For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎటెటో వెళ్లిపోయింది.... (‘ఎటో వెళ్లి పోయింది మనసు’ రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  2.0/5
  లవ్ స్టోరీ అంటే ఏముంటుంది... హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు.. మధ్యలో డబ్బు.. పేద అడ్డంకులు లేదా కులాల పట్టింపులు..లేదా మరో కాన్సర్ తరహా అడ్డంకో..ఏదో ఒక అడ్డంకి.. దాన్ని ఎదిరించి... చివరకు వారిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే కదా.. అని తేలిగ్గా అనిపిస్తుంది. అయితే ఆ తెలిసిన అడ్డంకులనే తెలివిగా కొత్తగా చూపెడుతూ ఆసక్తి రేపుతూ చెప్పటంలో దర్శకుడు గొప్పతనం ఉంటుంది. సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రం 'ఏ మాయ చేసావె' తో తెలుగులోనూ తనకంటూ అభిమానులను తయారు చేసుకున్న గౌతమ్ మీనన్ తాజా చిత్రం అంటే అందరికీ ఆసక్తే. అందులోనూ తనే డిస్కవరి చేసిన సమంతనే హీరోయిన్ గా పెట్టి, ఇళయరాజా సంగీతాన్ని వెంటేసుకుని ఓ ప్రెష్ లవ్ స్టోరీతో వస్తున్నాడంటే మరీ ఇంట్రస్టింగ్. అయితే కథ,కథనాలు మరీ మెల్లిగా సా...గ...టం, కొన్ని సీన్లలో కదలకుండా కెమెరా పాతేసి.. షాట్ ఫిక్స్ చేసి పది నిముషాలకు పైగా హీరో,హీరోయిన్స్ మాట్లాడుకునే సీన్స్ తియ్యటం మరీ సహన పరీక్షగా అనిపించింది. దాంతో థియోటర్లలో హీరో డైలాగు చెప్తూంటే ప్రేక్షకులు కౌంటర్స్ ఇవ్వటం... హీరోయిన్ ఏడుస్తూంటే జనాలు నవ్వటం...విజిల్స్ వేయటం వంటి వాతావరణం క్రియేట్ అయ్యింది.

  వరుణ్ కృష్ణ (నాని),నిత్య(సమంత)చిన్ననాటి స్కూల్ ప్రెండ్స్... తర్వాత కాలేజ్ మేట్స్.... ఆ తర్వాత సోల్ మేట్స్... అయితే ఇద్దరూ తమ తమ ఇగోలతో ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. దానికి తోడు.. వరుణ్ ది మిడిల్ క్లాస్ ప్యామిలీ.. నిత్యది డబ్బున్న కుటుంబం. దాంతో నిత్య తండ్రి ...ఆర్దికంగా వ్యత్యాసమున్న తమతో సంభంధం ఒప్పుకోకపోతే తమ కుటుంబం అవమానానానికి లోనవుతుందని వరుణ్ భయపడి, ఆమెకు దూరం జరిగి తన కెరీర్ పై దృష్టి పెడతాడు. ఇది భరించలేని నిత్య...కోపంతో...భాథతో అతనికి దూరం అయ్యి వేరే వ్యాపకంలో పడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి వరుణ్ తను ఆమెను మర్చిపోలేనని వెనక్కి వచ్చినా ఆమె ఏక్సెప్టు చెయ్యదు. తిట్టి పంపుతుంది. అప్పుడు వరుణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోసుకుని,సెటిల్ అవటానికి సిద్దపడతాడు. ఆ విషయం చివరి నిముషాల్లో తెలుసుకున్న నిత్య ఏం చేసి,తన ప్రేమను గెలిపించుకుంది అనే విషయం తెరపైనే చూడాలి.

  క్లాసిక్ నేరేషన్ లో కథను మొదలు పెట్టి మధ్యలో చిన్నచిన్న ప్లాష్ బ్యాక్ ల ముడిని కట్టిన ఇలాంటి కథే లేని చిత్రం కథ తయారు చేయటం చాలా కష్టం. అలాగే రాసుకున్నదంతా ఆసక్తిగా తెరపై మలచి,ఒప్పించటం మరింత కష్టం. కథగా చూస్తే పెద్ద మలుపులు, మ్యాజిల్ లు లేని ఈ చిత్రం పూర్తిగా కథనం పై ఆధారపడి సీన్స్ అల్లుకున్నారు. అయితే ఇంటర్వెల్ వరకూ అసలు కథలో మలుపు రాదు. అప్పటివరకూ వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ప్రేమించుకున్నారు..ప్రేమించుకున్నారు అని బోర్ కొడుతూ సాగుతూంటుంది. ఇంటర్వెల్ కు ముందు... తన కుటుంబం కోసం ఆమెను త్యాగం చేయాలని హీరో నిర్ణయించుకోవటం జరుగుతుంది. అయితే ఆ సీన్స్ మరీ టీవీ సీరియల్ లాగా డైలాగులతో నడుస్తూంటుంది. పోని ఇంటర్వెల్ కు అయినా కథలోకి వచ్చాడు కదా...కాంప్లిక్ట్ వచ్చింది...ఇక సెకండాఫ్ బాగుంటుంది అని ఫిక్సైతే... సెకండాఫ్ లో అసలు ఆ విషయమే ఎత్తడు. ఇంటర్వెల్ దగ్గర విడిపోయిన ఆమెను కలవటం... ఆమె చేత ఛీ కొట్టించుకోవటం వంటి సీన్స్ తో పేలవంగా నడుస్తుూంటుంది. క్లైమాక్స్ అయితే విషయం లేక డైలాగులు మీద డైలాగులతో,మరో ప్రక్క హీరోయిన్ ఏడుపుతో మన సహనానికి క్లైమాక్స్ తెప్పిస్తుంది.

  అయితే దర్శకుడు గౌతమ్ మీనన్ తన మనస్సులో ఉన్నది యాజటీజ్ గా తెరపైకి ఎక్కించాడని అర్దమవుతుంది. కొన్ని సీన్స్ అంత బోర్ లోనూ ఇంత బాగా తీసాడా అని ఆశ్చర్యపరుస్తూంటాయి. కథలో కాంప్లిక్ట్ పార్ట్ ని మరింత బలం చేసి... అదే పాయింట్ మీద కథనం నడిపితే బాగుండేదనిపిస్తుంది. ఇవన్ని ఇలా ఉంటే కృష్ణుడు మీద ..ఏమి మాయ చేసావే చిత్రం ప్యారెడీ పెట్టడం.... దర్శకుడు మీద ఉన్న గౌరవం పోగొడుతుంది. రెగ్యులర్ కమర్షియల్ దర్శకుల తరహాలో కామిడీ కోసం తన సూపర్ హిట్ నే ప్యారెడీ చేయటం క్షమించబుద్దికాదు. ఆ ప్యారెడీ సీన్స్ కథలో కలిసి ప్రయాణం చేస్తూంటే... సినిమా మూడ్ లోంచి బయిటకు వచ్చేయటం జరుగుతుంది. అలాగే చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అనేది కృష్ణుడు మీద పండని ఒకటి రెండు సీన్స్ తప్ప అస్సలు కనపడదు. అంతేగాక సినిమా ప్రారంభమే కృష్ణుడు మీద పాటతో ఓపెన్ చేయటం కూడా చూసేందుకు ఇబ్బందిగానే అనిపించింది.

  హీరో, హీరోయిన్స్ ఇద్దరూ బాగానే చేసారు. అయితే సమంత ఇంతకు ముందు ఉన్నంత గ్లామర్ గా కనపడదు. ఆ మధ్య వచ్చిన అనారోగ్యం కారణం కావచ్చు. ఇక దర్శకుడు మూడు భాషల్లో ఒకే సారి సినిమా తియ్యటం జరిగింది. దాంతో ఎక్కువ లాంగ్ షాట్స్ మీదనే దృష్టి పెట్టారు. లేదా స్టడీ ప్రేమ్స్ పెట్టి డైలాగులు చెప్పించటం జరిగింది. గౌతమ్ మీనన్ చిత్రాలకు ప్రాణమైన కెమెరా పనితనం ఈ చిత్రంలో బాగా నిరాశపరించింది. ఎడిగింగ్ ..విషయానికి వస్తే ఫస్టాఫ్ లో చాలా సీన్స్ ట్రిమ్ చేయాలి. సెకండాఫ్..క్లైమాక్స్ లెంగ్త్ తగ్గించాలి. పాటలు ఇళయరాజా ఇచ్చారు. ఆయన సినిమాలు సాధారణంగా మ్యూజికల్ హిట్స్ ఉంటాయి.. ముఖ్యంగా లవ్ స్టోరీలకు ఆయన అద్బుతం అనిపించుకున్నారు. అలాంటిది ఈ సినిమాలో పాటలకు జనం లేచి వెళ్లిపోయే పరిస్ధితి ఏర్పడింది. డైలాగులు కోనవెంకట్... పదును తగ్గింది. అందులోనూ డైలాగులు కుప్పలు తెప్పలుగా సినిమా నిండా ఉడటం విసుగు తెప్పిస్తుంది. గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడు నుంచి విజువల్ పోయిట్రీ ఫిల్మ్ లు ఆశిస్తాం కానీ డైలాగు ఓరియెంటెడ్ సినిమాలు కాదు కదా. అలాగే లవ్ స్టోరీలకు స్లో నేరేషన్ అందాన్ని, బలాన్ని, భావోద్వేగాన్నిఇస్తుందనేది నిజం. అయితే మరీ స్లోగా కంటెంట్ లేకుండా నడిపితే నిద్రను కూడా ఇస్తుందనేది మరింత నిజం.

  ఫైనల్ గా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం వారి అంచనాలును తారుమారు చేసిందనే చెప్పాలి. మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసిన ఈ చిత్రం ఆ వర్గాన్ని అయినా ఆకట్టుకుంటుందా అంటే అపనమ్మకమే. దర్శకుడు గత చిత్రాలు చూసి అంచనాలు పెంచుకుని ప్రస్తుత సినిమాలకు వెళ్లితే ఒక్కోసారి తలకు పెద్ద బొప్పి కడుతుందనే నిజం ఈ చిత్రం థియోటర్ సాక్షిగా భోధిస్తుంది.

  బ్యానర్: తేజ సినిమా
  నటీనటులు: నాని, సమంత, కృష్ణుడు, విద్యు, అనుపమ, శ్వేత తదితరులు
  మాటలు: కోన వెంకట్‌,
  కథ: రేష్మా ఘటాల
  కెమెరా: ఎం.ఎస్‌.ప్రభు, ఓంప్రకాష్‌,
  సంగీతం: ఇళయరాజా,
  ఎడిటర్: ఆంధోని
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌.
  నిర్మాత: సి.కళ్యాణ్, గౌతమ్ మీనన్
  విడుదల తేదీ: 14 డిసెంబర్ 2012

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  Read More: 'కృష్ణం వందే జగద్గురుమ్‌' రివ్యూ

  English summary
  Much-awaited movie Yeto Vellipoyindhi Manasu (YVM), released Today(December 14) with divide talk. Yeto Vellipoyindhi Manasu is a young romance drama, which has been written and directed by Gautham Menon. It is a story of a guy and a girl named Varun and Nithya. Their love story has been dealt in three different phases like school, college and life after that. The movie has a tagline: This could be your love story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X