For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆత్మ 'అల్లరి' చేష్టలు.. (రవిబాబు ‘అవును’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా... ఉంటే... తాము ఉంటున్న ఇంట్లోనే అవి తిష్ట వేసుకు కూర్చున్నాయి అని తెలిసిన తర్వాత కూడా హీరో, హీరోయిన్ ఆ ఇంట్లోనే ఎందుకు కంటిన్యూ అవుతున్నారు వంటి సందేహాలు లేకుండా చూస్తే దెయ్యాల సినిమాలు మంచి ఎంటర్టన్మెంట్ నే ఇస్తాయి. ఆ విధంగా చూస్తే తాజాగా హాలీవుడ్ చిత్రం Hollow Man (2000)సీన్ల ప్రేరణతో రవిబాబు సృష్టించిన 'అవును' బావుందనిపిస్తుంది. పూర్తి స్క్రీన్ ప్లే బేసెడ్ గా నడిచిన ఈ చిత్రం ఏ సీన్ కా సీన్ భయపెట్టగలిగింది. అయితే సినిమా మొత్తంగా ఏదో మిస్సైన ఫీలింగ్ తో సంపూర్ణతను ఇవ్వలేకపోయింది.

  పతాకం: ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌
  నటీనటులు: పూర్ణ, హర్షవర్ధన్‌ రాణె, ఎవిఎస్‌ అల్లుడు చక్రవర్తి, భార్గవి, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్‌ గౌరవ్‌ తదితరులు
  ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి
  సంగీతం: శేఖర్ చంద్ర
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిబాబు
  నిర్మాతలు: డి.సురేష్‌బాబు, పి.వి.పి. అధినేత పొట్లూరి వరప్రసాద్‌, రవిబాబు
  విడుదల తేదీ: 21, సెప్టెంబర్ 2012

  కొత్తగా పెళ్లైన మోహిని(పూర్ణ)తో ఆమె భర్త హర్ష(హర్షవర్దన్ రానే) హైదరాబాద్ గండిపేట దగ్గరలో 'క్లాసిక్ హోమ్స్'లో దిగుతాడు. అయితే ఆ ఇంటిలోకి చేరిన దగ్గరనుంచి రకరకాల వింత అనుభవాలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఆమెను ఎవరో వెనక నుంచి గమనిస్తున్నట్లు, తను బట్టలు మార్చుకునేటప్పుడు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు ఫీలవుతూంటుంది. ఈ నేపథ్యంలో చనిపోయిన తన తాతతో మాట్లాడే... ప్రక్కింటి పిల్లాడు విక్కి ద్వారా తమ ఇంట్లో కెప్టెన్ రావు ఆత్మ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ఈలోగా ఈ తల నొప్పులు నుంచి తప్పించుకోవటానికి ప్యారిస్ కు హానీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే అప్పటినుంచి ఆ ఆత్మ లేదా దెయ్యం తన విశ్వరూపం చూపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జంట ఏం చేసింది, ఇంతకీ కెప్టెన్ రావు ఎవరు వంటి విషయాలు తెలసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  డైరక్టర్ రవిబాబు ఎప్పటిలాగే తనదైన శైలిలో మీడియం బడ్జెట్ లో కొత్త తరహా సినిమాను, అదీ పాటలు లేకుండా తెలుగులో అందించాలని ప్రయత్నించారు. అందుకు ఆయన్ని అభినందించాలి. సినిమాలో చాలా భాగం ఒకే ఇంటిలో షూట్ చేసినా ఆ పీల్ రాకుండా కెమెరాతో చేసిన మ్యాజిక్ చాలా సార్లు అబ్బుర పరుస్తుంది. ఇక ఈ సినిమాలో హైలెట్ స్క్రీన్ ప్లే, సీన్స్ ను ఎక్కడా లాగ్ కాకుండా జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లారు. అలాగే సస్పెన్స్ ఎక్కడా సడలకుండా నడిపారు. ముఖ్యంగా ఫస్టాఫ్ రాపిడ్ స్పీడ్ తో నడిచింది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్‌ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు. అయితే సెకండాఫ్ లో సస్పె న్స్ ముడిని విప్పేటప్పుడు ఆ వేగం తగ్గినట్లనిపించింది. ఇలాంటి సినిమాలకు కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఆ రెండు విభాగాల నుంచీ దర్శకుడు మాగ్జిమం లాక్కున్నారు. క్లైమాక్స్ ఊహకు అందకుండా ఉండి ఉంటే ఇంకా బావుండేది. డైలాగ్స్, ఎడిటింగ్ పెరఫెక్ట్ గా కుదిరాయి. రన్ టైమ్ తక్కువ ఉండటం కూడా కలిసి వచ్చింది. నటీనటుల్లో పూర్ణ ఈ సినిమాకు ప్లస్. ఆమే పూర్తిగా సినిమాను మోసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ అని చెప్పవచ్చు. చాలా సీన్స్ లో ఆమె ఎక్సప్రెషన్స్ హైలెట్ గా నిలిచాయి. హర్షవర్దన్ రానే, గాయత్రీ ఓకే. రవిబాబు రెగ్యులర్ గా తన సినిమాల్లో కనిపించినట్లే కనిపించాడు. చలపతిరావు, రాజేశ్వరి ఓకే అనిపించారు.

  మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేస్తూ తీసిన ఈ చిత్రం ఆ వర్గం వారిని ఆకట్టుకునే అవకాశం ఉంది. హర్రర్, థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంటే అని నమ్మి వెళ్లే ప్రేక్షకులకు ఈ సినిమా బాగుందనిపిస్తుంది. అలాగని అదే పనిగా హర్రర్ సినిమాలు చూసే వారికి మాత్రం ఓకే సినిమా అనిపిస్తుంది.

  English summary
  Ravi Babu’s latest thriller Avunu is released today (21 September 2012) with average talk. This film has Poorna and Harshavardhan Rane doing main leads. They do the roles of newly wedding couple moved into a new apartment. Harshavardhan Rane has done a couple of films like Thakita Thakita and Naa ishtam in the past. Poorna made her debut with Allari Naresh’s Seema Tapakai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X