేది (“పండగ చేస్కో” రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

'అత్తారింటికి దారేది' నకలలు వర్షం ఇప్పుడు టాలీవుడ్ లో వరసగా కురుస్తోంది. మొన్న పవన్ ని ఆరాధించే నితిన్ ...'చిన్నదాన నీ కోసం' అంటూ ఓ వెర్షన్ తో దిగితే ఈ సారి పవన్ ని అనుకరించే రామ్...ఇంకో వెర్షన్ తో థియోటర్స్ కు వచ్చాడు. అయితే జనం 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని మొదట్లో ధియోటర్ లలో తర్వాత ఇప్పుడు హోమ్ థియోటర్లు (టీవి ఛానెల్స్ తో )లలో కంటిన్యూగా ఇంకా చూస్తున్నారు. వారికి ఒరిజనల్ దొరుకుతూండగా ఈ నకలలు పంచే కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటున్నారో అర్దం కాదు.


తాతకు ఇచ్చిన మాట కోసం 'అత్తారింటికి దారేది' లో అత్త ని ఒప్పించే పని హీరో చేస్తే...ఇప్పుడు ఈ "పండుగ చేస్కో" లో ...తల్లికి ఇచ్చిన మాట కోసం...మేనమామను ఒప్పించే కార్యక్రమం పెట్టుకున్నాడు. చివరకు క్లైమాక్స్ లో డైలాగులు చెప్పేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నాడంటే ఏం చెప్పుకోవాలి. కొంతలో కొంత బ్రహ్మానందం ఉన్నాడు కాబట్టి అప్పడప్పుడూ ఏదో కాస్సేపు నవ్వుకోవటం తప్పించి మిగతాదంతా రిపీట్ సీన్లతో, ప్రెడిక్టుబుల్ ఫ్లాష్ బ్యాక్ లతో, పంచ్ లేని పంచ్ డైలాగులతో సాగి విసిగించింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఎన్నారై...కార్తీక్ (రామ్) చాలా తెలివైనవాడు..స్వశక్తితో ఎదిగినవాడు...కమర్షియల్ మైండ్ ఉన్నవాడు..ఎలాంటి సమస్యను అయినా చిటికెలో పరిష్కారం చూపగలవాడు....ముఖ్యంగా పేద్ద బిజినెస్ మ్యాన్...మిలియనీర్. ఇలా బోల్డ్ లక్షణాల...అంతులేని ఆస్దితో విరసిల్లే లోకల్ గా ఉండే బిజినెస్ వుమెన్ అనుష్క (సోనాల్ చౌహన్) ని పెళ్లి చేసుకుని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటాడు. అందుకోసం ఆమెను ఎప్రోచ్ అయ్యి...ఎంగేజ్ మెంట్ సైతం చేసుకుంటాడు. అయితే ఈ లోగా అతను ఇండియా వెల్లాల్సిన అర్జెంట్ పని ఏర్పడుతుంది. ఎందుకయ్యా అంటే ఇండియాలో ఉండే హీరోయిన్... దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) అతని ఫ్యాక్టరీమీద పొల్యూషన్ కేసు వేస్తుంది.


ఇంతకీ దివ్య ఏం చేస్తుంది అంటే గో గ్రీన్..గ్రీన్ ఆర్మీ అంటూ మొక్కలు,కాలష్యం గురించి ఉద్యమాలు గట్రా చేస్తూంది. అయితే ఆమెకో కుటుంబ సమస్య ఉంటుంది. మేనమామ సాయిరెడ్డి (సాయికుమార్),తండ్రి భూపతి(సంపత్) కు ఉన్న కక్షలు మధ్య నలిగిపోతూంటుంది. ఈ క్రమంలో...మన హీరో గారు ఇండియాకు రావటం...ఆమెను కలవటం..కొన్ని అనుకోని పరిస్దితుల్లో ఆమె కుటుంబంలో ఉన్న గొడవలు తీర్చి , చక్కదిద్ది...ఆమె చేయి పట్టుకోవాలని నిర్ణయించుకోవటం జరుగుతాయి. ఈ లోగా అసలు కార్తీక్ ఎవరో ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ దివ్య కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి... కార్తీక్ ఎవరూ...దివ్య కేసు విత్ డ్రా చేసుకుందా...హీరో...మొదట పెళ్లి చేసుకుందామనుకున్న అనుష్క పరిస్దితి ఏమిటి.. వీకెండ్ వెంకట్రావు పాత్రలో కనిపించిన బ్రహ్మానందం రోల్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా ఓపికగా చివరి దాకా చూడాల్సిందే.


ఏ పాత్ర అయినా మన హీరోలు ఒకేలా చేస్తూంటారని మన తెలుగు సినిమాలపై విమర్శ ఉంది. ఇప్పుడు ఏ హీరో అయినా ఒకే కథ చేస్తాడు అన్నట్లు తయారైంది. తను గతంలో చేసి, ట్రెండ్ సెట్టర్ గా నిలిపిన రెడీ కథనే కొద్దిగా మార్చి, అందులో అత్తారింటికి దారేది కలిపి చేయాలనే ఆలోచన రామ్ కు వచ్చినందుకు మొదట ఆశ్చర్యం వేస్తూంటుంది. పోనీ అదీ సవ్యంగా చేసారా అంటే అదీ కనపడదు..తెలుగులో హిట్టైన సినిమాల్లోని.... అన్ని ఎలిమెంట్స్ తీసుకువచ్చి ఇందులో కలిపేసి తిరగమొత పెట్టే పనిచేసారు. దాంతో ప్రతీ సీన్ ఎక్కడో చూసినట్లు...ప్రతీ డైలాగు ఎక్కడో విన్నట్లు (తమన్ పాటలు ఎలాగో ఎప్పుడో విన్నట్లు ఉంటాయనుకోండి)కిచిడీలాగ తయారైంది. హీరో సేఫ్ జోన్ కోసం చేసిన ప్రయత్నం...చూసేవాడికి సేఫ్ జోన్ లోంచి ప్రక్కకు జారిన ఫీలింగ్ తీసుకువచ్చింది. దర్శకుడు సైతం తన ప్రతిభను ఈ కథతో ఏమీ చూపలేక ...డల్ గా ,ఫ్లాట్ గా ఫ్రేమ్ లు పేర్చుకుంటూ సీన్స్ తీస్తూ పోయాడు.


ముఖ్యంగా సినిమాలో హీరో ది చాలా ప్యాసివ్ పాత్ర. అతను చేసేదేమి లేదు. చాలా సీన్లలో హీరో లేకపోతే బాగోదని ఎంట్రీ ఇచ్చినట్లు ఉంది. అలాగే..విలన్ ని కూడా కామెడీగా తేల్చేయటం తో ...సినిమాలో పట్టు లేకుండా పోయింది. హీరోకు సమస్య లు ఏమీ బలంగా లేవు.. ఓ నాలుగు మాటలు చెప్తే సెట్ అయ్యిపోయేటట్లు ఉంటాయి. ఇంతోటి దానికి ఇంత నాటకాలు ఆడటం ఎందుకు అనిపిస్తూంటుంది.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ....


హైలెట్స్

హైలెట్స్

ఈ సినిమాలో ఉన్నంతలో బాగున్నది ఏదీ అంటే...వీకెండ్ వెంకట్రావు గా బ్రహ్మానందం కామీడీ..ఓ అద్బుతం అని చెప్పలేం కానీ ఈ సినిమాకు అదే రిలీఫ్ పాయింట్


రెండో హైలెట్

రెండో హైలెట్

చిత్రం ఏమిటీ అంటే రామ్ వస్తున్నప్పుడు జనాల స్పందన పెద్దగా లేదు కానీ రకుల్ ప్రీతి సింగ్ కనపడినప్పుడల్లా ధియోటర్ లో రెస్పాన్స్ బాగుంది. ఆమె ఈ సినిమాకు కొంతలో కొంత కాపు కాసిందనే చెప్పాలి


పెద్ద మైనస్

పెద్ద మైనస్

ఈ సినిమాకు పెద్ద మైనస్ ..కథ ..కథనం అనే చెప్పాలి. అరిగిపోయిన కథనే మళ్లీ రుద్దాలని ప్రయత్నించారు. దేనికైనా రెడీ చిత్రం లో తరహా సెంటిమెంట్ ని పోసారు కానీ వర్కవుట్ కాలేదు. పోనీ స్క్రీన్ ప్లే అయినా ఆ అతుకులను సరిగ్గా కుట్టారా అంటే అదీ లేదు


డైలాగ్స్

డైలాగ్స్

అది క్యారమ్ బోర్డ్ లో కాయిన్ లాంటిది..ఎవరేసినా పడిపోతుంది. నమ్మకానికి అమ్మలాంటివాడ్ని, ఈ కార్తీక్ గాడు భూమి మీద కన్నా మాట మీదే ఎక్కువ నిలబడతాడు లాంటి డైలాగులు బాగానే పేలాయి.


కామెడీ

కామెడీ

ఈ చిత్రం ట్రైలర్లు, పోస్టర్స్ చూసిన వారికి కామెడీ భీబత్సంగా ఉందనే ఫీల్ వస్తుంది. అయితే బ్రహ్మానందం కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎమ్.ఎస్ నారాయణ గారికి పెద్దగా నవ్వించలేకపోయింది. చివర్లో వచ్చే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్యారెడీ... ఎందుకు పెట్టారో దర్శకుడుకే తెలియాలి. అదేదో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నట్లు సీన్లు ఫిలప్ చేయటానికే పెట్టినట్లుంది.


పాటలు

పాటలు

తమన్ ఎప్పటిలాగే వినిపించిన పాటలనే మరోసారి ఈ సినిమాలో వినిపించాడు.అయినప్పటికీ రెండు పాటలు బాగున్నాయనిపిస్తాయి. అయితే నేఫధ్య సంగీతం బాగుంది.


సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

లెంగ్త్ ని అంత భరించలేము అని ఫీలైనప్పుడు ఎడిటర్ మీద కోపం వస్తుంది. ముఖ్యంగా రిపీటెడ్ సీన్లను ఎఁదుకు తొలిగించలేదా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి మాత్రం బాగుంది.


ఎవరెవరు...

ఎవరెవరు...

బ్యానర్: యునైటెడ్ మూవీస్
నటీనటులు :రామ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు
కథ: వెలిగొండ శ్రీనివాస్‌,
మాటలు: కోన వెంకట్‌,
రచన సహకారం: అనిల్‌ రావిపూడి,
కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌,
సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం :గోపీచంద్ మలినేని
నిర్మాత: పరుచూరి ప్రసాద్
విడుదల తేదీ :29, మే 2015.ఫైనల్ గా... గతంలో రెడి, అత్తారింటికి దారేది, కందిరీగ చిత్రాలు లేదా ఆ ఫార్మెట్ లో వచ్చినవి... చూడని వారికి అంటే ఓ పదేళ్ల క్రిందటే తెలుగు సినిమాలు చూడటం ఆపేసిన వారికి ఈ సినిమా ఫ్రెష్ గా చూస్తే నచ్చే అవకాసం ఉంది. లేకపోతే ఎక్కడో చూసినట్లు..లేదా మనకే తెరపై రాబోయే సీన్లు ఏంటో తెలిసిపోయి...మనం సినిమాలకు కథలు రాసేద్దామనే ధైర్యాన్ని ఇస్తుంది. బ్రహ్మానందం అభిమానులు అయితే ఆయన పాత్ర కోసం మిగతాదంతా ఎవాయిడ్ చేసి చూసి రావచ్చు.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
"Pandaga Chesko", which is released today with divide talk. It is a romantic comedy entertainer starring Ram, Rakul Preet Singh and Sonal Chauhan in the lead roles. Ram, who has failed to impress the viewers with his last outings such as "Ongole Githa" and "Masala", is desperate to make the this movie a hit.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu