»   » ‘సంపూ’ అరాచకాన్ని ఆస్వాదించే వారికే... (వైరస్ రివ్యూ)

‘సంపూ’ అరాచకాన్ని ఆస్వాదించే వారికే... (వైరస్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: 'హృదయ కాలేయం' తర్వాత టాలీవుడ్లో సంపూర్ణేష్ బాబు రూపంలో మరో కామెడీ స్టార్ ఆవతరించాడు. ఆ సినిమా వల్ల సంపూకు వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. సంపూ నటిస్తున్న సినిమాలు ఎలా ఉంటాయి? ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా? అనే విషయానికి సంబంధం లేకుండా..... టాలీవుడ్లో 'సంపూ' అనేది కామెడీ బ్రాండ్ అయిపోయింది.

తనకు మాత్రమే సాధ్యమైన డిఫరెంట్ మేనరిజం, విచిత్రమైన స్మైల్, చూడ్డానికి వీడు హీరో ఏంట్రా? అని నవ్వొచ్చేలా కటౌట్..... ఇవన్నీ సంపూ ప్రత్యేకతలు. అందుకే సంపూ టాలీవుడ్లో బర్నింగ్ స్టార్‌గా ఎదిగాడు, తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరచుకున్నాడు.


తాజాగా సంపూ నటించిన www.వైరస్.com చిత్రం ఈ రోజు(జూన్ 30) రిలీజైంది. అసలు సినిమా ద్వారా సంపూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాడు? అసలు సినిమాలో ఏముంది? ప్రేక్షకులు అలరిస్తుందా? లేదా? అనేది ఓ లుక్కేద్దాం....


కథలోకి వెళితే...

కథలోకి వెళితే...

కిట్టు(సంపూర్ణేష్ బాబు) ఓ ప్రొఫెషనల్ హ్యాకర్. అమెరికాలో నెలకు 20 లక్షలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఇతడు.... ఉన్నట్టుండి ఆ ఉద్యోగాన్ని వదిలేసి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని వంశీ ఎన్క్లేవ్ అనే అపార్టుమెంటులో కేవలం రూ. 5 వేల జీతానికి కేబుల్ బాయ్‌గా చేరుతాడు. అపార్టుమెంటులోని అందరి ఇళ్లలో, వాళ్ల బెడ్రూముల్లో కూడా వారికి తెలియకుండా సిసి కెమెరాలు పెట్టి వాళ్లు ఏం చేస్తున్నారని పరిశీలిస్తూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతూ ఉంటాడు.


www.వైరస్.comకు, సంపూకు సంబంధం ఏమిటి?

www.వైరస్.comకు, సంపూకు సంబంధం ఏమిటి?

ఈ క్రమంలోనే అపార్టుమెంట్ ప్రెసిడెంట్ రాఘవరావు హత్య జరుగుతుంది. ఆ నేరం కిట్టూ మీద పడుతుంది. పోలీసులు అతన్ని అరెస్టు చేస్తే.... దేశంలోనే పెద్ద లాయర్ శ్యాంజఠ్మలానీ వచ్చి సంపూకు బెయిల్ ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోతారు. అమెరికాలో అంత మంచి జీవితాన్ని, జీతాన్ని వదిలేసి.... కిట్టూ ఇక్కడ ఇలాంటి జీవితం ఎందుకు గడుపుతున్నాడు? www.వైరస్.comకు, సంపూకు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.


సంపూ పెర్ఫార్మెన్స్ అరాచకం

సంపూ పెర్ఫార్మెన్స్ అరాచకం

సంపూ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే..... అయన్ను అభిమానించే వారికి అది కామెడీ, మిగతా వారికి అదో అరాచకం. పెర్ఫార్మెన్స్‌తోనే అరాచకం సృష్టించగల హీరో టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది సంపూ మాత్రమే. అలా అని ఇక్కడ సంపూ నటనను కించపరుస్తున్నట్లు భావించవద్దు. ఎవరి స్టైల్, ఎవరి మేనరిజం వారికి ఉంటాయి. సంపూ నటనను ఇష్టపడే వారు ఉన్నట్లే.... ఇదేం పెర్ఫార్మెన్స్‌రా బాబూ అని బెంబేలెత్తిపోయే వారూ ఉన్నారు. అందుకే ఇక్కడ సంపూ నటన బావుంది? బాగోలేదు అని..... మేము జడ్జిమెంట్ చేయడం కష్టమే. ఒక్క విషయం మాత్రం చెప్పగలం. గత సినిమాల్లో సంపూ ఎలా ఉన్నాడో, ఈ సినిమాలోనూ సంపూ అలానే కనిపించాడు.


ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

హీరోయిన్‌గా నటించిన గీత్ షాను.... నటనకంటే పాటలకే ఎక్కువ వాడేశారు. నటన, అందం పరంగా ఆమె జస్ట్ యావరేజ్. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాత్ర వాచ్ మెన్ బాబా పాత్రలో నటించిన వెన్నెల కిషోర్. సినిమాలో వెన్నెల కిషోర్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఆ విషయం ఇపుడే చెబితే మీరు థ్రిల్ మిస్సవుతారు కాబట్టి అందుకే చెప్పడం లేదు. పెర్ఫార్మెన్స్ పరంగా వెన్నెల కిషోర్‌ బాగా చేశాడు. ఇంతకు మించి సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.


మ్యూజిక్, సినిమాటోగ్రపీ

మ్యూజిక్, సినిమాటోగ్రపీ

ఈ చిత్రానికి సంగీతం మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ అందించారు. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్.... చాలా యావరేజ్‌గా ఉంది. ఇక సినిమాలో టెక్నికల్ అంశాలపరంగా సినిమాటోగ్రఫీ ది బెస్ట్ గా ఉంటే సినిమాలోని చాలా మైనస్ లు కవర్ చేయవచ్చు. కానీ ఇక్కడ వి.జె సినిమాటోగ్రఫీకి అంత శక్తి లేదని తేలిపోయింది.


ఇతర విభాగాలు

ఇతర విభాగాలు

ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ పనితీరు కూడా అంతగొప్పగా ఏమీ లేదు. మాటలు అందించిన దుర్గాప్రసాద్ రాయుడు ఎక్కువగా ప్రాసలకే ప్రాధాన్యం ఇచ్చాడు.... డైలాగ్స్ అక్కడక్కడా కాస్త ఫర్వాలేదనే చెప్పొచ్చు. నిర్మాతలు సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల నిర్మాణ విలువలు యావరేజ్.


రోటీన్ కథ, కథనం... కామెడీ లేమి

రోటీన్ కథ, కథనం... కామెడీ లేమి

ఏ సినిమాకైనా కథే ప్రధాన బలం.... కథ కాస్త అటు ఇటుగా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకుడిని సంతృప్తి పరచవచ్చు. ఈ సినిమా విషయంలో కథ చాలా రొటీన్, ఇక స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేదు. పేరుకే కామెడీ సినిమా గానీ ఎక్కడ కామెడీ పేలలేదు. అయితే సినిమాలో అసలు విలన్ ఎవరో చెప్పకుండా చివరి వరకు కాస్త సస్పెన్స్ మెయింటేన్ చేసి సినిమా క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చాడు.


కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ గురించి...

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ గురించి...

ఏ దర్శకుడైనా నటీనటుల దగ్గర నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టినపుడే సినిమా మరింత అదంగా ఉంటుంది. సినిమాలో ఎవరైనా నటుడు బాగా చేయలేదు అనే ఫీలింగ్ వచ్చిదంటే అది పూర్తిగా దర్శకుడి బాధ్యతే. ఈ విషయంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు.


చివర్లో మంచి సందేశం

చివర్లో మంచి సందేశం

సినిమా ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే చివర్లో మంచి సందేశం ఇచ్చారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా అతి వాడకం వల్ల ప్రస్తుతం మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయి.... వాటి ప్రభావం ఇప్పటి పిల్లలపై, మనపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతోంది. ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం బాగా చూపారు.


క్లైమాక్స్‌లో అదరగొట్టిన సంపూ

క్లైమాక్స్‌లో అదరగొట్టిన సంపూ

సినిమాకు శుభం కార్డు పడే ముందు.... సంపూ తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. ఒక మామూలోడు ఇంటర్నెట్‌ను బాగా వాడుకుని బర్నింగ్ స్టార్ అయ్యాడు.... కానీ కొందరు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో మోజులో చెడు దారులు పడుతూ తమ జీవితాలను బర్న్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్లో బ్రతకడం మానేసి మనుషులతో కలిసి బ్రతుకుదాం అనే మీనింగ్ వచ్చేలా సంపూ చివర్లో చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి..


ఫైనల్ వర్డ్...

ఫైనల్ వర్డ్...

www.వైరస్.com మూవీ గురించి ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే.... కథ కథనంతో పని లేకుండా సంపూ వెరైటీ పెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేసే అభిరుచి మీకు ఉంటే సినిమా ఓకే అనిపిస్తుంది.English summary
Burning Star Sampoornesh Babu's latest film released to packed theatres on Friday . Directed by SR Krishna, 'Virus' is a comedy-action flick that deals with the issue of social media's influence in our lives and how it helps the film's protagonist to solve a murder mystery. The film has Sampoornesh Babu, Geeta Shah, Nidisha and Chammak Chandra in pivotal roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more