»   » ‘ఇంటిలిజెంట్’ రివ్యూ : వినాయక్ నుండి ఆశించింది దక్కలేదు....

‘ఇంటిలిజెంట్’ రివ్యూ : వినాయక్ నుండి ఆశించింది దక్కలేదు....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Inttelligent Movie Review
Rating:
2.0/5

మెగా డైరెక్టర్ వివి వినాయక్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.... ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇంటిలిజెంట్' సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను వినాయక్ తన కమర్షియల్ ఫార్ములాతో హిట్ బాట పట్టిస్తాడని అంతా నమ్మకంగా ఎదురు చూశారు. గతంలో నాయక్, తులసి, లక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కారణమైంది. మరి ఈ సనిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది సమీక్షలో చూద్దాం.....

 కథ

కథ

నంద కిషోర్ (నాజర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి పేద ప్రజలకు సహాయం అందేలా చేయడంతో పాటు, తనూ నలుగురికి సహాయం చేస్తుంటాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయి ధరమ్ తేజ్‌ టాలెంట్ గ్రహించిన నందకిషోర్ తన ఖర్చుతో మన హీరోను చదవిస్తాడు. పెరిగి పెద్దయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన హీరో బయటి కంపెనీల్లో పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా లెక్కచేయకుండా నందకిషోర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ నలుగురికీ సహాయం చేయడంలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. అంతా సవ్యంగా జరిగితే సినిమా ఎలా అవుతుంది?... సీన్లోకి విలన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్) ఎంటరవుతాడు. కంపెనీ తన పేరున రాయాలని బెదిరిస్తాడు. వినక పోవడంతో నందకిషోన్‌ను చంపేసి కంపెనీ తన పేరున రాయించుకుంటాడు. తాను ఇంతటివాడిని కావడానికి కారణమైన బాస్‌ను చంపిన వారిపై హీరో ఎలా రివేంజ్ తీసుకున్నాడు? అనేది మిగతా కథ.

 సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ వంకపెట్టే విధంగా ఏమీలేదు... అదే సమయంలో గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎప్పటిలాగే రోటీన్ గా కనిపించాడు. ధర్మాభాయ్ పాత్రలో ప్రత్యేక శైలి చూపించలేకపోయాడు. ఫైట్స్‌ ఇరగదీశాడు... చమక్ చమక్ ఛాం పాటలో చిరంజీవిని గుర్తు చేశాడు.

 లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి

హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిమితమైన పాత్రలో కనిపించింది. నటించడానికి అవకాశం కూడా లేదు. కేవలం పాటల్లో నటించడానికే అన్నట్లు ఆమె పాత్ర ఉంది. అది కూడా సరిగా చేయలేక పోయింది. సాయి ధరమ్ తేజ్ సరసన డాన్స్ స్టెప్పులు వేయడంలో తేలిపోయింది. కాళ్లు, చేతులు, నడుము ఆడించడం తప్ప రిథమ్ కనపించలేదు. డ్యూయెట్ సాంగులపై ఈ ఎఫెక్టు బాగా కనిపించింది.

 ఇతర పాత్రలు

ఇతర పాత్రలు

సినిమాలో ఇతర పాత్రల గురించి మాట్లాడుకుంటే.... నంద కిషోర్ పాత్రకు నాజర్ పూర్తి న్యాయం చేశారు. విలన్ పాత్రల్లో కనిపించి రాహుల్ దేవ్, దేవ్ గిల్... పవర్‌ఫుల్ గా కనిపించలేదు. హోం మినిస్టర్ పాత్రలో వినీత్ కుమార్, పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ఫర్వాలేదు.

 కమెడియన్లు

కమెడియన్లు

సినిమాలో బ్రహ్మానందం, బద్రం, పృథ్వి, రాహుల్ రామకృష్ణ, నల్లవేణు, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ఫిష్ వెంకట్ తదితర కమెడియన్లు ఉన్నా సినిమాలో పెద్దగా కామెడీ పండలేదు. సినిమా మొత్తం మీద ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించలేదు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఎస్వీ విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. తమన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేకున్నా ఓకే అనొచ్చు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది. సికె ఎంటర్టెన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బావున్నాయి.

 ఆకుల శివ కథ

ఆకుల శివ కథ

ఆకుల శివ అందించిన స్టోరీ పరమ రోటీన్‌గా ఉంది. సాదా సీదా రివేంజ్ డ్రామా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. వెతుకుదామన్నా సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా కనిపించదు. దీనితోడు లాజీక్ లేని సీన్లు కూడా ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తాయి.

 వివి వినాయక్ సినిమా హ్యాండిల్ చేసిన తీరు

వివి వినాయక్ సినిమా హ్యాండిల్ చేసిన తీరు

వివి వినాయక్ సినిమా అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉంటాయని ప్రేక్షకులు థియేటర్లకువస్తారు. అయితే వినాయక్ తన స్థాయికి తగిన విధంగా సినిమాను హ్యాండిల్ చేయలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్లు, కామెడీ సీక్వెన్స్ ఇలా ఏ విషయంలోనూ వినాయక్ ముద్ర కనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్‌గా ఉంది.

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్, మైనస్ పాయింట్స్

సాయి ధరమ్ తేజ్, సినిమాటోగ్రఫీ, చమక్ చమక్ ఛాం రిమిక్స్...ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథనం, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి.

 స్నేక్ గ్యాంగ్‌కు, సినిమాకు లింకు ఉందా?

స్నేక్ గ్యాంగ్‌కు, సినిమాకు లింకు ఉందా?

ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు వివి వినాయక్ స్నేక్ గ్యాంగ్ గురించి తమ సినిమాలో కొన్ని సీన్లు చూపించామని చెప్పారు. కానీ సినిమాలో కేవలం పాములతో చంపే ఓ సీన్ తప్ప... ఆ గ్యాంగ్ గురించి ఏమీ లేదు. అది జస్ట్ పబ్లిసిటీ స్టంటే అని మనం అర్థం చేసుకోవాలి.

 చివరిగా

చివరిగా

కేవలం వివి వినాయక్ బ్రాండ్ నేమ్ ప్రేక్షకుడిని థియేటర్ వరకు నడిపించింది. కానీ ప్రేక్షకుడికి అక్కడ వినాయక్ నుండి ఆశించిన ఎంటర్టెన్మెంట్ దక్కలేదు. సాయి ధరమ్ తేజ్‌లో టాలెంట్ ఉన్నా హిట్ కథలు ఎంపిక చేసుకోవడంతో మరోసారి తడబడ్డాడు.

 ఇంటిలిజెంట్

ఇంటిలిజెంట్

తారాగణం: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి

కథ, మాటలు: శివ ఆకుల
సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
ఆర్ట్‌: బ్రహ్మ కడలి
ఫైట్స్‌: వెంకట్‌
డాన్స్‌: శేఖర్‌, జాని
సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
నిర్మాత: సి.కళ్యాణ్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

English summary
Sai Dharam Tej "Inttelligent" movie review. Intelligent produced by C. Kalyan on CK Entertainments banner and directed by V. V. Vinayak. Starring Sai Dharam Tej, Lavanya Tripathi in the lead roles. Nassar, Brahmanandam,Posani Krishna Murali ,Saptagiri play a key role in the film and music composed by Thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu