»   »  'బ్రహ్మానందం' మే...(రెడీ రివ్యూ)

'బ్రహ్మానందం' మే...(రెడీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ready
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్ : శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు:రామ్,జెనీలియా,బ్రహ్మానందం,నాజర్,
చంద్రమోహన్,సుధ,కోట శ్రీనివాసరావు,షఫి,జయప్రకాష్ రెడ్డి,
తనికెళ్ళ, నవదీప్,తమన్నా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: మిస్టర్ వర్మ
యాక్షన్: పీటర్ హెయిన్స్
సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురెళ్ళ
కథ -మాటలు: కోన వెంకట్,గోపి మోహన్
స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత :స్రవంతి రవికిషోర్
రిలీజ్ డేట్: 19 జూన్ 2008

'ఢీ' సినిమాతో తాను పరిచయం చేసిన సక్సెస్ ఫార్ములానే అనుసరిస్తూ శ్రీను వైట్ల అందించిన కామెడీ రెడీ...దేనికైనా సరే. తన గత చిత్రాల లాగానే బ్రహ్మానందం మీదే పూర్తిగా ఆధారపడి అల్లుకున్న ఈ చిత్ర కథనం...ఆయనే వచ్చి అందిపుచ్చుకునే దాకా కదలలేదు. దాంతో ఫస్టాఫ్ సాగి బోరైంది. సెకండాఫ్ నవ్వులతో పరుగెత్తింది. హీరో రామ్ పూర్తి స్ధాయిలో పవన్ కళ్యాణ్ ని అనుకరించినా ఎనర్జీతో చేసాడు. అసభ్యత లేని కామిడీ యూత్ కేకాక ఫ్యామిలీలకు పట్టే అవకాశం ఉంది.

ఇంజనీరింగ్ స్టూడెంట్ చందు(రామ్)అనుకోని పరిస్ధితిల్లో పూజ(జెనీలియా)తో ప్రేమలో పడతాడు. ఆమె తనని పెళ్ళి చేసుకోవాలంటే ఓ కండీషన్ పెడుతుంది. తన పెళ్ళి విడిపోయిన తన మేనమామల (జయ ప్రకాష్ రెడ్డి,కోట శ్రీనివాసరావు) రెండు కుటుంబాల సమక్షంలో చేసుకోవాలని ఉందని. వాళ్ళిద్దరూ చాలా అనాగకరికులు .అంతేగాక తమ కొడుకులను మేనకోడలకే (జెనీలియా) ఇచ్చి చేయటానికి ఫిక్స్ అయిఉంటారు. అది తెలుసుకున్న హీరో రకరకాల ప్లాన్స్ వేసి వారినెలా కలిపి,పెళ్ళి చేసుకున్నాడనేదే రెడీ .

క్లాసిక్ నేరేషన్ లో సాగే ఈ కథనం..ఇంటర్వెల్ దాకా కథ లోకి రాకుండా సహనం చంపేస్తుంది. రకరకాల సీన్లు..చాలా సినిమాల్లో చూసినవే వస్తూంటాయి. ఉదాహరణకి కథని మలుపు తిప్పే పెళ్ళి కూతరు కిడ్నాప్ డ్రామా ఈ మధ్యనే వచ్చిన 'స్టేట్ రౌడీ..వీడికింత సీన్ లేదు'(శివాజి చిత్రం) లోది లిప్ట్ చేసారు. అలా చెప్పుకోవటానికి కథలో యోమీ లేకపోయినా సెకండాఫ్ లో వచ్చే మెక్ డొవల్ మూర్తి (బ్రహ్మానందం) పాత్ర సినిమాలో నవ్వులు పండించి నిలబెట్టే ప్రయత్నం చేసింది. అసలు ప్రారంభం నుంచే సెటప్ సీన్లోనే కోట, జయప్రకాష్ రెడ్డి పాత్రలు రివిల్ చేసి ఉంటే ట్విస్టు క్రింద లేకపోయినా కన్ఫూజన్ పోయి కామిడీ ఇంకా బాగా పండేది. ఎందుకంటే హీరోని ఫాలో అవుతున్న వారికి అతను చాలా సీన్లలో యేం ప్లాన్స్ వేస్తున్నాడో...అతని టార్గెట్ ఏమిటో అర్ధంకాదు. అలాగే హీరో ప్లాన్ 'గుడుంబా శంకర్' సినిమాలో లాగ సాఫీగా యే ఆటంకం లేకుండా సాగిపోతుంది. దాంతో హీరో,నెగిటివ్ పాత్రల మధ్య కాంఫ్లిక్ట్ స్ధాయి తగ్గిపోయింది. చాలా సార్లు అమాయకులను మోసం చేస్తున్నాడేమో నన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఇంత నీరసంగా ఉండటం ఇదే మొదటసారి.

ఇక ఫ్లస్సుల్లోకి వస్తే బ్రహ్మానందం ని పూర్తి స్ధాయిలో కామిడీ పండించటానికి వాడుకోవటంలో శ్రీను వైట్ల మరో సారి సక్సెస్ అయ్యాడు. అలాగే హీరో సూపర్ మేన్, క్రిష్ డ్రెస్ లు వేసుకున్నప్పుడు డైలాగులు బావున్నాయి.(క్రిష్ వా...అయితే సినిమాల్లో ఉండక ఇక్కడేం పని వంటివి). ఇక ఫస్టాఫ్ లో యమ్.యస్.నారాయణ హీరో ఇంటికి వచ్చి కుక్కు అన్న సెన్స్ లో హీరోయిన్ ని ఉద్దేసించి మాట్లేడే డైలాగులు మాటల రచయిత సెన్సాఫ్ హ్యూమర్ ని పట్టిస్తాయి. ధర్మవరపు కూడూ ప్రి క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా నవ్వించారు. ఇక హీరో,హీరోయిన్లు రొటీన్ గా నటిస్తూ ,డాన్సులు చేస్తూ పోయారు. నవదీప్,తమన్నా గెస్ట్ రోల్స్ కే పరిమితం అయ్యారు. చివరలో ఎక్కడన్నా హీరోకి సాయపడితే బాగుండేది. కెమెరా చాలా చోట్ల బాగుందనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమాను మరింత ట్రిమ్ చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్ తెప్పించింది.

స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉన్నా, కథ దారి తప్పినా శ్రీను వైట్ల మార్కు కామిడీ వాటిని అధిగమించే అవకాశం ఉంది. అలాగే సినిమాకి కాస్త లేటుగా వెళ్ళినా ఫరవాలేదు...ఎందుకంటే బ్రహ్మానందం వచ్చేది సెకండాఫ్ లోనే అనేది ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X