»   » రొటీన్ మాస్ మూవీ(విశాల్ ‘రాయుడు’ రివ్యూ)

రొటీన్ మాస్ మూవీ(విశాల్ ‘రాయుడు’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: తెలుగులో విశాల్ కు ఇంత గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం అతని కెరీర్ మొదట్లో వచ్చిన 'పందెం కోడి' సినిమానే కారణం. ఈసినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. అప్పటి నుండి స్టార్ హీరోగా ఎదిగేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు... కానీ తాను అనుకున్న స్థాయికి మాత్రం రావడం లేదు. అందుకు కారణం పందెం కోండి రేంజి హిట్స్ కానీ, అంతకు మించిన బ్లాక్ బస్టర్ గానీ విశాల్ కెరీర్లో లేక పోడమే.

ఇక... ఉన్న స్టార్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా కేవలం మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలకే ప్రధాన్యత ఇస్తూ కెరీర్ నెగ్గుకొస్తున్న విశాల్ తాజాగా 'రాయుడు' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు కొచ్చాడు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసారు.

ఈ చిత్రంలో విశాల్ సరసన శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. రాధా రవి, లీలా, సురేష్, సూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇమాన్‌ సంగీతం అందించారు. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రఫీ అందించారు. విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బేనర్లో ఈ సినిమా తెరకెక్కించింది.

కథ విషయానికొస్తే...
రాయుడు (విశాల్) మార్కెట్లో పని చేసే కూలీ. చూడటానికి మొరటోడిలా కనిపించినా తన బామ్మ మంగమ్మ(లీలా) అంటే ప్రాణం. ఆమె ఏ చెబితే అది చేస్తాడు. ఆమో ఓసాసి భాగ్య లక్ష్మి (శ్రీ దివ్య) అనే అమ్మాయిని చూపించి ఆమెను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని సూచిస్తుంది. రాయుడికి కూడా ఆమె బాగా నచ్చడంతో ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో భాగ్య లక్ష్మి ఇబ్బందుల్లో పడుతుంది. ఊళ్లో అరాచకాలు సాగిస్తున్న రోలెక్స్ బాచీ (ఆర్కే సురేష్) రౌడీ రాజకీయ నాయకుడు భైరవ నాయుడి అండతో చెలరేగిపోతుంటాడు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఉన్న అతడు ఓ కేసు విషయంలో తనకు అడ్డుగా ఉన్న భాగ్య లక్ష్మిని చంపుదామని అనుకుంటాడు. భాగ్యలక్ష్మికి రాయుడు అండగా ఉంటాడు. రోలెక్స్ బాచీ భాగ్యలక్ష్మిని చంపేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు? ఆ కేసు సంగతేంటి? రాయుడు బామ్మ ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎందుకు చెబుతుంది? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్..
పెర్పార్మెన్స్ విషయానికొస్తే విశాల్ రాయుడు పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్ సీన్ల విషయంలో విశాల్ మరోసారి తన సత్తా చాటాడు. ఫుల్ మాస్ గెటప్ లో పెర్ ఫెక్టుగా చేసాడు. పాత్రకు తగిన విధంగా లుక్, ఫిజిక్ పరంగా విశాల్ ఆకట్టుకున్నాడు. శ్రీదివ్య చక్కగా అందంగా కనిపించడంతో పాటు తన పాత్రకు తగిన విధంగా బాగా నటించింది. బామ్మ మంగమ్మ పాత్రలో లీలా ఆకట్టుకుంది. రెలెక్స్ బాచీ పాత్రలో ఆర్కే సురేష్ పాత్రకు తగిన విధంగా క్రూరంగా నటించాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసాడు.

టెక్నికల్....
టెక్నికల్ అంశాల పరంగా చూస్తు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుండేది. యాక్షన్ సీన్స్ మాస్ జనాలను బాగా ఆకట్టుకుంటాయి. సంగీతం యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరిపోయే విధంగా ఓకే అనేలా ఉన్నాయి.

రోటీన్

రోటీన్


విశాల్ ఎప్పటి లాగే రొటీన్ కమర్షియల్ మలాను ఈ సినిమాలో చూపించాడు. సినిమాలో చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. రోటీ మాస్ ఎంటర్టెనర్. ఇలాంటి కథలు మనకు కొత్తేమీ కాదు. కేవలం బి, సి సెంటర్ల ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.

తెలుగులో కష్టమే

తెలుగులో కష్టమే


ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కడం కాస్త కష్టమే. ఎందుకంటే సినిమా మొత్తం తమిళ నేటివికి అద్దంపట్టేలా ఉంది...తెలుగు వాతావరణానికి చాలా దూరంగా ఉంది.

వినోదం లేదు

వినోదం లేదు


పైగా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే వినోదాత్మక అంశాలు సినిమాలో పెద్దగా ప్రధాన్యం ఇవ్వలేదు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

మాస్ యాక్షన్

మాస్ యాక్షన్


మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

English summary
Director Muthiah's Telugu movie "Rayudu," featuring Vishal Krishna and Sri Divya in the lead roles, received mixed reviews from the audience in Andhra Pradesh and Telangana. "Rayudu" is the dubbed version of the Tamil action film "Marudhu," which was released in theatres on May 20.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu