For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కంఫర్ట్' తక్కువే ('కిక్‌-2' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  సూపర్ హిట్ 'కిక్‌' చిత్రానికి సీక్వెల్ అనగానే చాలా మటుకు మాంఛి కామెడీ చిత్రం చూడబోతున్నాం అని ఫిక్స్ అవుతాం. అయితే దర్శకుడు మాత్రం అంచనాలకు భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. యాక్షన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కామెడీ డోస్ తగ్గించి ..రొటీన్ సెకండాఫ్ తో కంఫర్ట్ జోన్ లో లాగించేసాడు. తొలి చిత్రంలో 'కిక్‌' అంటూ ఊగిపోయిన రవితేజ ఈ సారి 'కంఫర్ట్' అంటూ కథని లాగే ప్రయత్నం చేసాడు. సెకండాఫ్ లో మరికాస్త ఎంటర్టైన్మెంట్ పెంచి, రన్ టైమ్ తగ్గించి, రవితేజ ను ఇంటర్వెల్ కు అయినా కథలోకి దించి,విలన్ -హీరో మధ్య గేమ్ మొదలెడితే ఈ 'కిక్‌' ఖచ్చితంగా డబుల్ అయ్యేది. రవితేజ బరువు తగ్గి, బాగా సన్నబడి వయస్సు మీదపడినట్లు స్పష్టంగా కనపడుతోంది. రకుల్ ప్రీతి సింగ్ మాత్రం ఆ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం చేసింది.

  రాబిన్ హుడ్ (రవితేజ)కి బాగా చిన్నప్పటి నుంచి అంటే కడుపులో ఉన్నప్పటినుంచీ కంఫర్ట్ గా ఉండటం అంటే ఇష్టం. తొమ్మిదినెలలు లోపల ఏం ఉంటాం అని కంఫర్ట్ కోసం 7వ నెలలోనే బయిటకు వచ్చేసి, తండ్రి కిక్ కు సైతం తన కంఫర్ట్ కోసం చుక్కలు చూపిస్తాడు. అలా తనకు కంఫర్ట్ మిస్సైతే ఎదుటి వాడి మనస్సాంతిని మిస్ చేసే ఈ రాబిన్ హుడ్...అమెరికాలో ఉంటూ హాస్పటిల్ కట్టాలని, అందుకు అవసరమయ్యే డబ్బు కోసం తన వారసత్వ ఆస్ధులు అమ్ముకోవటానికి ఇండియా వస్తాడు. అక్కడ అతనికి చైత్ర(రకుల్ ప్రీతిసింగ్)పరిచయం అవుతుంది. మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఈ లోగా ఆమె కిడ్నాప్ అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ బీహార్ లోని విలాస్ పూర్ అనే విలేజ్ కు వెళ్తాడు. ఆ ప్రాంతాన్ని సోలమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు మున్న(కబీర్ సింగ్) కనుసన్నల్లో ఉంటుంది. అతను జనాలను బానిసలుగా చేసి వాడుకుంటూ ఉంటాడు. తన కంఫర్ట్ కు భంగం రానంతవరకూ ఏ గొడవల్లోకి వెళ్లని రాబిన్ హుడ్ అతనితో తలపడి ఆడుకోవాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ పరిస్ధితిలు ఏమిటి...వాటిని క్రియేట్ చేసిందెవరు..ఇంతకీ చైత్రను కిడ్నాప్ చేసిందెవరు...వీటిన్నిటి వెనక ఉన్న అసలు కథ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఒక సినిమాకు ఫాంచైజ్ లేదా సీక్వెల్ అనేది ఎప్పుడు అంచనాలు పెంచే అంశమే. బిజినెస్ పరంగా ఈ పార్ట్ 2 ఐడియా ఎంత సేఫో, క్రియేటివ్ ఎఫర్ట్స్ విషయంలో అంత రిస్క్ వ్యవహారం. ఆ విధంగా అంచనాలు పెంచి నిరాసపరిచిందీ చిత్రం. అది ప్రక్కన పెడితే... చిత్రంలో హీరో..విలన్ ఎవరో తెలుసుకుని ఢీ కొనే సరికే ఫ్రీ క్లైమాక్స్ మూవ్ మెంట్ వచ్చేసింది. దాంతో హీరో పాత్ర ఏం చేయకుండా చివరిదాకా....యాక్షన్ లోకి దిగకుండా ఎంతసేపూ కంఫర్ట్ అని కూర్చోవటం విసుగు అనిపిస్తుంది. ప్యాసివ్ గా మారి బోర్ కొట్టేస్తుంది.

  ఇక ఈ చిత్రం దాదాపు రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు స్క్రీన్ ప్లే ని గుర్తు చేస్తూ సాగుంది. విక్రమార్కుడు చిత్రంలో చిన్న పాప ద్వారా రవితేజని పోలీసులు స్కెచ్ వేసి రంగంలోకి దింపి విలన్ పైకి వదులుతారు. ఇక్కడ 'కిక్‌-2' లో హీరోయిన్ ద్వారా యాక్షన్ కు దూరంగా ఉండే రవితేజను విలేజ్ వాళ్లు స్కెచ్ వేసి రంగంలోకి దింపి విలన్ పైకి దింపుతారు. అలాగే హాలీవుడ్ బ్లడ్ డైమండ్ చిత్రంలోని విలన్ సెటప్ ఎపిసోడ్ ని గెపట్ ల తో సహా ఎత్తుకొచ్చి వాడారు.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

  ఫస్ట్ హాఫ్ ఓకే...

  ఫస్ట్ హాఫ్ ఓకే...

  సినిమా ఫస్ట్ హాఫ్ బ్రహ్మానందం, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు, రకుల్ తో రొమాంటిక్ సీన్స్ తో నీట్ గా సాగిపోయింది. అయితే సెకండాఫ్ లో ఆశించినంత కిక్ అందలేదు

  అదే ఇబ్బంది

  అదే ఇబ్బంది

  సెకండాఫ్ లో ఎంతసేపు విలేజ్ వాళ్ళతో ఫన్ చేయించాలనే తాపత్రయమే తప్ప హీరోని చివరిదాకాయాక్షన్ లోకి దింపలేదు. దాంతో చివరి వరకూ సహన పరీక్షగా మారింది

  శ్యామ్ ని, కబీర్ సింగ్ నీ

  శ్యామ్ ని, కబీర్ సింగ్ నీ

  సినిమాలో శ్యామ్ పాత్రనీ, కబీర్ సింగ్ పాత్రను అస్సలు వాడుకోలేదు

  ఖలేజా మీట్స్ విక్రమార్కుడు

  ఖలేజా మీట్స్ విక్రమార్కుడు

  సినిమా విక్రమార్కుడు మీట్స్ ఖలేజా అన్నట్లు అనిపిస్తుంది. విలేజ్ సీన్స్ అన్ని ఖలేజాని గుర్తు చేస్తాయి.

  హైలెట్స్

  హైలెట్స్

  రవితేజ ...కంఫర్ట్ క్యారక్టరైజేషన్, గుడి దగ్గర ఫైట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, రవికిషన్ తో ఛాలెంజ్

  రవికిషన్

  రవికిషన్

  రేసుగుర్రంలో విలన్ గా చేసిన రవికిషన్ ఈ సారి మళ్లీ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో విలన్ గా చేసారు. గెటప్,క్యారక్టైరైజేషన్ మెప్పించింది

  పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  సినిమాలో పాటల్లో కిక్ టైటిల్ సాంగ్ సూపర్బ్ గా ఉంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఐటం సాంగ్ కు సైతం రెస్పాన్స్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని బ్లాక్స్ కి ప్రాణం పోసింది

  డైలాగులు,స్క్రీన్ ప్లే

  డైలాగులు,స్క్రీన్ ప్లే

  సినిమాలో డైలాగులు కిక్ ఇవ్వలేదు. అలాగే స్క్రీన్ ప్లే సైతం నీరసంగా,ప్రెడిక్టుబుల్ గా సాగింది.

  ప్రధాన లోపం

  ప్రధాన లోపం

  సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఊహించకుని వెళితే అది పోను పోను బాగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో సగటు ప్రేక్షకుడుకి నీరసం వస్తుంది

   ఎవరెవరు

  ఎవరెవరు

  బ్యానర్ : ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకం
  రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్, రవికిషన్, రాజ్ పాల్ యాదవ్, బ్రహ్మానందం, ఆశిష్ విధ్యార్ది, పోసాని తదితరులు.
  కథ: వక్కంతం వంశీ,
  సంగీతం: యస్‌.యస్‌.థమన్‌,
  కెమెరా: మనోజ్‌ పరమహంస,
  ఎడిటింగ్‌: గౌతంరాజు,
  ఆర్ట్‌: నారాయణరెడ్డి,
  ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.
  నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.
  విడుదల తేదీ: 21-08-2015.

  ఫైనల్ గా...కంపర్ట్ జోన్ లో కిక్ 2 ని నడిపించాలనే ప్రయత్నం ప్రేక్షకుడుకు కంఫర్ట్ లేకుండా చేసింది. రెగ్యులర్ ,రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త కిక్ ఇవ్వని ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ, రవితేజకు కెరీర్ పరంగానూ ఏ మేరకు కిక్ ఇస్తుందో వేచి చూడాలి.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Kick 2 is written by Vakkantham Vamsi and directed by Surender Reddy released today with divide talk. It features Ravi Teja as the protagonist and is the sequel of the 2009 Telugu blockbuster Kick starring Ravi Teja, which was also directed by Surender Reddy. The film is produced by actor Nandamuri Kalyan Ram on N.T.R. Arts banner. The audio soundtrack of the movie was composed by S. Thaman.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X