For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్మ 'డిపార్టమెంట్' రివ్యూ

  By Srikanya
  |

  నటీనటులు: అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, దగ్గుపాటి రాణా, షాలిని, లక్ష్మి మంచు, నటాలియా తదితరులు

  సంగీతం: బప్పి లహరి

  రచన: నీలేష్ గిరికర్

  నిర్మాత: సిద్దాంత్ ఒబరాయ్, అమిత్ శర్మ

  దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

  విడుదల తేదీ: 18, మే 2012

  చాలా గ్యాప్ తర్వాత తెలుగుకి వచ్చి వరస ఫెయిల్యూర్స్ ఇచ్చిన వర్మ మళ్లీ ముంబై వెళ్లి అక్కడా తన ఫెయిల్యూర్స్ ప్రస్దానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన ఫెయిల్యూర్స్ లిస్ట్ లో డిపార్టమెంట్ అనే చిత్రం చేరింది. మెగా టార్చర్ గా ప్రేక్షకులు అభివర్ణిస్తున్న ఈ చిత్రాన్ని వర్మ చాలా కాలం క్రితమే ఫూర్తి చేసి క్రేజ్ రాకపోవటంతో ఐటం సాంగ్ కలిపి,క్లైమాక్స్ రీ షూట్ చేసి వదిలాడు. అయినా వర్మ రెగ్యులర్ ప్లాప్ కంటే మరికాస్త అద్వానంగా ఉండటం తప్ప ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ మార్పేమి లేదని చూసిన వారు పెదవి విరుస్తున్నారు. బి గ్రేడ్ స్క్రిప్టులో ఎ గ్రేడ్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రం సి గ్రేడ్ ప్రేక్షకులుకు కూడా నచ్చదు.

  పోలీసు డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ముంబయిలో మాఫియాని అదుపులో పెట్టడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేకంగా ఓ బృందాన్ని సిద్ధం చేస్తుంది. చట్టం, న్యాయం ఇవేవీ ఆ బృందానికి వర్తించవు. అందులో పని చేసే శివనారాయణ్‌(రానా)అనే ఓ పోలీసు అధికారి పాత్ర నిజాయతీపరుడు. డిపార్టమెంట్ కి బాస్ అయిన మాధవ్ బోంస్లే(సంజయ్ దత్)తో కలిసి అండర్ వలర్డ్ గూండాలను ఏరిపారేస్తూంటాడు. ఆ క్రమంలో అతని చుట్టూ చోటు చేసుకొనే సంఘటనల సమాహారమే ఈ చిత్రం.

  ఫస్టాఫ్ అంతా రానా,సంజయ్ దత్ కలిసి మాఫియాని కాల్చేయటంతోనే సరిపోతుంది. అమితాబ్ పాత్ర ఎక్కడా కనపడదు. సెకండాఫ్ కి వచ్చే సరికి అమితాబ్ అయినా సినిమాని నిలబెడతాడని ఆశిస్తాం. అయితే ఆయన పాత్ర కూడా ఎంట్రీ ఇచ్చిన రెండో నిముషంలో డల్ అయిపోయి..అది కూడా సినిమాని నెలబెట్టడానికి పనికిరాదని అర్దమైపోతుంది. అలాగే సినిమా మొత్తం వర్మ పాయింట్ లెస్ గా కెమెరాని మార్చి తిప్పుతూ,టైట్ క్లోజ్ లతో ప్రయోగం తరహాలో వయలెన్స్ ని హైలెట్ చేస్తూ సాగిపోతుంది. ముఖ్యంగా చూసేవాడికి ఆ కెమెరా ఏంగిల్స్ ఏ విధంగ ఇబ్బంది పెడతాయి అన్నదాన్ని పట్టించుకోకుండా తీసేసాడు. అలాగే సినిమాలో సబ్ ప్లాట్స్ ఎక్కువై ఏ పాత్ర ఏది అనే కన్ఫూజన్ వస్తూంటుంది. డైలాగులు అయితే చాలా చోట్ల సినిమాకి సంబంధం లేకుండా సాగిపోతూంటాయి.

  నటీనటుల్లో అమితాబ్ తన కొత్త గెపట్ తో ఇంప్రెస్ చేస్తాడు. కానీ ఆయన క్యారెక్టర్ వీక్ గా ఉండటంతో ఆ సీన్స్ పండలేదు. ఆయన తన పవర్ ఫ్యాకెడ్ ఫెరఫార్మెన్స్ తో ఆకట్టుకోవాలని చూస్తాడు. ఇక రానా విషయానికి వస్తే..సినిమా మొత్తం రౌడీలు కొట్టడం తప్ప అతనికి వేరే పని చెప్పలేదు. దాంతో హ్యాపీగా నటన అనేది లేకుండా స్క్రీన్ టైం గడిపేసాడు. ఉన్నంతలో సంజయ్ దత్ నటన ఆకట్టుకుంటుంది. అతని పాత్ర ద్వి ముఖంగా సాగుతూ కథని డ్రైవ్ చేస్తుంది. ఈ సినిమాలో మధుషాలిని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె హీరోలకు కాంపిటేషన్ ఇచ్చింది. లక్ష్మి మంచు,అంజనా సుఖాని పాత్రలు పెద్దగా ప్రయారిటీ లేదు. అభిమన్యుసింగ్ కి దుస్తులు మీద పెట్టిన శ్రద్ద అతని పాత్రని తీర్చి దిద్దటం మీద పెట్టలేదు. సినిమాలో అతనో జంతువులా కనపడతాడు తప్ప ఎక్కడా మనిషిలాగ ఉండడు. ఈ సినిమాలో కెమెరా వర్క్ గురించి,సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్. వర్మ ఎంతో గొప్పగా చెప్పిన ఐటం సాంగ్ కూడా తెరపై తేలిపోయింది.

  ఫైనల్ గా..డిపార్టమెంట్ చూడటం కోరి తలనొప్పిని తెచ్చుకోవటమేనని చెప్పవచ్చు. అయినా సంజయ్ దత్,అమితాబ్ వంటి నటులు ఉన్నారు కదా అని ధైర్యం చేస్తే..వాళ్లు ఇలాంటి నటన కూడా చేస్తారా అని ఉన్న గౌరవం పోతుంది. వర్మ వీరాభిమానలుకు సైతం విరక్తి కలిగించే ఈ చిత్రానికి దూరంగా ఉండటమే బెస్ట్.

  English summary
  Ram Gopal Varma's Department is yet another disappointment for the viewers. Department is a gripping action drama, narrating a terrifying power struggle story. Though the movie has big star casts like Amitabh Bachchan and Sanjay Dutt, it fails to impress us. You are sure to curse yourself once to move out of theatre, after watching out RGV's camera obsession and bizarre action.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X