twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గురి తప్పిన రాజకీయ వ్యంగ్యాస్త్రం...

    By Lakshmisurya
    |

    Rating:
    2.0/5
    - లక్ష్మీ ఎస్ కుకునూర్

    చిత్రం :మిస్ తనక్ పూర్ హాజిర్ హో
    నటీ నటులు: ఓం పురి, అన్ను కపూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా,రాహుల్ బగ్గా, హ్రిశితా భట్ తదితరులు
    విడుదల : 26 జూన్ 2015
    దర్సకత్వం: వినోద్ కాప్రి
    నిర్మాణం: ఫాక్స్ స్టార్ & క్రాస్ వర్డ్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణం

    బాలీవుడ్ లో స్టార్ కాంబినేషన్లు, రొమాంటిక్ ప్రేమ కథలు , యాక్షన్ ఎంటర్టైనర్ లు కాకుండా రెండు గంటలు పాటు కొత్తదనంతో కూడిన సినిమా కోరుకునే వాళ్ళ కోసం తీసిన చిత్రం " మిస్ తనక్ పూర్ హాజిర్ హో". ప్రస్తుత న్యాయవ్యవస్థ పై తీసిన వ్యంగ్యాత్మక చిత్రం కావటంతో విడుదలకు ముందు కొన్ని వివాదాలు, మరి కొన్ని చర్చలు చోటు చేసుకున్నాయి. వాటిని దాటుకుని ఈ రోజు విడుదయిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

     Review on Tanakpur hazir hai Hindi film

    అసలు విషయం:

    కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే - తనక్ పూర్ అనే గ్రామంలో ఉండే అర్జున్ అనే యువకుడు(రాహుల్ బగ్గా) తన పెంపుడు గేదె మిస్ తనక్ పూర్ ని రేప్ చేసాడని గ్రామ పెద్ద సులాల్ గందాస్ (అన్నుకపూర్) గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేసి తన ‘మిస్ తనక్ పూర్'ని పెళ్లి చేసుకునేలా తీర్పును ఇవ్వమని కోరతాడు. పంచాయతీ ఏం చెప్పింది? బగ్గా ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

    చెప్పుకోదగ్గవి :

    ఒక గ్రామం లో జరిగిన యదార్ధ సంఘటనలను కూర్చి తీసిన సినిమా కావటం మొదటి ప్లస్ పాయింట్. టెలివిజన్ జర్నలిస్ట్ నుండి దర్శకుడిగా మారిన వినోద్ కాప్రి ఎవరూ చేయి పెట్టటానికి కూడా దైర్యం చేయని పాయింట్ ను ఎన్నుకుని సాహసమే చేశాడు. వినూత్నమైన కథాంశం కావటంతో సినిమా విడుదలకు ముందు నుండే ఆసక్తి కలిగించింది. వాస్తవంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో అధికార దుర్వినియోగ కారణంగా సామాన్యులపై తప్పుడు కేసులు ఎలా బనాయించపడతాయి, సమాజంలోని కుల, మత పరిస్థితులు దానికి ఎలా దోహదపడతాయో ఈ సినిమా చర్చించింది.

    ఉండకూడనివి :

    రోజుకు 20 లీటర్లు పాలిచ్చే ఒక గేదె మిస్ తనక్ పూర్ టైటిల్ ని గెలుచుకుని సెలెబ్రిటిగా ట్రీట్ చేయబడటం అనే సునిశిత హాస్యాన్ని సినిమా అంతా చూపలేకపోవటం అన్నింటికంటే ముఖ్యమైన లోపం. వినోద్ కాప్రి ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా చెప్పిన విధానంలోనే సరయిన పద్దతిని అనుసరించలేదు. మంచి సినిమా అందించాలనే ఆలోచన మంచిదే కాని మంచిని వదిలిపెట్టి మంచిని చెప్పలనుకోకూడదు. కొన్ని సార్లు అత్యాచారం చేసిన వాళ్ళు , అత్యాచార భాదితుల గురించి అతను చెప్పాలనుకున్న ప్రయత్నం శ్రుతి మించటం ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. ఓం పురి , అన్నుకపూర్ ,రవి కిషన్, సంజయ్ మిశ్రా లాంటి నటులు ఉన్నప్పటికీ పేలవమైన స్క్రీన్ ప్లే విధానంతో వాళ్ళంతా తేలిపోయారు. హీరో హీరోయిన్ ల పాత్రల స్వభావాన్ని పరిణతితో చూపలేకపోవటం ప్రధాన లోపం.

    ఫలితం:

    వెరైటీ కథాంశం ఎంచుకున్నప్పటికీ దర్శకుడు కథను అర్ధవంతంగా ప్రెజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. గజి బిజీ స్క్రీన్ ప్లే వల్ల కొన్ని కొన్ని చోట్ల సినిమా గందరగోళం గా అనిపిస్తుంది.అర్ధవంతమైన డైలాగులు ఉన్నప్పటికీ హద్దులు దాటిన సహజత్వం వల్ల ఎబ్బెట్టుగా అనిపించి కనెక్ట్ అవ్వలేదు. పాత్రలన్నీ పూర్తి హర్యానా హిందీ మాట్లాడుతుండటం వల్ల సగటు ప్రేక్షకుడుకి నవ్వు తెప్పించేది అయినా నవ్వలేని పరిస్థితి. మూగ జీవిని ప్రధాన పాత్రగా చేసుకుని సమాజం లో లోటుపాట్లను ఎత్తి చూపాలనుకున్నపుడు మనుషుల యాక్షన్లకు రియాక్షన్ ఇవ్వగలిగిన జంతువును పెట్టి ఉంటే కొంతయినా దర్శకుడు అనుకున్న వ్యంగ్యం ,హాస్యం పండి ఉండేవేమో..?

    English summary
    A good subject with poor screen play, the Hindi film Tanakpur Hazir hai, failed to entertain the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X