twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సంభవామి యుగే యుగే'

    By Staff
    |

    Sambhavami
    సినిమా: సంభవామి యుగే యుగే
    విడుదల తేదీ: 10-3-2006
    నటీనటులు: జాక్‌, రాజా, పేర్రాజు, కళ్యాణ్‌,
    మురళి, సాయికృష్ణ, కృష్ణచైతన్య తదితరులు
    మాటలు: యతిరాజ్‌ లక్కీ భూపాల్‌
    సంగీతం: అనిల్‌ రెడ్డి
    కెమెరా: కోడూరు నరేంద్రరెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, కోడూరు మధుసూదనరెడ్డి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవివర్మ

    అంతా కొత్తవాళ్ళతో ఓ కొత్త దర్శకుడు సినిమా తీయడం అభినందనీయమే. కానీ మనది కాని కథను చూపించి మెప్పించాలనుకోవడం మాత్రం సాహసం. బ్రెజిల్‌లో హిట్‌ అయిన 'సిటీ ఆఫ్‌ గాడ్‌'ని తెలుగు తెరకెక్కించేటప్పుడు మన నేటివిటీ కి ఆ నేపధ్యం సరిపోతుందో లేదో చూసుకోకుండా చేయడం పెద్ద పొరపాటు. దానితో ఒక పరాయి దేశపు కథను చూస్తున్న ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది.

    స్ధానిక మాఫియా వేటుకు తెగిపడిన ముగ్గురు స్నేహితుల కథ ఇది. అంజి, షాలిని, అలి చిన్నప్పుడు మిత్రులు. పేదరికం వారిని ఇబ్బంది పెట్టినా స్నేహాన్ని మాత్రం విడదీయదు. వీరిలో అలీ మూగవాడు. వీరుండే పేట ( అది ఏ రాష్ట్రమో, ఏ దేశమో తెలిఅయదు)ని మల్లేష్‌ అనే మాఫియా నాయకుడు ఏలుతుంటాడు. గంజాయి వ్యాపారం, తుపాకులతో వ్యవహారం స్ధానిక కుర్రాళ్ళను ఆకర్షిస్తాయి. కాలక్రమంలో మల్లేష్‌ అనుచరుడు గోపీతో షాలిని ప్రేమలో పడుతుంది. గర్భిణి కూడా అవుతుంది. మరో వైపి అలీ ప్రేయసిపై మల్లేష్‌ కన్నేసి అనుభవించి చంపేస్తాడు. ఆ గొడవలో అలీ తలిదండ్రులను కోల్పోతాడు. మూడో మిత్రుడు అంజికి ఫోటోగ్రాఫర్‌ కావాలని ఆశ. మిత్రులిద్దరూ ఇలా మల్లేష్‌ చేతిలో పడ్డారని తెలిసినా ఏమీ చేయలేడు. ఈలోగా షాలిని ప్రేమించిన వాడిని వేరెవరో చంపేస్తారు. దానితో నెలలు నిండిన ఆమె ఆబాధ్యత అంజి మీద పడుతుంది. ఇంత సుదీర్ఘ కథ చాలదన్నట్టు మల్లేష్‌కి ఆగర్భ శత్రువు ఎర్రోడు ఉంటాడు. అతను అలీని చేరదీసి మల్లేష్‌ని చంపించాలని పథకాలు వేస్తుంటాడు. ఇలా ఎవరి ట్రాకులో వాళ్ళు కథను క్లెయిమాక్స్‌లోకి తీసుకెళ్ళారన్నది తెరమీద చూడాల్సిందే.

    'సిటీ ఆఫ్‌ గాడ్‌' వంటి వాస్తవిక సినిమాను అక్కడి జీవన పరిస్ధితుల ఆధారంగా నిర్మించారు. అదే కథను తీసుకుని తెలుగులో సినిమా చేయాలనుకున్నప్పుడు స్ధానిక వాతావరణాన్ని, నేపధ్యాన్ని తీసుకోవాలి. అలా చేయకపోవడంతో సినిమా అంతా తుపాకులు, హత్యలు ఉన్నా ప్రేక్షకుడికి ఏమీ పట్టదు. ఒరిజినల్‌ సినిమా కొత్త కథనంతో అక్కడి ప్రేక్షకులు లీనమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆక్కడ పాపులర్‌ నవల ఆధారంగా తీశారు కాబట్టి. తెలుగులో కథ ఎక్కడో ప్రారంభమై ఎక్కడికి పోతుందో తెలియదు. ఇది ముగ్గురు స్నేహితుల కథో, లోకల్‌ మాఫియా కథో అర్ధం కాదు. విలన్‌ హైలైట్‌ కావడంతో ప్రధాన పాత్రలు పాసివ్‌గా మారిపోతాయి. దర్శకత్వం చెప్పికోదగిన విధంగా లేదు. సినిమా సాంకేతికంగా కూడా నాసిరకంగా ఉంది. విలన్‌ పాత్ర వేసిన జాకీ బాగా నటించాడు. రీ రికార్డింగ్‌ ఫర్వాలేదు. పాటలు రెండు బాగున్నాయి. షాట్‌ డివిజన్‌ మెరుగ్గా ఉంటే కెమెరా పనితనం బాగా కన్పించేది. ఈ సినిమా పబ్లిసిటీ బాగా చేయడంతో మొదటిరోజు కలెక్షన్లు బాగున్నా సినిమా నిలదొక్కుకోవడం కష్టమే.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X