»   » కొత్తదనం కోసం పడలేదు రాజీ ... ( 'ఘాజీ' రివ్యూ)

కొత్తదనం కోసం పడలేదు రాజీ ... ( 'ఘాజీ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

దేశభక్తి మీద మనకు తెలుగులో వచ్చిన సినిమాలు వేళ్లమీద లెక్క కట్టవచ్చు. దేశభక్తి అనేది కమర్షియల్ ఎలిమెంట్ కాదనో, పే ఆఫ్ కాదనో పెద్దగా పట్టించుకోరు. అయితే అన్ని అల్లూరి సీతారామరాజులు కాకపోవచ్చేమో కానీ,ఖచ్చితంగా విభిన్నమైన చిత్రాలు వస్తే ఆదరిస్తారు అన్న ఆలోచన దర్శక,నిర్మాతలకు వచ్చినప్పుడు ఇలాంటి సినిమాలు రూపొందుతాయి.

బడ్జెట్ పరంగానే కాక, కష్టం పరంగానూ కూడా ఈ తరహా సినిమాలు రూపొందించటం కష్టం. అందలోనూ ఇండియా - పాకిస్థాన్‌ యుద్ధంలో మరో కోణాన్ని.. చరిత్ర మరిచిన సత్యాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చేయాలనుకోవంట మాటలు కాదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, వర్కవుట్ కాదేమో అనే ఆలోచన మొదట వస్తుంది.

ఇంత కష్టపడి చేసినా ...ఈ 'ఘాజీ' ఎవరికి నచ్చుతుంది? అని పెదవి విరిచే వాళ్లు ఉంటారు. అయితే ఈ సవాళ్లు అన్నిటినీ ఎదుర్కొనేందుకు... ఓ కొత్త డైరక్టర్ తన తొలి చిత్రంగా ఇలాంటి చిత్రం అదీ తెలుగులో చెయ్యాలనుకోవటం ఆశ్చర్యమే.

ఈ వీకెండ్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న చిత్రం రానా దగ్గుబాటి నటించిన 'ఘాజి'. ఇండియా - పాక్ ల మధ్య నడిచిన వాస్తవ యుద్ధ కథనం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఎక్కువైంది. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం కు ఇప్పటికే స్పెషల్ షోలు మీడియాకు వేసారు. ఈ నేపధ్యంలో చిత్రం టాక్, కథ మీకు అందిస్తున్నాం.

 ఇదో సబ్ మెరైన్

ఇదో సబ్ మెరైన్

1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే వాటర్ వార్ ఈ కథ. పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి' అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి.

 ముందు దాన్ని కూల్చాలి

ముందు దాన్ని కూల్చాలి


కానీ ‘ఘాజి' బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి వెళ్లే మధ్య దారిలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు.

 ఇంటిలిజెన్స్ ద్వారా తెలుసుకుని

ఇంటిలిజెన్స్ ద్వారా తెలుసుకుని

కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకొన్న భారతీయ నేవీ భారతీయ జలాంతర్గామి ఎస్21 ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి' ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందులో భాగాంగానే విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది.

 18 రోజుల్లో ..

18 రోజుల్లో ..


అలా ఘాజీ వేస్తున్న ప్లాన్ లను ఇండియా యొక్క ఎస్ 21 ఎలా ఎదుర్కొంది? లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.

 అదే డైరక్టర్ కు ప్లస్ అయ్యింది

అదే డైరక్టర్ కు ప్లస్ అయ్యింది

ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. తరవాతేం జరుగుతుందన్నటెన్షన్ ని ఎస్టాబ్లిష్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. వాస్తవానికి మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా' అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలోనే డైరక్టర్ సక్సెస్ అయ్యారు.

 సరైన ఎమోషన్ లేదు

సరైన ఎమోషన్ లేదు


అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కథకు అవసరమైన ఎమోషన్ ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడనిపిస్తుంది. దీంతో సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి నిరాశే.

 మరింతగా చూపించాలి

మరింతగా చూపించాలి


చివర్లో ...ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజి' ని కూల్చే సన్నివేశాలు ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో లేవు. ఇంకాస్త వివరంగా చూపి ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాగే తాప్సి పాత్రకు ప్రయారిటీ లేదు. ఏదో ఉన్నామంటే ఉందంతే..

 టైట్ స్క్రీన్ ప్లే

టైట్ స్క్రీన్ ప్లే

ఇలాంటి కథలను విజువలైజ్ చేయటం, తెరకెక్కించటం అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యంగా అతి తక్కువ పాత్రలతో.. వార్ సీన్స్ తో అంతసేపు కదలకుండా కూర్చోబెట్టడం.. టైట్ స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది.

 కొత్త కాబట్టి

కొత్త కాబట్టి


అక్కడక్కడ నేవీకి సంబంధించిన టెక్నికల్ పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. అలాగని అవేవీ పెద్దగా ఇబ్బందిని కలిగించవు. అయితే ఇలాంటి సినిమాలు మనకు తక్కువ వస్తూండటంతో... కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. లీనమయ్యేదాకా కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది.

 చాలా గొప్పగా

చాలా గొప్పగా

ఈ సినిమా ఫస్టాఫ్ లో ... ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్స్ గా ఉన్న కేకే మీనన్, రానా ల మధ్య తలెత్తే అభిప్రాయం బేధాలను ఇంట్రస్టింగ్ గా చూపడంలో సక్సెస్ అయ్యారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఇండియన్ నేవీ పని తీరును, వేసిన యుద్ధ ప్రణాళికలను చాలా గొప్పగా చూపించి, శభాష్ అనిపించుకున్నారు దర్శకుడు.

 మెచ్చుకోకుండా ఉండలేం

మెచ్చుకోకుండా ఉండలేం


ఇక కీలకమైన పాత్రల్లో నటించిన రానా, కే కే మీనన్, అతుల్ కులకర్ణి, సత్యదేవ్ లు నటన ఆకట్టుకునేలా సాగింది. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.చెప్పుకునేంత ఏమీ లేదు. అలాగే కృష్ణ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి కొత్తగా చెప్పుకునేదేముంది. దర్శకుడు సంకల్ప్‌ ని మెచ్చుకోకుండా ఉండలేం.

 ఇదే ఈ సినిమా టీమ్

ఇదే ఈ సినిమా టీమ్

నటీనటులు: రానా.. కె.కె.మీనన్‌.. అతుల్‌ కులకర్ణి.. తాప్సి.. ఓంపురి.. నాజర్‌.. సత్యదేవ్‌.. భరత్‌రెడ్డి తదితరులు
సంగీతం: కె
ఛాయాగ్రహణం: మది
కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌
నిర్మాణ సంస్థలు: పీవీపీ సినిమా.. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రచన - దర్శత్వం: సంకల్ప్‌
విడుదల: 17-02-2017

English summary
On the whole, Ghaji is a brilliant film about submarines and war underwater-something we've not seen in Indian cinema so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu