»   » ‘అర్జున్ రెడ్డి’ ..... రామ్ గోపాల్ వర్మ రివ్యూ

‘అర్జున్ రెడ్డి’ ..... రామ్ గోపాల్ వర్మ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' శుక్రవారం గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సినిమా అని, రియలిస్టిక్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి తన అభిప్రాయం వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి, హీరో విజయ్ దేవరకొండ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా చూసిన అనంతరం రామ్ గోపాల్ వర్మ ఏం కామెంట్ చేశాడో ఓసారి చూద్దాం.

ఆ క్వాలిటీ తొలిసారిగా విజయ్ దేవరకొండలో చూశాను

ఆ క్వాలిటీ తొలిసారిగా విజయ్ దేవరకొండలో చూశాను

ఈ కాలం స్టార్స్ తెరపై హీరోయిక్ అప్పియరెన్స్ ఇవ్వడానికి స్లోమోషన్, రాంపింగ్ షాట్లు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద ఆధారపడుతున్నారు. కానీవాటి అవసరం విజయ్ దేవరకొండకు అవసరం లేదని నా అభిప్రాయం. అతడి కళ్లు, వాయిస్‌లో అవి ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి.

అమితాబ్ తర్వాత విజయ్‌లో అది చూశాను

అమితాబ్ తర్వాత విజయ్‌లో అది చూశాను

ఎలాంటి సినిమాటిక్ టెక్నిక్స్ అవసరం లేకుండా కెమెరా మూమెంట్‌లోని 24 ఫ్రేమ్స్‌లో జీవించే నటుడిని ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ లో మాత్రమే చూశాను. ఆ తర్వాత అలాంటి టాలెంట్ విజయ్ దేవరకొండలో కనిపించింది అని వర్మ ప్రశంసించాడు.

అమితాబ్, ఆల్ పాచినో కాంబినేషన్ విజయ్

అమితాబ్, ఆల్ పాచినో కాంబినేషన్ విజయ్

యంగ్ అమితాబ్ బచ్చన్, యంగ్ ఆల్ పాచినో ఇద్దరినీ కలిపితే అచ్చం విజయ్ దేవరకొండలా ఉంటాడు. ఈ జనరేషన్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒక ట్రెండ్ సెట్టర్ అని వర్మ కామెంట్ చేశారు.

టాలీవుడ్ అమితాబ్, తెలంగాణ మెగాస్టార్

టాలీవుడ్ అమితాబ్, తెలంగాణ మెగాస్టార్

విజయ్ సుధీర్ఘ కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ స్థాయికి వెళతాడు. తెలంగాణకు తొలి మెగాస్టార్ అవుతాడు అంటూ వర్మ జోష్యం చెప్పారు.

సందీప్ రెడ్డి గురించి

సందీప్ రెడ్డి గురించి

దర్శకుడు సందీప్ రెడ్డికి సంబంధించిన చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూలు చూశాను. అతడిలో గొప్పటాలెంట్ ఉందని గమనించారు. ‘అర్జున్ రెడ్డి' సినిమా చూసిన తర్వాత అతడి గురించి మరింత అర్థమైంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలదొక్కుకునే శక్తి అతడిలో ఉందని స్పష్టం అవుతుంది అన్నారు.

అలా చేయకుంటే పెద్ద మిస్టేక్ చేసినట్లే

అలా చేయకుంటే పెద్ద మిస్టేక్ చేసినట్లే

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన దర్శకులు, ఎదుగుతున్న దర్శకులు.... సందీప్ రెడ్డిని తమకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడిగా గుర్తించక పోతే పెద్ద మిస్టేక్ చేసినట్లు అవుతుంది అని వర్మ అభిప్రాయ పడ్డారు.

వారికి బెస్ట్ విషెస్ అవసరం లేదు

వారికి బెస్ట్ విషెస్ అవసరం లేదు


విజయ్ దేవరకొండకు, దర్శకుడు సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా ఎవరి నుండి బెస్ట్ విషెస్ అవసరం లేదని నా అభిప్రాయం, ఎందుకంటే వారు ఆల్రెడీ బెస్ట్..... అంటూ వర్మ కామెంట్ చేశారు.

English summary
"I always believed that all the heroes of today are very heavily dependent upon slow motion and ramping shots aided with ear splitting background music to appear heroic. Vijay Deverakonda is the first and only actor I ever saw who looks like a hero without the help of any slow motion or ramping shots..His eyes and his voice themselves emanate a built in background music from within himself." RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X