twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైకో’యిజం చూపించిన వర్మ (రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్ : నా రూటే సపరేటు అంటూ సాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సినిమాల విషయంలో కూడా అలాంటి దారినే ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు దెయ్యాల సబ్జెక్టులు, రౌడీల సబ్జెక్టులు, ఫ్యాక్షనిస్టుల సబ్జెక్టులతో సినిమాలు తీసిన వర్మ తాజాగా తన మెదడులో మెదిలిని 'సైకో' ఆలోచనలను ప్రేక్షకుల మీదకి వదిలాడు. వర్మ కథ-స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి కిషోర్ భార్గవ్ దర్శకత్వం.

    మీరా(నిషా కొఠారి) మధ్యతరగతి అమ్మాయి. ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న ఆమె ఓ ఆఫీసులో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బస్సులో నికిల్(రాజ్ ష్రాఫ్) అనే వ్యక్తి తనకు తానుగా మీరాను పరిచయం చేసుకుంటాడు.

    RGV's Psycho review

    ఈ క్రమంలో ఆమెను తనతో ఫ్రెండ్షిప్ చేయాలని, సినిమాలకు రావాలని, మాట్లాడాలని టార్చర్ పెడుతూ ఉంటాడు. నిఖిల్ సైకోలా ప్రవర్తిస్తుండటంతో అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతని టార్చర్ మరీ ఎక్కువ కావడంతో ఆఫీసులో తనతో పాటు కలిసి పని చేస్తున్న శేఖర్‌తో చెబుతుంది. శేఖర్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన సిటీ కమీషనర్‌కు చెబుతాడు. దీంతో నిఖిల్ మరింత రెచ్చిపోయి ప్రమాద కరంగా ప్రవర్తిస్తుంటాడు. అతని గురించి ఊహించని సంఘటన ఒకటి తెలుస్తుంది. చివరకు ఏమైంది? అనేది క్లైమాక్స్.

    నిషా కొఠారి నటన బాగుంది. ముఖ్యంగా ఆమె హావభావాలు సన్నివేశాలకు తగిన విధంగా ఉన్నాయి. సైకో పాత్రలో రాజ్ ష్రాఫ్ పర్ ఫెక్ట్‌గా సూటయ్యాడు. ఇతర పాత్రల్లో కనిపించిన వారు వారి వారి పాత్రలకు తగిన విధంగా పర్వాలేదనిపించారు. వర్మ ఎంచుకున్న కాన్సెప్టు ఓకే. పాటలు లేవు. బ్యాగ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు.

    ఇదంతా ఓకే కానీ...సినిమాటోగ్రఫీ చెత్తగా ఉంది. కెమెరాను తిప్పిన వైనం, యాంగిల్స్...ఒకరకంగా కెమెరా తీరు చూసే వారికి కళ్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా లేదు. సైకో సబ్జెక్టు కాబట్టి ఎంటర్టెన్మెంటుకు స్థానం లేకుండా పోయింది. సస్పెన్స్ కూడా ఊహించిన స్థాయిలో లేదు. క్లైమాక్స్‌లో సైకోయిజాన్ని చూపించిన తీరలో అతి కనిపించింది. దీంతో ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యేపరిస్థితి ఏర్పడింది.

    ఓవరాల్‌గా చెప్పాలంటే......సినిమా పేరుకు తగిన విధంగానే ఇది ఓ సైకో సినిమా. ప్రేక్షకులపై వర్మ తన సైకోయిజాన్ని చూపించాడని చెప్పుకోవచ్చు. ఆ సైకోయిజాన్ని భరించే ఓపిక ఉంటే వెళ్లండి.

    బ్యానర్ : కాలిబర్ ఫిల్మ్స్
    తారాగణం : నిషా కొఠారి, రాజ్ ష్రాఫ్, నకుల్, విజయ్ కశ్యప్, మిలింద్ గునాజి తదితరులు...
    బ్యాగ్రౌండ్ స్కోర్ : ప్రదీప్ ముఖోపాధ్యాయ
    సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్
    నిర్మాత : వివేకానంద్ ఆహుజా
    కథ-స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ
    దర్శకత్వం : కిషోర్ భార్గవ్
    విడుదల : జూన్ 21, 2013

    English summary
    
 RGV has written the story and screenplay of Psycho and debutant Kishore Bhargav directed the film.The movie is releasing today in Andhra Prasesh. Vivekanand Ahuja has produced it under Calibre Films Pvt Ltd banner. The film features Nisha Kothari has played the lead role and the film is reportedly inspired from several incidents which women face in the society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X