»   » గెలుపు ( 'బలుపు' రివ్యూ)

గెలుపు ( 'బలుపు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

మొదటినుంచీ రవితేజకు ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ తో ఫన్,యాక్షన్ ని నమ్ముకున్నంతకాలం మినిమం సినిమాలు వచ్చాయి. అయితే ఆ బ్రాండ్ ని ప్రక్కన పెట్టి పూర్తి మాస్ హీరోగా చేసిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యీయి. ఈ విషయం అర్దం చేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని మాత్రం పూర్తిగా రవితేజ కోసం టైలర్ మేడ్ సబ్జెక్ట్ తయారుచేసుకుని ...నవ్వులతో థియోటర్ ని చెత్తాడు...రవితేజకూడా ఎనర్జీ లెవల్స్ ని ఓ రేంజిలో మెయింటైన్ చేస్తూ సినిమాని నిలబెట్టాడు.

బెంగుళూరులో బ్యాంక్ రికవరి ఏంజెంట్ గా పనిచేస్తున్న రవి(రవితేజ)..అతని తండ్రి నానాజి (ప్రకాష్ రాజ్)తో కలిసి ఉంటూంటాడు. రవికి ఎలాగైనా పెళ్లి చేయాలని కృతనిశ్చయింతో నానాజి తిరుగుతూంటాడు. మరోప్రక్క శృతి( శృతి హాసన్) తన అంకుల్ క్రేజీ మోహన్(బ్రహ్మానందం)తో క్రేజీ పనులు చేస్తూ అందరినీ ఇబ్బందిపెడుతూ..ఎంజాయి చేస్తూంటుంది. ఆమెకు బుద్ది చెప్పాలని బయిలుదేరిన రవితో ఆమె ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే ఆమెకు రోహిత్(అడవి శేషు)తో వివాహం నిశ్చయమవుతుంది. అది కాదని..ఆమె రవితో వివాహం అనగానే...రోహిత్ తన మేనమామ వైజాగ్ పూర్ణ(అశుతోష్ రానా)తో దిగి వైలెన్స్ సృష్టిస్తాడు. ఈ ప్రాసెస్ లో రవిని,నానాజీని చూసి షాకవుతాడు. ఇంతకీ విలన్స్ ..రవిని చూసి అంత షాకవటానికి కారణం ఏమిటి..రవి గతం ఏమిటి అనేది తెరపైనే చూడాలి.

'నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాల్టికి వెల్తారు. ..అదే కాన్సర్టేట్ చేసి కొడితే కోమా లోకే ' వంటి మాస్ డైలాగులతో వచ్చిన ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్,యాక్షన్ సమపాళ్లలో కుదిరాయనే చెప్పాలి. ఫస్టాఫ్ స్పీడుగా నడిచిపోయినా..సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ బాగా స్లో అయ్యి..లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫస్టాప్ ఒక కథ,సెకండాఫ్ మరో కథ చూసినట్లు అనిపించింది. అయితే పూర్తిగా కామెడీ మీద(బ్రహ్మానందం)మీదే ఆధారపడిపడి దర్శకుడు తెలివిగా లోపాలు కనపడనీయకుండా సర్దేసాడు. అంతేగాక సాధారణంగా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పూర్తవగానే...ఓ ఫైట్ వేసి కథముగించేస్తూంటారు. కానీ ఇక్కడే దర్సకుడు ఆ రొటీన్ నెస్ ని బ్రేక్ చేసి..ఫన్ చేసి..క్లైమాక్స్ ని డిజైన్ చేసాడు...అదే ప్లస్ అయ్యింది. ఈ మధ్య ఐపీఎల్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జంపింగ్‌ జంపాంగ్‌ డాన్స్‌, గంగ్‌నమ్‌ స్టైల్ డాన్స్ ని తెలివిగావాడి నవ్వించారు.

ఇవివి ..'పిల్ల నచ్చింది' ని గుర్తు చేసే..కథగా పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేకపోయినా..ట్రీట్ మెంట్ బాగా చేయటంతో వర్కవుట్ అయ్యింది. దానికి తగ్గట్లు డైలాగులు కూడా చాలా చోట్ల పేలాయి. శృతిహాసన్ గత చిత్రాలలో లాగా కాకుండా సెక్సీ లుక్ తో ఉషారుగా కనిపించింది. అంజలి సోసో గా ఉంది. ప్రకాష్ రాజ్,రవితేజ ఇద్దరూ పోటీ పడి.. తమకిచ్చిన రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించారు. దర్శకుడు కూడా ప్రతీ ఫ్రేమ్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని...ఎక్కడా సైడ్ ట్రాక్ కు కథ పోకుండా జాగ్రత్తలతో నడిపాడు. తమన్ సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా సినిమాకు రిచ్ లుక్ తెచ్చిపెట్టింది. ఎడిటింగ్...సెకండాఫ్..ఫ్లాష్ బ్యాక్ ని మరింత ట్రిమ్ చేసి ఉంటే బాగుండును అనిపించింది.

మిగతా రివ్యూ ... స్లైడ్ షో లో..

'మొక్క ని పెంచుకో నీడ ని ఇస్తుంది... కుక్కని పెంచుకో తోడు ని ఇస్తుంది...పగని పెంచుకోకు ..ప్రాణం పోతుంది. ....,' వంటి డైలాగులు సినిమాకు ప్రాణమై నిలిచాయి. అలాగే బాలకృష్ణని ఇమిటేట్ చేస్తూ... రవితేజ చెప్పిన డైలాగు కూడా బాగా పేలింది.

అంజలి..సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు కానీ సెంటిమెంట్ పండించే సీన్స్ లో మాత్రం బాగా చేసింది. ఆమె అమాయికైన చూపులు..సెంటిమెంట్ తో కూడిన పాత్ర కావటం ..గ్లామర్ లేకపోయినా ఓకే అనిపించాయి.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ..శృతిహాసన్, రవితేజ కెమెస్ట్రీ. అలాగే శృతిహాసన్ గ్లామర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

పాటలు బాగానే ఉన్నా..ప్లెస్ మెంట్ కలిగా లేదు. అలాగే తమన్ ..సంగీతం ఇంతకుముందు విన్న పాటల మాదిరిగానే ఉంది.

ఈ సినిమాలో బ్రహ్మానందం ..సెకండ్ హీరో అనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి..చివరి వరకూ బ్రహ్మానందంమే లీడ్ చేసాడు. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర కూడా సినిమా హైలెట్స్ లో ఒకటి.

బ్రహ్మానందం,రవితేజ,శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు..రవితేజ కిక్ సినిమాలో సీన్స్ లా బాగా నవ్వించాయి.

రవితేజ స్పీడుకు తగినట్లు శృతిహాసన్ కూడా రెచ్చిపోయి చేసింది.

టెక్నికల్ గా ఈ చిత్రం మంచి సౌండ్ గా ఉందనే చెప్పాలి. సినిమా పూర్తి కలర్ ఫుల్ గా ఉంచేందుకు దర్శకుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్దమవుతుంది.

సినిమా కోసం ఎంచుకున్న మెయిన్ స్టొరీ లైన్ ఇప్పటికి మనం చాలా సినిమాల్లో చూసాం కాబట్టి కథా పరంగా చూసుకుంటే పెద్దగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో లాగేసినా సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త ఫ్లో తగ్గింది అలాగే కొన్ని సీన్స్ తో సినిమాని సాగదీశారని చెప్పుకోవాలి.

నటీనటులు : రవితేజ, శృతి హాసన్, అంజలి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు
కథ, మాటలు: కోన వెంకట్
పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల,
ఫైట్స్: స్టన్ శివ,
కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృంద
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
ఎడిటింగ్: గౌతం రాజు,
సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్,
సంగీతం: థమన్,
నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.
విడుదల తేదీ :28/06/2013


ఏదైమైనా బ్రహ్మానందం లేకుండా హిట్ కొట్టలేమని ఈ సినిమా మరో సారి ప్రూవ్ చేసింది. రవితేజకు అయితే కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి. శృతిహాసన్ సైతం ఇక కమర్షియల్ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఈ సినిమా రాజమార్గం వేసింది. సరదాగా ఓ ఎంటర్టైనర్ చూద్దామనుకున్నవారికి మంచి ఆప్షన్.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Balupu is a mass film directed by Gopichand Malineni and produced by Prasad Vara Potluri under PVP Cinemas banner. The first half is pretty fast paced and the viewers are floored with each any every scene. The second half though started off a little slow takes off soon after. There is a scene in the hospital where Ravi Teja talks like Balayya. His dialogues in this scene made the entire theatre rupture with whistles and screeches. Movie stars Ravi Teja, Shruti Haasan and Anjali in lead roles.The film soundtrack is being composed by S. Thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu