For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎమోషనలే కానీ... (‘26/11 ఇండియాపై దాడి’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5
  వాస్తవాన్ని తెరకెక్కించటం లేదా తెరకెక్కించిన దాన్ని వాస్తవం అనిపించటంలో వర్మ సిద్దహస్తుడు. తాజాగా అదే ధీమాతో.. ముంబై బాంబు ప్రేలుళ్ల యధార్ధ సంఘటనలను బేస్ చేసుకుని.. '26/11 ఇండియాపై దాడి' అంటూ ముందుకొచ్చాడు. అయితే ఇలాంటి కథలకి ఫిక్షన్ కలపటం సాధ్యం కాదు.. కలపకపోతే డాక్యుమెంటరీలను తలపిస్తాయి. మరెలా వర్మ ఆ అడ్డంకిని దాటుతాడు అన్నది ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచీ అందరికీ పెద్ద క్వచ్చిన్ మార్క్. అయితే వర్మ తన ప్రతిభతో ఫస్టాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా నేరేట్ చేయగలిగినా సెకండాప్ స్లో గా... మారి.. సామాన్య ప్రేక్షకుడుకి కాస్త ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. ఆయన అభిమానులకు మాత్రం ఇది పండుగ చేసుకునే చిత్రమే.

  నవంబర్ 26, 2008న జరిగిన దాడులు గురించి.. ముంబై జాయింట్ పోలీస్ కమీషనర్ రాకేష్ మరియా(నానా పటేకర్) కమిటి కి వివరిస్తూన్నట్లుగా కథనం మొదలయ్యే, ఆయన నేరేషన్ తో... విజువల్స్ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్ళతాయి. ఓ పది మంది టెర్రరిస్టులు గేట్ వే ఆఫ్ ఇండియాలో ఓ పడవని హైజాక్ చేసి ముంబైలోకి ఎలా వచ్చారు... వారు ఎలా పథకం ప్రకారం దాడులు చేసారు.. ఆ సమయంలో ఎలర్టైన పోలీసులు వారిని ఎలా అంతమొందించారు.. కసబ్ ని ఎలా అరెస్టు చేసారు అన్న దిసగా కథనం నడుస్తుంది.

  తెలిసిన కథ ఇంకా చెప్పాలంటే టీవి వంటి ప్రసార మాధ్యమాల ద్వారా అనేక సార్లు చూసిన విజువల్స్... ఈ సినిమా కు పెద్ద సవాల్. ఎందుకంటే చూసే వారి మదిలో ఉన్న విజువల్స్ కు ఏ మాత్రం తేడా వచ్చినా వారు డిస్ కనెక్టు అయిపోతారు. సినిమాని ఎమోషనల్ జర్నిగా అభివర్ణించే వర్మ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత జాగ్రత్తలు అంటే తెరపై కనడపే కసబ్ పాత్రధారి నిజమైన కసబ్ అని భ్రమపడేటంతగా. అయితే తనకు తెలిసిన చాలా విషయాలు ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ తెరకెక్కించటంలో వర్మ ప్రధమార్దంలో సఫలీకృతమైనా.. సెకంఢాఫ్... స్పీడు తగ్గి... విషయం డెల్యూట్ అయిపోయింది. మైన్యూర్ డిటేల్స్ మీద కూడా పూర్తి దృష్టి పెట్టిన వర్మ ఎందుకనే నేరేషన్ విషయంలో పట్టించుకున్నట్లు లేరు. లేదా.. ఇదే నేరేషన్ ఇలాంటి సినిమాలకు అవసరం అని అయినా ఫిక్సై ఉండి ఉండాలి. నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ లో వచ్చే డాక్యుమెంటరీలా సినిమా ఉంటే ఫలితం ఏముంటుంది.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

  సినిమా మొత్తం నానా పటేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటం చాలా వరకూ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఏదన్నా ఫిక్షన్ కలిసినా అది ఓ పాత్రధారి పాయింటాఫ్ కాబట్టి తప్పుపట్టలేం అనిపించేలా డిజైన్ చేసారు.

  సంజీవ్ జైస్వాల్ అచ్చుగుద్దినట్లు కసబ్ లా ఉండటం కలిసి వచ్చిన అంశం. డ్రామా నుంచి రావటం వల్లనేమో అతను చాలా బాగా నటించేసాడు. ప్రతీ చిన్న విషయం.. నడక దగ్గర నుంచి.. చూపు... కదలికలు అన్నీ కసబ్ ని దించేసాడు. అతనే ఈ సినిమాకు పెద్ద ప్లస్. అతను తేడా చేస్తే.. ప్రేక్షకుడు.. ఎన్నో సార్లు టీవీల్లో చూసిన కసబ్ కాదని కనిపెట్టేసి.. సినిమాకు డిస్ కనెక్టు అయ్యిపోయేవాడు.

  నానా పటేకర్ కి ఇలాంటి పాత్రలు టైలర్ మేడ్.. కొట్టిన పిండి.. ఆయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు... బాగా చేయకపోతే చెప్పుకోవాలి.

  నిజ జీవిత పాత్రలను విజువలైజ్ చేయటంలో.. ఆ క్యారెక్టర్స్ తగిన నటులను ఎంచుకోవటంలో, వారి నుంచి ఫెరఫార్మన్స్ రప్పించుకోవటంలో వర్మ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది.

  వర్మ మొదటి సినిమా నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సూపర్బ్ అనిపిస్తాడు. ఈ సినిమాకు మాత్రం ఎందుకు వదులుతాడు... కేక పెట్టించాడు.

  సినిమా హైలెట్స్ లో కెమెరా వర్క్ కూడా ఒకటి. వాస్తవాన్ని ప్రెజెంట్ చేయటంలో వర్మ దర్శకత్వానికి పోటీ పడింది.

  తాజ్ మహల్ హోటల్, బోట్ లో జరిగే సీన్స్ లో వర్మ మార్క్ స్పష్టంగా కనపడుతుంది.

  కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమాను చూడటంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ముంబై దాడులు ఎలా జరిగాయి అన్నది చూడాలనే ఆసక్తి ఉంటే మిస్ కాకూడని చిత్రం.

  బ్యానర్: ఈరోస్ ఇంటర్నేషనల్ - ఆలంబ్రా ఎంటర్టైన్మెంట్
  నటీనటులు: నానా పటేకర్, సంజీవ్ జైస్వాల్, అతుల్ కులకర్ణి, గణేష్ యాదవ్, రవికాలే తదితరులు
  సంగీతం: రూషిన్ దలాల్, అమర్ మొహిలే
  ఛాయాగ్రహణం: హర్షరాజ్‌ షరఫ్‌
  దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ
  నిర్మాత: పరాగ్ సంఘ్వి, గోపాల్ దల్వి
  విడుదల తేదీ: 01, మార్చి 2013.

  వరస ఫ్లాపుల్లో ఉన్న వర్మకి ఈ సినిమా కమ్ బ్యాక్ చిత్రం అని చెప్పలేము కానీ.... ముంబై దాడులు ఎలా జరిగాయి... ఆ రోజు ఏం జరిగింది... పోలీసులు సాహసం... టెర్రరిస్టుల దుర్మార్గం.. ఉరితీయబడ్డ కసబ్.. ఏం చేసాడు.. వంటి విషయాలు కూలంకషంగా తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. అలాకాదు.. రెగ్యులర్... కమర్షియల్ చిత్రం చూడాలి... అని ఆశించే వారు కాస్త దూరంగా ఉండటమే బెస్ట్.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  The Attacks of 26/11 is a 2013 crime-thriller film, based on the 2008 Mumbai attacks directed by Ram Gopal Varma released today. In the first half, Ram Gopal Varma chronicles the events about how the terrorists came and attack the various buildings in the city and it is very interesting to watch on screen. But the second half and the climax turn out to be a test to viewers' patience with the slow and dragging scenes between Nana Patekar and Sanjeev Jaiswal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X