»   » RX 100 మూవీ రివ్యూ: ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరి

RX 100 మూవీ రివ్యూ: ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరి

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rx 100 Movie Review | RX 100 మూవీ రివ్యూ

  Rating:
  3.5/5
  Star Cast: కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేష్, రాంకీ
  Director: అజయ్ భూపతి

  టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు, విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా కంటెంట్ ఉండే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రం RX 100. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈచిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  ఆర్ ఎక్స్ 100 కథ

  శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.

  ఆర్ ఎక్స్ 100 కథలో ట్విస్టులు

  ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు. ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకొంటుంది. ఆ ట్విస్టు వల్ల సినిమా క్లైమాక్స్‌ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX 100 చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  శివ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్‌లో కథ ప్రేక్షకుడు ఊహించని విధంగా మరోస్థాయికి వెళ్తుంది. సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య వేగం పెరిగి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. క్లైమాక్స్‌లో సాధారణంగా ఊహించిన దాని కన్నా అనేక ట్విస్టులు తెర మీద ఆవిష్కృతం కావడంతో ఆడియెన్స్‌ థ్రిల్‌గా ఫీలవుతారు. కార్తీ, పాయల్, రావు రమేష్, రాంకీ పవర్ ప్యాక్ ఫెర్మార్మెన్స్‌తో క్లైమాక్స్‌ అదిరిపోతుంది. ఒక ఎమోషనల్ ఎండింగ్‌తో సినిమా అద్భుతమైన నోట్‌తో ముగుస్తుంది.

  అజయ్ భూపతి మేకింగ్

  దర్శకుడు అజయ్ భూపతి నేటివిటి నేపథ్యంగా రాసుకొన్న కథ గ్రామీణ వాతావరణం అద్దం పట్టింది. గ్రామస్థాయి రాజకీయాలు, ఊర్లలో ఉండే నాటు సరసం, ప్రేమను చక్కగా ఒడిసిపట్టుకొని అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఫీల్‌గుడ్ అంశాలతో సినిమాను ముందుకు తీసుకెళ్తూ చివరగా ఎమోషనల్ అంశాలతో ముగించడం ఆయన ప్రతిభ గీటురాయిగా నిలిచింది. చివరి 25 నిమిషాల్లో సినిమాను నడిపించిన తీరు శెభాష్ అనిపించేలా ఉంది. తొలిభాగంలో మరికొంత దృష్టిపెట్టి ఉంటే ప్రేక్షకుల్లో ఏమైనా కొంత కలిగే అసంతృప్తిని కూడా తుడిచిపెట్టడానికి ఆస్కారం ఉండేది. ఆర్‌ఎక్ష్ 100 సినిమా చూస్తే కొత్త దర్శకుడు తీసిన సినిమా అని ఎక్కడా అనిపించదు.

  శివగా జీవించిన కార్తీకేయ

  ఆర్ ఎక్స్ 100 చిత్రం హీరో కార్తీకేయకు తొలి పరిచయం. శివ క్యారెక్టర్‌లో కార్తీకేయ చూపిన వేరియేషన్స్ ఇటీవల కాలంలో మరే హీరోకు దక్కలేదని చెప్పవచ్చు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, అన్యాయానికి గురైన యువకుడిగా, ప్రియురాలి మోసానికి గురై ఆవేదన చెందే ప్రియుడిగా ఇలా ఎన్నో షేడ్స్‌ను ఆ క్యారెక్టర్‌లో చూడవచ్చు. ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లోను బాగా రాణించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఇరుగదీశాడు. కార్తీకేయ రూపంలో టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన హీరో లభించాడనే చెప్పవచ్చు. సరైనా పాత్రలను ఎంపిక చేసుకుంటే మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది.

  గ్లామర్‌తో అదరగొట్టిన పాయల్

  పాయల్ రాజ్‌పుత్ పోషించిన ఇందు పాత్ర ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసి ఉండకపోవచ్చు. హీరోయిన్లు పాటలకు, అందాల ఆరబోతకే పరిమితవుతున్నారనే విమర్శకు చెక్ పెట్టే విధంగా ఇందు పాత్రను దర్శకుడు రూపొందించారు. క్యారెక్టర్‌కు తగినట్టే పాయల్ ఆ పాత్రలో జీవించింది. తొలిభాగంలో రొమాంటిక్ సన్నివేశాల్లోనూ డామినేట్ చేసింది. అలాగే సెకండాఫ్‌లో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో పాయల్ చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

  రావు రమేశ్ పవర్ ఫుల్‌గా

  ఆర్ ఎక్స్ 100 చిత్రంలో రావు రమేస్ మరోసారి చక్కటి పాత్రను పోషించారు. తొలి భాగంలో విశ్వనాథం పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించినప్పటికి.. సెకండాఫ్‌లో ఆయన పాత్రను మలిచిన తీరు, ఆ పాత్రలో రావు రమేష్ జీవించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయనకు విశ్వనాథం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే పాత్ర అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రావు రమేష్ నటన అమోఘం అని చెప్పవచ్చు.

  రాంకీ నటన

  తెలుగు సినిమాలకు చాలా కాలంగా దూరమైన సింధూరపువ్వు రాంకీ మరోసారి తెరపై మెరుపులు మెరిపించారు. గాడ్ ఫాదర్ లాంటి పాత్రను అవలీలగా రక్తికట్టించాడు. భావోద్వేగాల మధ్య సాగే పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. రొటీన్‌కు భిన్నంగా అద్భుతమైన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారారు. మిగితా పాత్రల్లో దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దయానంద్ రెడ్డి గుర్తుండిపోతారు.

  మ్యూజిక్, ఎడిటింగ్

  ఆర్ఎక్స్ 100 చిత్రానికి ప్రాణం సంగీతం. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు సిట్యువేషనల్‌గా బాగున్నాయి. రీరీకార్డింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సెకండాఫ్‌లో సినిమాకు రీరికార్డింగ్ ప్రాణంగా నిలిచింది. ఎడిటర్ ప్రవీణ్ పనీతరు చాలా క్రిస్పీగా ఉంది. సెకండాఫ్ ఆయన టాలెంట్‌కు నిదర్శనమని చెప్పవచ్చు. తొలిభాగంలో అక్కడక్కడ కొన్ని కత్తెర్లు పడటానికి స్కోప్ ఉంది.

  సినిమాటోగ్రఫీ

  రామిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫి సూపర్ అని చెప్పవచ్చు. ఏరియల్ షాట్స్, ఛేజింగ్ సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ, అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నడిచే సన్నివేశాల మూడ్‌, ఎమోషన్‌ను ఎలివేట్ చేయడానికి క్రియేట్ చేసిన వాతావరణం బాగుంది.

  ప్రోడక్షన్ వ్యాల్యూస్

  కార్తీకేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ఆర్ ఎక్స్ 100 చిత్రానికి నిర్మాతగా అశోక్ రెడ్డి గుమ్మకొండ వ్యవహరించారు. సినిమాను రిచ్‌గా తెరకెక్కించిన విధానం బాగుంది. టెక్నికల్ విభాగాలకు సంబంధించిన నిపుణుల ఎంపిక, నటీనటుల సెలక్షన్ నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. కొత్త బ్యానర్ అయిపన్పటికీ అనుభవం ఉన్న ప్రొడక్షన్ సంస్థ రూపొందించిన చిత్రంగా అనిపిస్తుంది. చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు చాలా ప్రొఫెషనల్‌గా ఉంది.

  ఫైనల్‌గా

  లవ్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన చిత్రం RX 100. దర్శకుడిగా అజయ్ భూపతి, కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. యూత్‌కు నచ్చే విధంగా రూపొందింది. చిత్ర రెండో భాగంలో ఉండే భావోద్వేగా అంశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టచ్ చేసేలా ఉంది. తొలిభాగంలో స్లో నేరేషన్ అనిపించినప్పటికీ కథకు లోబడి మాత్రమే సినిమా ముందుకెళ్తుంది. పక్కాగా నేటివిటి చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే అంశాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఓవర్సీస్, మల్టీప్లెక్స్ ఆడియెన్స్ చేరువైతే సక్సెస్‌లో ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అనే స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి.

  బలం, బలహీనతలు

  కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ యాక్టింగ్
  అజయ్ భూపతి టేకింగ్
  వైవిధ్యమైన కథ, కథనాలు
  సినిమాటోగ్రఫీ, రీరికార్డింగ్

  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్
  మితి మీరిన రొమాన్స్

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేశ్, రాంకీ
  దర్శకత్వం: అజయ్ భూపతి
  నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ
  మ్యూజిక్: చైతన్‌ భరద్వాజ్‌
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : స్మరన్‌
  సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి
  ఎడిటింగ్: ప్రవీణ్
  రిలీజ్ డేట్: జూలై 12, 2018

  English summary
  Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 movie which released on July 12th. Starring Karthikeya and Payal, the film is an intense love story. Teasers, Trailers created lot of buzz in the industry. Before its release, high expectations in audience. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more